ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పారామెడికల్ కోర్సులను 3 నెలల నిడివి నుండి మూడేళ్ళ నిడివితో అందిస్తున్నాయి. పది తర్వాత అందించే పారామెడికల్ కోర్సులు ఒకేషనల్ విద్యలో భాగంగా అందిస్తున్నారు. వీటిని డిప్లొమా కోర్సులుగా పరిగణిస్తారు. అలానే ఇంటర్ బైపీసీ అర్హుతలో రెండు నుండి మూడేళ్ళ నిడివితో బ్యాచిలర్ పారామెడికల్ కోర్సులను అందిస్తున్నారు. ఈ కోర్సులు స్టేట్ పారామెడికల్ బోర్డు ద్వారా ఆఫర్ చేస్తున్నారు.
పారామెడికల్ అనేది అత్యవసర వైద్య చికిత్స అందించే మెడికల్ విభాగం. పారామెడికల్ సిబ్బంది హాస్పిటల్ యందు, హాస్పిటల్ బయట ప్రాథమిక వైద్య సహాయాన్ని లేదా చికిత్సను అందజేస్తారు. దేశీయ వైద్య రంగంలో సమూల మార్పులు చోటు చేసుకోవడంతో పాటు, ఏటా విస్తరిస్తున్న ఈ రంగంలో పారామెడికల్ విద్యార్థులకు అపారమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
పారామెడికల్ పూర్తిచేసిన వారికి హాస్పిటల్స్ అత్యవసర విభాగాలలో ప్రధాన డాక్టరుకి సహాయ సిబ్బందిగా పనిచేసే అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా అంబులన్స్ యందు ప్రధమ చికిత్స చేసేందుకు , లాబ్స్ యందు వ్యాధి నిర్దారక పరీక్షలు జరిపేందుకు మరియు హాస్పిటల్ ఇంటా, బయట డాక్టర్ పర్యవేక్షణలో రోగికి క్లినికల్ సేవలు అందించేందుకు పారామెడికల్ సిబ్బంది అవసరం ఉంటుంది.
సర్టిఫికేటెడ్ పారామెడికల్ కోర్సులు
టెన్త్ తర్వాత 3 నెలల నుండి గరిష్టంగా రెండేళ్ల నిడివితో పారామెడికల్ సర్టిఫికేటెడ్ మరియు డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఈ కోర్సుల జాబితాలో DMLT (డిప్లొమా ఇన్ మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ), DHFM (డిప్లొమా ఇన్ హాస్పిటల్ అండ్ ఫుడ్ టెక్నాలజీ మేనేజిమెంట్), DOT (డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్), డిప్లొమా ఇన్ ఫీజియోథెరఫీ మరియు డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (F) వంటివి ఉన్నాయి.
పారామెడికల్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఆ సంబంధిత రంగాలలో స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుంది. లేదా హాస్పిటల్స్ యందు, మెడికల్ లాబరేటరీల యందు ఉపాధి పొందొచ్చు. పారామెడికల్ సిబ్బంది తమ వృత్తి అనుభవం మరియు పనిచేసే హాస్పిటల్ స్థాయి ఆధారంగా 8 వేల నుండి గరిష్టంగా 30 వేల వరకు జీతభత్యాలు పొందే అవకాశం ఉంటుంది.
అదే విధంగా ఉన్నత విద్య చేయాలనుకునే వారు ఒకేషనల్ డిప్లొమా కోర్సులతో పాటుగా ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సులు పూర్తిచేసిన వారు రాష్ట్ర ఎంసెట్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. అలానే బ్యాచిలర్ డిగ్రీల యందు అడ్మిషన్ పొందే అవకాశం కూడా ఉంటుంది.
పారామెడికల్ కోర్సుల యందు ప్రవేశాలు ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, నిమ్స్ మరియు ఆయా రాష్ట్రీయ, కేంద్రీయ యూనివర్సిటీలు ప్రతిఏటా విడుదల చేసే నోటిఫికేషన్‌ల ఆధారంగా నిర్వహిస్తారు. అడ్మిషన్లు ప్రవేశ పరీక్ష లేదా అకాడమిక్ మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు.
- DMLT (డిప్లొమా ఇన్ మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ)
- DHFM (డిప్లొమా ఇన్ హాస్పిటల్ అండ్ ఫుడ్ టెక్నాలజీ మేనేజిమెంట్)
- DOT (డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్)
- డిప్లొమా ఇన్ ఫీజియోథెరఫీ
- డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (F)
- ఎక్స్–రే టెక్నీషియన్
- డెంటల్ అసిస్టెంట్
- ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్
- నర్సింగ్ కేర్ అసిస్టెంట్
- ఈసీజీ, సీటీ స్కాన్ టెక్నీషియన్
- డయాలసిస్ టెక్నీషియన్
- న్యూట్రీషన్
డిప్లొమా పారామెడికల్ కోర్సులు
ఇంటర్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు స్టేట్ పారామెడికల్ బోర్డు ద్వారా రెండేళ్ల నిడివితో వివిధ పారామెడికల్ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. ఈ కోర్సులలో ప్రవేశాలు ఇంటర్ మెరిట్ ఆధారంగా లేదా ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల వారీగా దాదాపు 250 కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ పారామెడికల్ కాలేజీల యందు ఈ అడ్మిషన్లు నిర్వహిస్తారు.
ఈ కోర్సులు పూర్తి చేసిన వారు కార్పొరేట్ హాస్పిటల్స్ యందు పారామెడికల్ సిబ్బందిగా పనిచేసే అవకాశం అందిపుచ్చుకోవచ్చు. అలానే వీరు మంచి జీతభత్యాలు పొందే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ కోర్సులు పూర్తిచేసిన వారు స్వయం ఉపాధిని అవకాశం ఉంటుంది. అలానే ఉన్నత విద్య అవకాశాలు కూడా అందుబాటులో ఉంటాయి.
పారామెడికల్ డిప్లొమా | కోర్సు నిడివి |
---|---|
డిప్లొమా ఇన్ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ (D.Perfue) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ (DOA) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (DMPHA) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మానేజ్మెంట్ టెక్నిషియన్ (DHFSM) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ & ఆపరేషన్ థియేటర్ టెక్నిషియన్ (DMST) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నిషియన్ (DAM) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ డయాలిసిస్ టెక్నిషియన్ (DDIALY) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నిషియన్ (DMIT) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ (DMLT) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నిషియన్ (DREST) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ రేడియో థెరఫీ టెక్నిషియన్ (DRT) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నిషియన్ (DOM) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నిషియన్ (DDT) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ డెంటల్ హైజినిస్ట్ టెక్నిషియన్ (DDHY) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నిషియన్ (DANS) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ క్యాథ్ ల్యాబ్ టెక్నిషియన్ (DCLT) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ (DRGA) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ (DDRA) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నిషియన్ (DECG) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నిషియన్ (DCARDIO) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ పారామెడిక్ టెక్నిషియన్ (DEPT) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ & స్పీచ్ థెరఫీ (DHLST) | 2 ఏళ్ళు |
బీఎస్సీ పారామెడికల్ కోర్సులు
ఇంటర్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులు మరియు ఇంటర్ ఒకేషనల్ బయాలజీ బ్రిడ్జి కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు బీఎస్సీ పారామెడికల్ కోర్సులు చేసేందుకు అర్హులు. ఈ కోర్సులు మూడేళ్ళ నుండి గరిష్టంగా 4 ఏళ్ళ నిడివితో అందిస్తారు. ఈ కోర్సులలో ప్రవేశాలు ఇంటర్ మెరిట్ ఆధారంగా లేదా ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహిస్తారు.
ఈ కోర్సుల యందు ప్రవేశాలు ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఉస్మానియా మెడికల్ యూనివర్సిటీ, నిమ్స్ మరియు ఆయా రాష్ట్రీయ, కేంద్రీయ యూనివర్సిటీలు ప్రతిఏటా విడుదల చేసే నోటిఫికేషన్‌ల ఆధారంగా నిర్వహిస్తారు. అడ్మిషన్లు ప్రవేశ పరీక్ష లేదా అకాడమిక్ మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు
- బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ
- బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ
- బీఎస్సీ ఓటీటీ (ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ)
- బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ
- బీఎస్సీ ఎంఎల్‌టీ(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ)
- బీఎస్సీ ఎక్స్–రే టెక్నాలజీ
- బీఎస్సీ రేడియోగ్రఫీ
- బీఎస్సీ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ
- బీఎస్సీ మెడికల్ రికార్డ్ టెక్నాలజీ
- బీఏఎస్‌ఎల్‌పీ
- బీఎస్సీ ఆప్తాల్మిక్ టెక్నాలజీలో బీఎస్సీ
- బీఎస్సీ ఆడియాలజీ - స్పీచ్ థెరపీలో బీఎస్సీ;
- బీఎస్సీ ఆప్టోమెట్రీ
- బీఎస్సీ అనస్తీషియా టెక్నాలజీ