Advertisement
ఇంటర్మీడియట్ తర్వాత ప్రవేశ పరీక్షలు
Career Guidance Career Options

ఇంటర్మీడియట్ తర్వాత ప్రవేశ పరీక్షలు

ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్య వైపు అడుగులు వేచే విద్యార్థులు, మొదట చేర్చించేది ప్రవేశ పరీక్షల గురించి. ఈ ఆలోచన ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో అడుగు పెట్టగానే ప్రారంభమౌతుంది. నిజానికి విద్యార్థి సమస్య ప్రవేశపరీక్షలు కాదు. వారి ప్రధాన సమస్య, ఇంటర్ తర్వాత కెరీర్ ఎంపిక చేసుకోవడం. విద్యార్థి ఏ రంగంలో ఉన్నత విద్య చేయాలో నిర్చయమైతే ప్రవేశ పరీక్షల ఎంపిక సులభమౌతుంది. దానికంటే ముందు ఇంటర్మీడియట్ తర్వాత, వివిధ ఉన్నత విద్య కోర్సుల కోసం ఏయే ప్రవేశపరీక్షలు అందుబాటులో ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు

ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థుల కోసం పదుల సంఖ్యలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో స్టేట్ స్థాయిలో జరిగే ఎంసెట్ నుండి, నేషనల్ లెవెల్'లో జరిగే జేఈఈ, ప్రీమియర్ ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లు నిర్వహించే వివిధ ఎంట్రీ టెస్టులు వరకు అనేకం రాసేందుకు అవకాశం ఉంది. విద్యార్థి జాయిన్ అవ్వాలనుకునే ఇనిస్టిట్యూట్ ఆధారంగా లేదా లొకాలిటీ ఆధారంగా లేదా విద్యార్థి సామర్ధ్యత, అకాడమిక్ రికార్డులు, ఆర్ధిక వనరులను బేరీజు వేసుకొని వాటిలో ఒకదానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్థి ఐఐటీ లలో ఇంజినీరింగ్ చేయాలంటే జేఈఈ, రాష్ట్రస్థాయి యూనివర్సిటీలు, ఇనిస్టిట్యూట్లలో చేయాలనుకుంటే ఎంసెట్, అలానే దేశంలో ఉండే ఇతర ప్రీమియర్ మరియు డ్రీమ్డ్ టెక్నికల్ ఇనిస్టిట్యూట్లలో చేయాలనుకుంటే వాటికీ సంబందించిన ప్రవేశ పరీక్షా రాయాల్సి ఉంటుంది.
ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు

ఇంటర్మీడియట్ తర్వాత మెడికల్ ప్రవేశ పరీక్షలు

ఇంటర్ తర్వాత మెడికల్ కోర్సులలో చేయాలనుకునే విద్యార్థులు, జాతీయస్థాయిలో నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రాయాల్సి ఉంటుంది. ఇదివరకు AIIMS, JIPMER ప్రవేశ పరీక్షలు ఆయా కాలేజీల కోసం ప్రత్యేకంగా నిర్వహించే వారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉండే అన్ని మెడికల్ కాలేజీల్లో నీట్ ర్యాంకింగ్ ఆధారంగానే ప్రవేశాలు నిర్వహిస్తున్నారు.

ఇంటర్మీడియట్ తర్వాత ఇతర ప్రవేశ పరీక్షలు

ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులతో పాటుగా ఎన్నో ఉన్నత విద్య అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆయా కోర్సులలో చేరేందుకు వాటికి సంబంధించిన ఎంట్రన్స్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా అగ్రికల్చర్, ఫార్మసీ, మానేజ్మెంట్, లా, సోషల్ సైన్సెస్, టీచింగ్, డిజైనింగ్ వంటి వివిధ కోర్సులలో చేరేందుకు ఏయే ప్రవేశపరీక్షలు అందుబాటులో ఉన్నాయో చూద్దాం.

Post Comment