Advertisement
ఏపీ కార్పొరేట్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్ పథకం 2023
Scholarships

ఏపీ కార్పొరేట్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్ పథకం 2023

ఏపీ కార్పొరేట్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్ పథకం కింద ప్రభుత్వ పాఠశాల నుండి 10వ తరగతిలో అత్యధిక మెరిట్ సాధించిన ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, కాపు మరియు వికలాంగు విద్యార్థులకు టాప్ కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో ఉచిత ఇంటర్మీడియట్ అడ్మిషన్ కల్పిస్తుంది. ఈ పథకం పరిధిలో ఎంపికైన విద్యార్థులకు కార్పొరేట్ జూనియర్ కాలేజీలో పూర్తి ఉచితంగా రెండేళ్ల రెసిడెన్సియల్ ఇంటర్మీడియట్ విద్యను అందిస్తారు.

స్కాలర్షిప్ పేరు ఏపీ కార్పొరేట్ జూనియర్ కాలేజీ అడ్మిషన్స్ పథకం
స్కాలర్షిప్ టైప్ కార్పొరేట్ అడ్మిషన్స్
ఎవరికి అందిస్తారు ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, కాపు మరియు వికలాంగు విద్యార్థులు
అర్హుత ప్రభుత్వ పాఠశాలల్లో 10 ఉత్తీర్ణత

ఏపీ కార్పొరేట్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్ పథకం ఎలిజిబిలిటీ

పదివ తరగతిలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణతయిన ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, కాపు మరియు వికలాంగు విద్యార్థులు ఈ పథకం పరిధిలోకి వస్తారు. సదురు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లో పదివ తరగతి చదువుకుని ఉండాలి. 10వ తరగతి సప్లమెంటరీలో ఉత్తీర్ణత అయిన వారు ఈ పథకాన్ని అర్హులు కారు. అడ్మిషన్లు పదిలో సాధించిన మెరిట్ ఆధారంగా కల్పిస్తారు.

ఏపీ కార్పొరేట్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్ పథకం దరఖాస్తు

అర్హుత ఉన్న విద్యార్థులు జన్మభూమి వెబ్సైటులో ఉండే కార్పొరేట్ కాలేజీ స్కీమ్ ట్యాబ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. టెన్త్ హాల్ టికెట్ నెంబర్ సహాయంతో లాగిన్ అయ్యి, దరఖాస్తులో అడిగిన వివరాలను తప్పులు దొర్లకుండా నమోదు చేసి, సంబంధిత ధ్రువపత్రాలతో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

విజయవంతంగా నమోదు అయినా తర్వాత విద్యార్థి మొబైల్ నంబరుకు ఓటీపీ అందుతుంది. సదురు నెంబర్ ఎంటర్ చేసిన ఆమోదం తెలపడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఎంపికైన విద్యార్థులకు అడ్మిషన్ వివరాలు మొబైల్ నెంబరుకు పంపిస్తారు.

Post Comment