Advertisement
ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ మరియు ఎంటెక్ కోర్సులు
Universities

ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ మరియు ఎంటెక్ కోర్సులు

ఆంధ్ర యూనివర్సిటీ సైన్స్ & టెక్నాలజీ సబ్జెక్టులకు సంబంధించి పదుల సంఖ్యలో పీజీ కోర్సులు అందిస్తుంది. ఈ కోర్సులు ఆంధ్ర యూనివెర్సిటీతో పాటుగా దాని అనుబంధ పీజీ కాలేజీల్లో అందుబాటులో ఉంటాయి. ఈ కోర్సులకు సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ ఏపీ పీజీసెట్ యందు సాధించిన మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు.

ఏయూ పీజీ కోర్సులు రెండేళ్ల నిడివితో అందిస్తున్నారు. ఈ రెండేళ్లలో అభ్యర్థులు నాలుగు సెమిస్టరు పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఒక సెమిస్టరు యందు పాస్ కాని అభ్యర్థులు, వచ్చే ఏడాది అదే సెమిస్టరు పరీక్షకు హాజరుకావడం ద్వారా ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది.

సైన్స్ & టెక్నాలజీ పీజీ కోర్సులకు సంబంధించి అభ్యర్థులు ఏదైనా సైన్స్ బ్యాచిలర్ డిగ్రీ యందు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. విద్యార్థుల వయస్సు 20 ఏళ్ళ నుండి గరిష్టంగా 35 ఏళ్ళ మధ్య ఉండాలి. కోర్సులు సంబంధించి సీట్ల వివరాలు మరియు ట్యూషన్ ఫీజుల వివరాలు కౌన్సిలింగ్ సమయంలో అందుబాటులో ఉంచుతారు.

  • M.Sc. స్టాటిస్టిక్స్
  • M.Sc. అప్లైడ్ మ్యాథమెటిక్స్
  • MA / M.Sc. మ్యాథమెటిక్స్
  • M.Sc. ఫిజిక్స్
  • M.Sc.స్పేస్ ఫిజిక్స్
  • M.Sc. న్యూక్లియర్ ఫిజిక్స్
  • M.Sc. మెట్రోలజి
  • M.Sc. భౌతిక ఓషనోగ్రఫీ
  • M.Sc. (టెక్.) జియోఫిజిక్స్
  • M.Sc. మెరైన్ జియోఫిజిక్స్
  • M.Sc. హైడ్రాలజీ
  • M.Sc. బయోకెమిస్ట్రీ
  • M.Sc. బయోటెక్నాలజీ
  • M.Sc. అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ
  • M.Sc. హార్టికల్చర్ & ల్యాండ్‌స్కేప్ మేనేజ్‌మెంట్
  • M.Sc. కెమిస్ట్రీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ & అనాలిసిస్ ఆఫ్ ఫుడ్స్, డ్రగ్స్ & వాటర్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఎనలిటికల్ కెమిస్ట్రీ, బయో-
  • ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, మెరైన్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ)
  • M.Sc. అప్లైడ్ కెమిస్ట్రీ
  • M.Sc. ఎన్విరాన్మెంటల్ సైన్సెస్
  • M.Sc. మైక్రోబయాలజీ
  • M.Sc. బోటనీ
  • M.Sc. జువాలజీ
  • M.Sc. మెరైన్ బయాలజీ మరియు ఫిషరీస్
  • M.Sc. కోస్టల్ ఆక్వాకల్చర్ & మెరైన్ బయోటెక్నాలజీ
  • M.Sc. మెరైన్ బయోటెక్నాలజీ
  • M.Sc. కంప్యూటర్ సైన్స్ & స్టాటిస్టిక్స్
  • M.Sc. మానవ జన్యుశాస్త్రం
  • M.Sc. మాలిక్యులర్ జెనెటిక్స్
  • M.Sc. జియాలజీ
  • M.Sc. మెరైన్ జియాలజీ
  • M.Sc. (టెక్.) అప్లైడ్ జియాలజీ (3 సంవత్సరాల వ్యవధి)
  • M.Sc. (టెక్.) ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్
  • M.Sc. (టెక్.) DSP. & ESD.
  • M.Sc. (టెక్.) వి.ఎస్.ఎల్.ఐ డిజైన్, M.Sc. ఫిషరీ సైన్స్, M.Sc. ఆక్వాకల్చర్
  • M.Sc. ఇండస్ట్రియల్ ఫిషరీస్
  • M.Sc. ఫుడ్స్, న్యూట్రిషన్ & డైటెటిక్స్
  • M.Sc. భౌగోళిక
  • M.Sc. ఆంత్రోపాలజీ
  • ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ జియాలజి
  • M.Tech. పెట్రోలియం ఎక్సప్లోరేషన్
  • M.Tech. వాతావరణ శాస్త్రం.
  • M.Tech. ఓషియానిక్ సైన్స్

Post Comment