కరెంటు అఫైర్స్ : ఏప్రిల్ 2022 | బిజినెస్ & ఎకానమీ అంశాలు
Telugu Current Affairs

కరెంటు అఫైర్స్ : ఏప్రిల్ 2022 | బిజినెస్ & ఎకానమీ అంశాలు

ఐఎస్ఎన్'తో పింగ్‌పాంగ్ పేమెంట్స్ భాగస్వామ్య ఒప్పందం

అమెరికన్ కొనుగోలుదారులకు మరియు భారతీయ విక్రేతల మధ్య సులభతరమైన ఈ కామర్స్ చెల్లింపు సేవలు అందించేందుకు గాను చైనా ఫిన్‌టెక్ యునికార్న్ పింగ్‌పాంగ్ ప్రెమెంట్స్ సంస్థ, ఇండియా సోర్సింగ్ నెట్‌వర్క్‌ (ISN) తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. పింగ్‌పాంగ్ ప్రెమెంట్స్ 2015 లో ప్రారంభించబడింది. ఇది గ్లోబల్ ఈ కామర్స్ లావాదేవీలను సులభతరం చేసే లక్ష్యంతో మార్కెట్లోకి ప్రవేశించింది.

Advertisement

ఫార్మ్ఈజీ బ్రాండ్ అంబాసిడర్‌గా అమీర్ ఖాన్‌

ప్రముఖ కంజ్యూమర్ హెల్త్‌కేర్ యాప్ ఫార్మ్ఈజీ తన బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్'ను నియమించుకుంది. ఫార్మ్ఈజీ బ్రాండ్‌'ను ప్రముఖ ఏపీఐ హోల్డింగ్స్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఈ భాగస్వామ్యం బ్రాండ్ అభివృద్ధికి మరియు భారతదేశంలో ఆరోగ్య సంరక్షణపై వినియోగదారుల అవగాహనను పెంచడంలో సహాయపడుతుంది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనా 5.7 శాతానికి పెంపు

ప్రపంచ  వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న సరఫరా అడ్డంకులు, ముడి చమురు ధరలు మరియు ముడి పదార్థాల అధిక ధరల కారణంగా ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను 4.5 శాతం నుండి 5.7 శాతానికి పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఫిబ్రవరిలో జరిగిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) సమావేశంలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బిఐ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనా 4.5 శాతంగా అంచనా వేయబడింది. అలానే సెంట్రల్ బ్యాంక్ యొక్క ద్రవ్య విధాన కమిటీ రుణ రేటు లేదా రెపో రేటును 4% వద్ద స్థిరంగా ఉంచింది. ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు 7.2% శాతంగా ఉండనున్నట్లు తెలిపింది.

టాటా డిజిటల్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్

టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అధికారికంగా టాటా డిజిటల్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. టాటా కంపెనీ ఇటీవలే టాటా న్యూ బ్రాండ్ తో ఈ కామర్స్ రంగంలోకి ప్రవేశించింది.  ఈ వేదిక ద్వారా BigBasket, 1mg, Croma, AirAsia, IHCL, Qmin, Starbucks, Tata Cliq, Tata Play వంటి డిజిటల్ సేవలను ఒక ఉమ్మడిగా నిర్వహించనుంది.

నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్మన్‌గా డాక్టర్ సుమన్ కె బెరీ

డాక్టర్ సుమన్ కె బెరీ, నీతి ఆయోగ్ కొత్త వైస్ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఈయన మే 1వ తేదీ నుండి నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఆదిత్య బిర్లా క్యాపిటల్ తదుపరి సీఈఓగా విశాఖ మూలేని

ఆదిత్య బిర్లా క్యాపిటల్ తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విశాఖ మూలే నియమితులయ్యారు. విశాఖ మూలే  ప్రస్తుతం కార్పొరేట్ బ్యాంకింగ్, ప్రొప్రైటరీ ట్రేడింగ్, మార్కెట్లు మరియు లావాదేవీల బ్యాంకింగ్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె గతంలో ఐసిఐసిఐ లాంబార్డ్ మరియు ఐసిఐసిఐ వెంచర్స్'లో కూడా పనిచేసారు.

గ్లోబల్ హెల్త్‌కేర్ రిచ్ లిస్ట్‌లో సైరస్ పూనావాలా అగ్రస్థానం

హెల్త్‌కేర్ సెక్టార్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావల్లా అత్యంత సంపన్న బిలియనీరుగా అవతరించారు. 2022 హురున్ గ్లోబల్ హెల్త్‌కేర్ రిచ్ లిస్ట్‌లో 26 బిలియన్ డాలర్ల భారీ నికర విలువతో ప్రపంచ హెల్త్‌కేర్ సెక్టార్‌ కుబేరుడుగా అవతరించాడు. ఈ జాబితాలో థామస్ ఫ్రిస్ట్ జూనియర్ & ఫ్యామిలీ ఆఫ్ హెచ్‌సిఎ హెల్త్‌కేర్ రెండవ స్థానంలో ఉంది.

సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది 1966 లో సైరస్ పూనావాలాచే స్థాపించబడిన భారతీయ బయోటెక్నాలజీ మరియు బయోఫార్మాస్యూటికల్స్ కంపెనీ. ఇది పూణేలో ఉంది. ఇది వ్యాక్సిన్‌ల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది.

పీ&జీ ఇండియా సీఈఓగా ఎల్వీ వైద్యనాథన్‌

ప్యాకేజ్డ్ కంజ్యూమర్ గూడ్స్ కంపెనీ ప్రోక్టర్ & గాంబుల్, తమ సంస్థ భారతదేశ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఇండోనేషియా వ్యాపార అధిపతి ఎల్వీ వైద్యనాథన్‌ను నియమించింది. ఆయన జులై 2022 నుండి ప్రస్తుత సీఈఓగా ఉన్న మధుసూదన్ గోపాలన్‌ స్థానంలో ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా భర్తీ చేస్తారని ప్రోక్టర్ & గాంబుల్ తెలిపింది.

ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీకి 5వ స్థానం

అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రపంచంలోని 5వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఫోర్బ్స్ సంపన్నుల జాబితా ప్రకారం బెర్క్‌షైర్ హాత్‌వే సీఈవో వారెన్ బఫెట్‌ను అధిగమించి, 122.3 బిలియన్ డాలర్లతో అదానీ 5వ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో ఆయనకంటే ముందు ఎలోన్ మస్క్ ($219 B), జెఫ్ బెజోస్ ($171 B), బెర్నార్డ్ ఆర్నాల్ట్ & కుటుంబం ($158 B), బిల్ గేట్స్ ($129 B) లు టాప్ 4లో ఉన్నారు.

ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన ఎలోన్ మస్క్

ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు ఎలోన్ మస్క్ వెల్లడించారు. అమెరికాకు చెందిన ఈ మైక్రోబ్లాగింగ్ సంస్థ 2006 లో ప్రారంభించబడింది. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధినేతలు, వృత్తి నిపుణు ఎక్కువ ఉపయోగించే ఈ వేదిక ఇప్పుడు ఎలోన్ మస్క్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుత ఈ సంస్థ సీఈఓగా ఇండియాకు చెందిన పరాగ్ అగర్వాల్ ఉన్నారు.

Advertisement

Post Comment