ఆర్‌ఆర్‌బి జూనియర్ ఇంజనీర్ (ఆర్‌ఆర్‌బి జేఈ), జూనియర్ ఇంజనీర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) మరియు కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) వంటి సిబ్బంది భర్తీకి ఆర్‌ఆర్‌బి జేఈ రిక్రూట్మెంట్ పరీక్షను నిర్వహిస్తుంది.
డిగ్రీ, డిప్లొమా మరియు ఇంజనీరింగ్ అభ్యర్థులతో భర్తీచేసే ఈ పోస్టులను 18 నుండి 33 ఏళ్ళ మధ్య వయసు ఉండే అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. నియామక ప్రక్రియ రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్షా మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది. అవసరమయ్యే పోస్టులకు మెడికల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు.
నియామక బోర్డు | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు |
నియామక పరీక్షా | జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ |
ఎంపిక ప్రక్రియ | రాత పరీక్ష/డాక్యుమెంట్ వెరిఫికేషన్ |
ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ | డిగ్రీ & ఇంజనీరింగ్ |
వయో పరిమితి | 18 - 33 ఏళ్ళ మధ్య |
ఆర్‌ఆర్‌బి జేఈ ఎలిజిబిలిటీ
- జాతీయత : ఇండియా/నేపాల్/భూటాన్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. 1 జనవరి 1962 ముందు భారత్ వచ్చి స్థిరపడిన టిబెటియన్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. భారతీయ మూలాలు కలిగి పాకిస్తాన్, బర్మా, శ్రీలంకా, తూర్పు ఆఫ్రికా దేశాలు కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ టాంజానియా (పూర్వం టాంగన్యికా మరియు జాంజిబార్), జాంబియా, మాలావి, జైర్, ఇథియోపియా మరియు వియత్నాం దేశాల నుండి శాశ్వతంగా భారత్ లో స్థిరపడేందుకు వచ్చే భారతీయ సంతతి కూడా అర్హులు.
- వయోపరిమితి: వివిధ పోస్టులను అనుసరించి 18 నుండి 33 ఏళ్ళ మధ్య వయస్సు ఉండే అభ్యర్థులు దరఖాస్తు చెయ్యొచ్చు. ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా 3 ఏళ్ళ వయోపరిమితి సడలింపు ఉంటుంది. షెడ్యూల్డ్ కులాల వారికీ గరిష్టంగా 5 ఏళ్ళు, వికలాంగులకు 10 ఏళ్ళు సడలింపు కల్పిస్తారు.
- విద్య అర్హుత : పోస్టు సంబంధిత బ్రాంచుల్లో డిగ్రీ లేదా ఇంజనీరింగ్ ఉత్తీర్ణతయినా అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
- ఫీజికల్ ప్రమాణాలు: ఆర్‌ఆర్‌బి రిక్రూట్మెంట్ బోర్డు నియామక నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాంగా ఉండాలి.
ఆర్‌ఆర్‌బి జేఈ దరఖాస్తు ఫీజు | |
---|---|
జనరల్ కేటగిరి అభ్యర్థులు | 500/- |
మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, వికలాంగులు, ESM అభ్యర్థులు | 250/- |
డిప్లొమా | ఎగ్జామ్ గ్రూపు |
మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ మెకాట్రోనిక్స్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెషిన్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ మెషిన్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ డై మేకింగ్ ఇంజనీరింగ్ | మెకానికల్ మరియు అలైడ్ ఇంజనీరింగ్ |
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సంబంధిత సబ్ ఎలక్ట్రికల్ గ్రూప్స్ | ఎలక్ట్రికల్ మరియు అలైడ్ ఇంజనీరింగ్ |
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | ఎలక్ట్రానిక్స్ మరియు అలైడ్ ఇంజనీరింగ్ |
సివిల్ ఇంజనీరింగ్ & బిఎస్సి ఇన్ సివిల్ ఇంజనీరింగ్ | సివిల్ ఇంజనీరింగ్ |
ప్రింటింగ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ | ప్రింటింగ్ టెక్నాలజీ |
బాచిలర్ డిగ్రీ | ఎగ్జామ్ గ్రూప్ |
బిఎస్సి కెమిస్ట్రీ & ఫిజిక్స్ | CMA |
ఇంజనీరింగ్ | ఎగ్జామ్ గ్రూప్ |
BE / B.Tech (కంప్యూటర్ సైన్స్), BE / B.Tech (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), PGDCA, B.Sc. కంప్యూటర్ సైన్స్, BCA | కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ |
ఆర్‌ఆర్‌బి జేఈ షెడ్యూల్ 2023
దరఖాస్తు ప్రారంభం | జనవరి 2023 |
దరఖాస్తు చివరి తేదీ | ఫిబ్రవరి 2023 |
స్టేజ్ I సీబీటీ | మే 2023 |
స్టేజ్ I సీబీటీ ఫలితాలు | జూన్ 2023 |
స్టేజ్ II సీబీటీ | ఆగస్ట్ 2023 |
స్టేజ్ II సీబీటీ ఫలితాలు | నవంబర్ 2023 |
ఆర్‌ఆర్‌బి జేఈ దరఖాస్తు విధానం
అర్హుత ఉన్న అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్'లో పొందిపర్చిన విదంగా బోర్డు అడిగిన వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు పారంభించే ముందు అవసరమయ్యే వివరాల్ని అందుబాటులో పెట్టుకోండి.
పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి. పోస్టు ఎంపిక, పరీక్షా కేంద్ర ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి. అప్లోడ్ చేసే ధ్రువపత్రాలు బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి.
దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేశాక అందుబాటులో ఉండే పేమెంట్ మార్గం ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి. దరఖాస్తు రుసుము చెల్లించని అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోబడవు. ఈ పరీక్షకు సంబంధించిన తేదీ, సమయం, పరీక్షా కేంద్రం మరియు ఇతర వివరాలను అర్హుత ఉన్న అభ్యర్థులకు ఆర్‌ఆర్‌బి నేరుగా అందజేస్తుంది
జోన్స్ వారీగా ఆర్‌ఆర్‌బి సమాచారం | |
---|---|
Ahmedabad www.rrbahmedabad.gov.in Phone : 079-22940858 | Jammu Srinagar www.rrbjammu.nic.in Phone : 0191-2476757 |
Ajmer www.rrbajmer.gov.in Phone: 0145 – 2425230 | Kolkata www.rrbkolkata.gov.in Phone: 033 – 25430108 |
Allahabad www.rrbald.nic.in Phone : 0532-2224531 | Malda www.rrbmalda.gov.in Phone : 03512-264567 |
Bangalore www.rrbbnc.gov.in Phone: 080 – 23330378 | Mumbai www.rrbmumbai.gov.in Phone : 022-23090422 |
Bhopal www.rrbbpl.nic.in Phone : 0755-2746660 | Muzaffarpur www.rrbmuzaffarpur.gov.in Phone : 0621-2213405 |
Bhubaneswar www.rrbbbs.gov.in Phone : 0674-2303015 | Patna www.rrbpatna.gov.in Phone: 0612-2677680 |
Bilaspur www.rrbbilaspur.gov.in Phone : 07752-247291 | Ranchi www.rrbranchi.gov.in Phone : 0651-2462429 |
Chandigarh www.rrbcdg.gov.in Phone: 0172 – 2730093 | Secunderabad www.rrbsecunderabad.nic.in Phone : 040-27821663 |
Chennai www.rrbchennai.gov.in Phone : 044-28275323 G | Siliguri www.rrbsiliguri.org Phone : 0353-2663840 |
orakhpur www.rrbgkp.gov.in Phone : 0551-2201209 | Guwahati www.rrbguwahati.gov.in Phone: 0361 – 2540815 |
Thiruvanthapuram www.rrbthiruvananthapuram.gov.in Phone : 0471-2323357 |
ఆర్‌ఆర్‌బి జేఈ ఎగ్జామ్ నమూనా
జూనియర్ ఇంజినీర్ల నియామక ప్రక్రియ ఈ క్రింది మూడు దశల్లో జరుగుతుంది.
- స్టేజ్ I సీబీటీ
- స్టేజ్ II సీబీటీ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఆర్‌ఆర్‌బి జేఈ - స్టేజ్ I సీబీటీ
మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్షా స్క్రీనింగ్ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తారు. పరీక్షా ఆన్‌లైన్ విధానంలో 100 మార్కులకు జరుగుతుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ పద్దతిలో ఉంటాయి. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్, జనరల్ అవెర్నెస్ మరియు జనరల్ సైన్స్ అంశాల నుండి ప్రశ్నలు ఇవ్వబడతాయి.
సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 1 మార్కు, తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు -0.25 మార్కులు ఇవ్వబడతాయి. ఈ పరీక్షలో కేటగిరి వారీగా అర్హుత మార్కులు కేటాయిస్తారు. జనరల్ కేటగిరి అభ్యర్థులు 40% కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓబీసీ మరియు ఎస్సీ అభ్యర్థులు 30%, ఎస్టీ అభ్యర్థులు 25% అర్హుత మార్కులు పొందడం తప్పనిసరి.
సిలబస్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
---|---|---|---|
మ్యాథమెటిక్స్ | 30 | 30 | 90 నిముషాలు |
జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్ | 25 | 25 | |
జనరల్ అవెర్నెస్ | 15 | 15 | |
జనరల్ సైన్స్ | 30 | 30 |
ఆర్‌ఆర్‌బి జేఈ - స్టేజ్ II సీబీటీ
స్టేజ్ I సీబీటీ లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు స్టేజ్ II సీబీటీ నిర్వహిస్తారు. ఖాళీ ఉన్న పోస్టుల సంఖ్యకు 15 రేట్లు మంది అభ్యర్థులను స్టేజ్ II కోసం ఎంపిక చేస్తారు. పరీక్షా ఆబ్జెక్టివ్ పద్దతిలో 150 మార్కులకు జరుగుతుంది. జనరల్ అవెర్నెస్, ఫిజిక్స్ & కెమిస్ట్రీ, బేసిక్ కంప్యూటర్ & అప్లికేషన్స్, బేసిక్ ఎన్విరాన్మెంట్ & పొల్యూషన్ కంట్రోల్ మరియు టెక్నికల్ ఎబిలిటీ సంబంధిత అంశాల నుండి ప్రశ్నలు ఇవ్వబడతాయి.
సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 1 మార్కు, తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు -0.25 మార్కులు ఇవ్వబడతాయి. ఈ పరీక్షలో కేటగిరి వారీగా అర్హుత మార్కులు కేటాయిస్తారు. జనరల్ కేటగిరి అభ్యర్థులు 40% కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓబీసీ మరియు ఎస్సీ అభ్యర్థులు 30%, ఎస్టీ అభ్యర్థులు 25% అర్హుత మార్కులు పొందడం తప్పనిసరి.
సిలబస్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
---|---|---|---|
జనరల్ అవెర్నెస్ | 15 | 15 | 120 నిముషాలు |
ఫిజిక్స్ & కెమిస్ట్రీ, | 15 | 15 | |
బేసిక్ కంప్యూటర్ & అప్లికేషన్స్ | 10 | 10 | |
ఎన్విరాన్మెంట్ & పొల్యూషన్ కంట్రోల్ | 10 | 10 | |
టెక్నికల్ అబిలిటీస్ | 100 | 100 |
డాక్యుమెంట్ వెరిఫికేషన్
స్టేజ్ II కంప్యూటర్ ఆధారిత పరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్థులకు చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఖాళీ ఉన్న పోస్టుల సంఖ్యకు 50% అదనపు అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఆహ్వానిస్తారు. అభ్యర్థులు రెండు ఫోటో కాపీలతో పాటుగా అవసరమయ్యే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరవ్వాల్సి ఉంటుంది.
స్టేజ్ II సీబీటీకి హాజరైన అభ్యర్థుల మార్కులను నార్మలైజషన్ ప్రక్రియ ద్వారా గణించి కేటగిరి వారి మెరిట్ లిస్టును తయారు చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం చివరి షార్ట్ లిస్ట్ రూపొందించి ఎంపికైన జాబితాను విడుదల చేస్తారు.