తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 10, 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 10, 2023

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 10, 2023. జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు తాజా సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఇవి రూపొందించబడ్డాయి.

Advertisement

ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ ముఖ్యాంశాలు

ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనేది వ్యూహాత్మక వాణిజ్యం మరియు రవాణా కారిడార్‌ను రూపొందించడానికి ఉద్దేశించిన ఒక ఆర్థిక చొరవ. భారతదేశం, మధ్యప్రాచ్యం మరియు యూరప్‌లను కలుపుతూ రైలు, రోడ్డు మరియు సముద్ర మార్గాలతో కూడిన సమగ్ర రవాణా నెట్‌వర్క్‌ను రూపొందించడం దీని లక్ష్యం. ఇది రెండు దశలలో రూపుదిద్దుకోనుంది. అందులో మొదటిది తూర్పు కారిడార్ - ఇది భారతదేశాన్ని అరేబియా గల్ఫ్‌కు కలుపుతుంది. రెండవది ఉత్తర కారిడార్ - ఇది గల్ఫ్‌ను ఐరోపాకు కలుపుతుంది.

ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఆలోచనను ఇటీవలే భారత అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ ప్రాంతాల మధ్య రవాణా సామర్థ్యాన్ని పెంపొందించడం, రవాణా ఖర్చులను తగ్గించడం, ఆర్థిక ఐక్యతను పెంచడం, ఉపాధిని సృష్టించడం మరియు గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించడం దీని లక్ష్యం.

ఈ ఎకనామిక్ కారిడార్ ఇంకా అభివృద్ధి ప్రారంభ దశలోనే ఉంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై ప్రభుత్వాలు మరియు వ్యాపార సంస్థల నుండి ఆసక్తి పెరుగుతోంది. ఈ కారిడార్‌ను నిర్మిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది. ఈ కారిడార్ ఇరాన్, ఇరాక్, టర్కీ, బల్గేరియా, గ్రీస్ మరియు ఇటలీతో సహా అనేక దేశాల గుండా వెళుతుంది.

ఈ ప్రాజెక్ట్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ (PGII) భాగస్వామ్యంలో భాగం. పీజీఐఐ అనేది తక్కువ మరియు మధ్య-ఆదాయ దేశాల యొక్క అపారమైన అవస్థాపన అవసరాలను తీర్చడానికి మద్దతు ఇచ్చే పారదర్శకమైన మౌలిక సదుపాయాల భాగస్వామ్యం. ఈ ప్రాజెక్టు కోసం భారతదేశం, యూఎస్, సౌదీ అరేబియా, యూఏఈ, యూరోపియన్ యూనియన్ , ఇటలీ, ఫ్రాన్స్ మరియు జర్మనీలు సంతకం చేసాయి.

ఈ ప్రాజెక్టు భారతదేశంలో ముంద్రా (గుజరాత్), కాండ్లా (గుజరాత్), మరియు జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (నవీ ముంబై) ఓడరేవును కలుపుతుంది. మధ్యప్రాచ్యంలో యూఏఈలోని ఫుజైరా, జెబెల్ అలీ & అబుదాబి అలాగే సౌదీ అరేబియాలోని దమ్మామ్ & రస్ అల్ ఖైర్ ఓడరేవులు, రైల్వే లైన్ ఫుజైరా పోర్ట్, హైఫా పోర్ట్ (ఇజ్రాయెల్) దీని పరిదిలోకి వస్తాయి. అలానే సౌదీ అరేబియాలోని ఘువైఫత్ & హరద్ మరియు జోర్డాన్ఇ, జ్రాయెల్ యొక్క హైఫా పోర్ట్ కూడా దీనిలో భాగంగా ఉండనున్నాయి. యూరప్ ప్రాంతంలో గ్రీస్‌లోని పిరేయస్ పోర్ట్, దక్షిణ ఇటలీలోని మెస్సినా మరియు ఫ్రాన్స్‌లోని మార్సెయిల్ దీనితో కనెక్టు కానున్నాయి.

ఈ ఎకనామిక్ కారిడార్ ఇంకా ప్రణాళికా దశలోనే ఉంది. ఈ ప్రాజెక్టులో ఆర్థిక, పెట్టుబడి అంశాలకు సంబంధించి ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. అయితే ఇది ప్రమేయం ఉన్న దేశాలకు ప్రధాన ఆర్థిక చోదకంగా ఉండే అవకాశం ఉంది. ఈ కారిడార్ భారతదేశం, మధ్యప్రాచ్యం మరియు ఐరోపా మధ్య వాణిజ్యం మరియు పెట్టుబడులకు కొత్త మార్గాన్ని అందిస్తుంది. ఇది మధ్యప్రాచ్యంలో ఆర్థిక వృద్ధిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.

ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ మీట్‌లో సోనోవాల్ ఇండియాకు ప్రాతినిధ్యం

రష్యాలో జరుగుతున్న 8వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ నాయకత్వం వహించారు. ఈఈఎఫ్‌ అనేది ఆర్థిక సహకారం మరియు అభివృద్ధి గురించి చర్చించడానికి ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని వ్యాపారాలు మరియు ప్రభుత్వ అధికారులను ఒకచోట చేర్చే ఒక ప్రధాన వార్షిక కార్యక్రమం. ఈ కార్యక్రమం రష్యాలోని ఓడరేవు నగరమైన వ్లాడివోస్టాక్‌లో నిర్వహించారు.

8వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ 10-13 సెప్టెంబర్ 2023లో ఫార్ ఈస్టర్న్ ఫెడరల్ యూనివర్సిటీ క్యాంపస్‌లోని వ్లాడివోస్టాక్‌లో నిర్వహించారు. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ అనేది రష్యన్ మరియు గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ కమ్యూనిటీల మధ్య సంబంధాలను ఏర్పరచుకోవడానికి మరియు బలోపేతం చేయడానికి వేదిక అందిస్తుంది. రష్యా యొక్క ఫార్ ఈస్ట్ యొక్క ఆర్థిక అభివృద్ధికి మరియు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అంతర్జాతీయ సహకారాన్ని విస్తరించడానికి 2015 లో రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క డిక్రీ ద్వారా ఈ తూర్పు ఆర్థిక ఫోరమ్ స్థాపించబడింది.

'నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్'ను ప్రారంభించిన భారత రాష్ట్రపతి

గుజరాత్ అసెంబ్లీ యొక్క నేషనల్ ఇ-విధాన్ అప్లికేషన్ (నెవా) ప్రాజెక్ట్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 11న ప్రారంభించారు. నెవా అనేది క్లౌడ్-ఆధారిత అప్లికేషన్, దీనిని భారత ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సహకారంతో అభివృద్ధి చేసింది. రాష్ట్ర శాసన సభల పనితీరు మరింత సమర్థవంతంగా మరియు పారదర్శకంగా ఉండేలా ఈ అప్లికేషన్ రూపొందించబడింది.

నేషనల్ ఇ-విధాన్ అప్లికేషన్ రాష్ట్ర శాసన సభల పనితీరులో గణనీయమైన మార్పును తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఈ అప్లికేషన్ అసెంబ్లీ సభ్యుల సమాచారాన్ని పొందేందుకు మరియు సభా కార్యక్రమాల వివరాలు పొందే ప్రక్రియను సులభతరం చేస్తుంది. ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి, ప్రజలతో కనెక్ట్ అయ్యేందుకు ఈ-విధాన్ ఎమ్మెల్యేలకు మరింత సహాయం చేస్తుంది. ఇది అసెంబ్లీని మరింత పారదర్శకంగా మరియు ప్రజలకు జవాబుదారీగా చేస్తుంది.

నజ్మా అక్తర్‌కు అకాడెమియా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

జామియా మిలియా ఇస్లామియా వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ నజ్మా అక్తర్‌కు అకాడెమియా 'ది లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. "మేకింగ్ ఇండియా ఎంప్లాయబుల్" పేరుతో జరిగిన గ్రాండ్ కాన్ఫరెన్స్ మరియు అవార్డు ఫంక్షన్‌లో ఆమెకు ఈ అవార్డును అందజేశారు.

ప్రొఫెసర్ అక్తర్ విద్యా రంగంలో 35 సంవత్సరాల అనుభవంతో ప్రఖ్యాత విద్యావేత్తగా మరియు పరిశోధకురాలుగా ప్రసిద్ధి చెందారు. ఆమె జామియా మిలియా ఇస్లామియాలోని ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ డీన్ మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌తో సహా పలు ప్రతిష్టాత్మకమైన పదవులను నిర్వహించారు. ప్రొఫెసర్ అక్తర్ భారతదేశంలో విద్యా రంగానికి చేసిన గణనీయమైన కృషికి గాను ఈ గౌరవం కల్పించారు.

విదేశీ పెట్టుబడిదారుల కోసం కొత్త వీసా విధానాన్ని ప్రకటించిన పాకిస్థాన్

విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి పాకిస్తాన్ కొత్త వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది. తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్-ఉల్-హక్ కకర్ దీనిని ప్రకటించారు. ఈ కొత్త విధానం ప్రకారం, విదేశీ వ్యాపారవేత్తలకు వారి స్వదేశాలు లేదా అంతర్జాతీయంగా జారీ చేసిన ఒకే పత్రం ఆధారంగా వీసాలు మంజూరు చేయబడతాయి. క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నంలో పాకిస్తాన్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంఘాలను ఆకర్షించడానికి కొత్త వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఈ కొత్త వీసా విధానం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు ఆర్థిక వృద్ధిని పెంచడానికి పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగం. కొత్త విధానం వల్ల విదేశీ పెట్టుబడిదారులు పాకిస్థాన్‌లో వ్యాపారం చేయడం సులభతరం అవుతుందని, ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త వీసా విధానాన్ని వ్యాపార వర్గాలు స్వాగతిస్తున్నాయి. కొత్త విధానం సరైన దిశలో ముందడుగు అని, పెట్టుబడుల గమ్యస్థానంగా పాకిస్థాన్ ప్రతిష్టను మెరుగుపరిచేందుకు ఇది దోహదపడుతుందని పాకిస్థాన్ బిజినెస్ కౌన్సిల్ పేర్కొంది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌కు టర్కీ మద్దతు

టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం చేస్తున్న బిడ్‌కు మద్దతు తెలిపారు. సెప్టెంబరు 10, 2023న ఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్‌లో ఎర్డోగాన్ చేసిన ప్రసంగంలో, "భారతదేశం లాంటి దేశం యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో ఉండటంను మేము గర్వపడతాం" అని అన్నారు.

యుఎన్‌ఎస్‌సిలోని ఐదు శాశ్వత సభ్యులైన చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్‌ను ప్రస్తావిస్తూ ప్రపంచం "ఐదు కంటే పెద్దది" అని ఎర్డోగాన్ అన్నారు. యుఎన్‌ఎస్‌సికి "రొటేషనల్" సభ్యత్వ వ్యవస్థ ఉండాలని, తద్వారా కౌన్సిల్‌లో మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని ఆయన అన్నారు.

శాశ్వత యుఎన్‌ఎస్‌సి సీటు కోసం భారతదేశం యొక్క బిడ్‌కు ఎర్డోగాన్ మద్దతు ముఖ్యమైనది. టర్కీ నాటోలో సభ్యు దేశంగా ఉంది. యునైటెడ్ స్టేట్స్‌తో కూడా సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. ఎర్డోగన్ మద్దతు భారతదేశం యొక్క బిడ్‌కు మద్దతు ఇచ్చేలా ఇతర దేశాలను ఒప్పించటానికి సహాయపడుతుంది.

భారతదేశం ప్రపంచంలోని నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యకలాపాలకు భారతదేశం కూడా ప్రధాన సహకారాన్ని అందిస్తోంది. భారతదేశం యొక్క పరిమాణం, జనాభా మరియు అంతర్జాతీయ సమాజానికి చేసిన సహకారం కారణంగా యుఎన్‌ఎస్‌సిలో భారతదేశం శాశ్వత సీటుకు అర్హుడని భారతదేశ మద్దతుదారులు భావిస్తున్నారు.

అంతర్జాతీయ శాంతి భద్రతల నిర్వహణకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రాథమిక బాధ్యత వహిస్తుంది. ఇందులో 15 మంది సభ్యులు ఉన్నారు. ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉంటుంది. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం, అన్ని సభ్యదేశాలు కౌన్సిల్ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. వీటిలో వీటో అధికారంతో 5 శాశ్వత సభ్యులుగా చైనా, ఫ్రాన్స్, రష్యన్ ఫెడరేషన్, యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ & నార్తర్న్ ఐర్లాండ్ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయి.

మిగతా 10 మంది నాన్-పర్మనెంట్ సభ్యులుగా ఉంటారు. వీరిలో ఐదుగురు ప్రతి సంవత్సరం జనరల్ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి ఎన్నుకోబడతారు. ఇది 24 అక్టోబర్ 1945 లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది.

Advertisement

Post Comment