Advertisement
న్యూజిలాండ్‌లో హయ్యర్ ఎడ్యుకేషన్ : కోర్సులు, వీసా ప్రక్రియ, స్కాలర్‌షిప్‌లు
Abroad Education

న్యూజిలాండ్‌లో హయ్యర్ ఎడ్యుకేషన్ : కోర్సులు, వీసా ప్రక్రియ, స్కాలర్‌షిప్‌లు

ప్రశాంత వాతావరణంలో టాప్ లెవెల్, క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ అందించే దేశాలలో న్యూజిలాండ్ మొదటి వరుసలో ఉంటుంది. విద్యావ్యవస్థ సంస్కరణలలో న్యూజిలాండ్ చూపినంత చొరవ ప్రపంచంలో ఏ దేశమూ చూపలేదు. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్లు అన్నీ ప్రభుత్వం కనుసన్నలలో నిరంతర పరివేక్షణలో నిర్వహించబడతాయి. న్యూజిలాండ్ యూనివర్శిటీలు అన్నీ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగులో టాప్ 3% జాబితాలో ఉన్నాయి. ఇక్కడ బోధన సిబ్బంది TALIS ప్రపంచ ప్రొఫిషినలిజం ర్యాంకింగులో 4వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ యూనివర్సిటీలు అందించే క్వాలిఫికేషన్ ఫ్రేంవర్క్ ఇంటర్నేషనల్ జాబ్ మార్కెట్ యందు ప్రత్యేక గుర్తింపు కలిగిఉంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన న్యూజిలాండుకు ఏటా 30 నుండి 40 వేల మంది విదేశీ విద్యార్థులు ఉన్నత విద్య చదివేందుకు  వస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Find a course

న్యూజిలాండ్ యూనివర్సిటీలు బిజినెస్ & మానేజ్మెంట్, ఇంజనీరింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సులకు ప్రసిద్ధి. వీటితో పాటుగా అగ్రికల్చర్, ఫుడ్ & హాస్పిటాలిటీ, ఫాషన్ డిజైనింగ్, డిజిటల్ డిజైనింగ్, టెక్నాలజీ ఇతర సైన్స్ & మ్యాథమెటిక్స్ కోర్సులు అందిస్తున్నాయి. కోర్సులు అన్నీ స్కిల్ బేస్డ్ ఫార్మేట్ లో రూపొందించబడి ఉంటాయి. విద్యార్థి కోర్సు పూర్తిచేసేసరికి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు యందు పూర్తిస్థాయి ప్రాక్టికల్ నాలెడ్జ్ తో యూనివర్సిటీ నుండి బయటకు వస్తాడు. ఏదిఏమైనా విద్యార్థి భవిష్యత్ వారు ఎంపిక చేసుకున్న కోర్సు పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి కోర్సు ఎంపిక చేసుకునే ముందు ఆ కోర్సుకు సంబంధించి భవిష్యత్ డిమాండ్ అంచనా వేచి తగు సరైన నిర్ణయం తీసుకోండి.

Apply for your course

న్యూజిలాండ్ యూనివర్సిటీలు రెండు ధపాలలో అడ్మిషన్లు కల్పిస్తాయి. ఫస్ట్ సెమిస్టరు ఫిబ్రవరి - జూన్ మధ్యలో (సమ్మర్ అడ్మిషన్స్), సెకండ్ సెమిస్టరు జులై - నవంబర్ (వింటర్ అడ్మిషన్స్) మధ్యలో నిర్వహిస్తారు. సమ్మర్ అడ్మిషన్లు డిసెంబర్, జనవరిలో నిర్వహిస్తారు. వింటర్ అడ్మిషన్లు మే, జూన్ నెలలో జరుపుతారు. షార్ట్ టర్మ్ సమ్మర్ ప్రోగ్రామ్స్ అడ్మిషన్లు కూడా మే, జూన్ నెలలలో ఉంటాయి. ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్, టెర్శరీ ఎడ్యుకేషన్లో భాగంగా అందిస్తారు.

న్యూజిలాండులో 8 టాప్ లెవెల్ పబ్లిక్ యూనివర్సిటీలు, 16 ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ & పాలిటెక్నిక్స్ (ITPs), 550 పైగా ప్రైవేట్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ (PTEs) లు ఉన్నాయి. వీటి నుండి మీకు అందుబాటులో ఉండే ఉత్తమ యూనివర్సిటీ కోసం సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు వివరాలు సమగ్ర పరిశీల తర్వాత అడ్మిషన్ లెటర్ (ఆఫర్ ఆఫ్ ప్లేస్) జారీ చేస్తారు. స్టూడెంట్ వీసా పొందేందుకు ఆఫర్ ఆఫ్ ప్లేస్ తప్పనిసరి. కొన్న్ని యూనివర్శిటీలు కోర్సు ఫీజు చెల్లించక మాత్రమే ఆఫర్ ఆఫ్ ప్లేస్ జారీ చేస్తాయి.

ప్రవేశ పరీక్షలు

ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఉత్తీర్ణత తప్పనిసరి

యూనివర్సిటీల నుండి Letter of acceptance పొందాలంటే విద్యార్థి IELTS (International English Language Testing System), TOEFL (Test of English as a Foreign Language), PTE (Pearson Test of English) వంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అర్హుత పరీక్షలలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మెజారిటీ న్యూజిలాండ్ యూనివర్సిటీలు IELTS, TOEFL స్కోరును ప్రామాణికంగా తీసుకుంటాయి. 6 to 7.5 మధ్య IELTS స్కోరు, 65 to 80 మధ్య TOEFL స్కోరు సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ దొరికే అవకాశం ఉంటుంది.

న్యూజిలాండ్ టాప్ 8 యూనివర్శిటీలు

Apply For Student Visa

ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు న్యూజిలాండ్ ప్రభుత్వం నాలుగు రకాల వీసాలను జారీచేస్తుంది. మూడు నెలలకు మించి నిడివి ఉండే కోర్సులలో చేరే విద్యార్థులకు జనరల్ స్టూడెంట్ వీసా జారీ చేస్తుంది. షార్ట్ టర్మ్ కోర్సులలో చేరే విద్యార్థులు విజిటింగ్ వీసాకు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఒకటికి మించి కోర్సులలో చేరే విద్యార్థులు పాత్ వే స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీసా గరిష్టంగా 5 ఏళ్ళ నిడివితో అందిస్తారు. కోర్సు పూర్తిచేసాక ఉద్యోగ అనుభవం కోసం లేదా ఇంటెర్షిప్ చేసే ఆలోచన వున్నా విద్యార్థుల కోసం పోస్ట్ స్టడీ వర్క్ వీసా జారీ చేస్తుంది. ఇది గరిష్టంగా మూడు ఏళ్ళ వరకు చెల్లుబాటు అవుతుంది.

Type Student Visa  Purpose of visa Validity period
Student visa Full-time courses 2 Years
Visitor visa short-time courses - Up to 6 months 6 Months
Pathway student visa Study up to three consecutive courses 5 Years
Post-study work visa Allow to work After Studies 3 Years

వీసా దరఖాస్తు ప్రక్రియను మూడు నుండి 6 నెలలు ముందుగా పూర్తిచేసుకోవాలి. విదేశాలకు ఉన్నత విద్యకోసం పోయే విద్యార్థులు ప్రధానంగా రెండు అంశాల యందు దృష్టి సారించాలి. అందులో మొదటిది యూనివర్సిటీ అడ్మిషన్ కాగా రెండవది కోర్సు పూర్తిచేసినందుకు అవసరమయ్యే ఫైనాన్సియల్ సోర్సెస్. విద్యార్థి వీసా ఆమోదం పొందేందుకు ఈ రెండు అంశాలు ఖచ్చితంగా ఉండి తీరాలి. వీసా అధికారులు వీటినే ప్రధానంగా పరిశీలిస్తారు.

యూనివర్శిటీ నుండి Letter of acceptance అందిన వెంటనే విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ధ్రువపత్రాలతో న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ పోర్టల్ లేదా దగ్గరలో ఉండే వీసా అప్లికేషన్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసే వారు ఇమిగ్రేషన్ పోర్టల్ యందు రిజిస్టర్ అవ్వాలి. దరఖాస్తు అందిన తర్వాత బయోమెట్రిక్ మరియు ఇమిగ్రేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ కోసం కబురు చేస్తారు. ఇదే సందర్భలో వీసా అధికారి దరఖాస్తు పరిశీలన చేస్తారు. దరఖాస్తులో ఉండే అంశాలు, విద్యార్థి చెప్పే సమాదానాలు ద్వారా వీసా అధికారి సంతృప్తి పొందితే 3 నుండి 4 వారాలలో వీసా జారీచేస్తారు. వీసా దరఖాస్తు చార్జీలు $300 డాలర్లకు అటుఇటుగా ఉంటాయి.

స్టూడెంట్ వీసా ఆమోదం పొందేందుకు కావాల్సిన డాక్యూమెంట్స్

  • ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకున్న యూనివర్సిటీ నుండి Acceptance Letter.
  • కోర్సు పూర్తిచేసినందుకు అవసరమయ్యే ఆర్థిక వనరులు కలిగి ఉన్నట్లు ఖచ్చితమైన లెక్కలతో ఫైనాన్స్ రిపోర్టు.
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • ఆధార్/ పుట్టిన తేదీ ధ్రువపత్రం, పెళ్ళైన వారు మ్యారేజ్ సర్టిఫికెట్.
  • 6 నెలల ముందుగా ఆమోదం పొందినా పాసుపోర్టు.
  • నేర చరిత్ర లేనట్లు police certificates.
  • మెడికల్ ఇన్సూరెన్సు

Cost of study in New Zealand

న్యూజిలాండ్ విద్య రుసుములు యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలకు సరి సమానంగా ఉంటాయి. న్యూజిలాండ్  యందు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను $20,000 నుండి $25,000 డాలర్ల వరకు, పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ $20,000 నుండి  $30,000 డాలర్లతో పూర్తిచేయొచ్చు. నెలవారీ జీవన వ్యయాల బడ్జెట్ కూడా $12,000 నుండి $15,000 డాలర్లకు మధ్యలోనే వుంటుంది. సాధారణ ఇండియన్ ప్రీమియం ఇనిస్టిట్యూట్ పెట్టె ఖర్చుతో న్యూజిలాండులో ఉన్నత విద్య పూర్తిచేయొచ్చు.

స్టూడెంట్ వీసా కలిగిన విదేశీ విద్యార్థులకు యూనివర్సిటీ పరిధిలో వారానికి 20 గంటల వరకు పార్ట్ టైమ్ జాబ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. వేసవి సెలవులు, ఇతర సెలవు దినాలలో పూర్తిస్థాయి ఉద్యోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. అలానే న్యూజీలాండ్ ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌లు, ఇతర విద్యా రాయితీలు, విదేశీ విద్యార్థులకు కొంతలో కొంత ఉపశమనం కల్గిస్తాయి.

Study program Average annual fee
Undergraduate program $20,000 to $25,000
Postgraduate master's degree $20,000 to $30,000
Doctoral degree $8,000 to $10,000
Management programs $30,000 to $50,000
Living expenses Average Budget 
Accommodation $700 to $1000 pm
Living costs Up to $15,000 pm
visa and permit $285
Health & insurance $400 and $600 per year

Scholarships & Education Loans

విద్యార్థులకు ఉపయోగపడే వెబ్‌సైట్లు

Post Comment