Advertisement
ఆంధ్ర యూనివర్సిటీలో దూర విద్య కోర్సులు మరియు ట్యూషన్ ఫీజులు
Distance Education

ఆంధ్ర యూనివర్సిటీలో దూర విద్య కోర్సులు మరియు ట్యూషన్ ఫీజులు

ఆంధ్ర యూనివర్సిటీ 1972 నుండి దూర విద్య అందిస్తుంది. పై చదువులకు నోచుకోని గృహాణిలు, విద్యార్థులు, ఉద్యోగస్తులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో దీన్ని స్థాపించారు. ఏయూ దూర విద్యకు యూజీసీ గుర్తింపు ఉంది.

దూర విద్య డిగ్రీలకు రెగ్యులర్ డిగ్రీ స్థాయి గుర్తింపు యూజీసీ కల్పిస్తుంది. ఏయూ దూర విద్యకు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఉంది. ఏయూని NAAC (నేషనల్ కమిషన్ ఫర్ కల్చర్ అండ్ ఆర్ట్) "A" గ్రేడ్ తో  అతి పురాతణ  యూనివర్సిటీగా గుర్తింపు కల్పించింది.

ఆంధ్ర యూనివర్సిటీ దాదాపు 50 రకాల దూర విద్య కోర్సులు అందిస్తుంది. ఇందులో షార్ట్ టర్మ్ సర్టిఫికేటెడ్ కోర్సులుతో పాటుగా డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ మరియు కొన్ని  పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి కాలవ్యవధి కనిష్టంగా 6 నెలల నుండి 3 ఏళ్ళ వరకు ఉంటుంది.

ఏయూ రెగ్యులర్ కోర్సులకు, దూర విద్య కోర్సులకు దాదాపు ఒకే రకమైన సిలబస్ కేటాయించడం వలన ఈ కోర్సులకు తెలుగు రాష్ట్రాల నుండి భారీ డిమాండ్ ఉంది. దీనితో ఏయూ ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను ప్రవేశ పెడుతూనే ఉంది.

ఏయూ దూర విద్య అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఏయూ మానేజ్మెంట్ గొప్ప సహకారాన్ని అందిస్తుంది. అడ్మిషన్ పొందిన వెంటనే వారికీ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తుంది. పరీక్షల ప్రిపరేషన్ కోసం సిలబస్ సొంతంగా అవగతం చేసుకునే ప్రింటెడ్ మెటీరియల్స్ తో పాటుగా ఆడియో, వీడియో ట్యుటోరియల్స్ కూడా అందిస్తుంది. అవసరమయ్యే విద్యార్థులకు కొన్ని రోజులు నేరుగా క్లాస్ రూమ్ బోధన కూడా కల్పిస్తుంది.

ఏయూలో దూరవిద్య సర్టిఫికేటెడ్ కోర్సులు & ఫీజులు

దూర విద్య కోర్సు ఫీజు మొత్తం కోర్సు వ్యవధి ఎలిజిబిలిటీ
సర్టిఫికెట్ ఇన్ ఆఫీస్ ఆటోమోషన్ & అకౌంటింగ్ (EM) 2,500/- 6 నెలలు ఇంటర్ /బీఏ/బీకామ్
సర్టిఫికెట్ ఇన్ ఆఫీస్ ఆటోమోషన్ & మల్టీ మీడియా టెక్నాలజీస్ (ఈ) 2,500/- 6 నెలలు ఇంటర్ /బీఏ/బీకామ్
సర్టిఫికెట్ ఇన్ ఆఫీస్ ఆటోమోషన్ & ఇంటర్నెట్ టెక్నాలజీస్ (EM) 2,500/- 6 నెలలు ఇంటర్ /బీఏ/బీకామ్

ఏయూలో దూరవిద్య డిప్లొమా కోర్సులు & ఫీజులు

దూర విద్య కోర్సు ఫీజు మొత్తం కోర్సు వ్యవధి ఎలిజిబిలిటీ
డిప్లొమా ఇన్ మ్యూజిక్ 6,000/- 2 ఏళ్ళు ఇంటర్మీడియట్
డిప్లొమా ఇన్ స్పోకెన్ హిందీ & ట్రాన్సిలేషన్ 4,000/- 6 నెలలు ఇంటర్మీడియట్

ఏయూలో దూరవిద్య పీజీ డిప్లొమా కోర్సులు & ఫీజులు

దూర విద్య కోర్సు ఫీజు మొత్తం కోర్సు వ్యవధి ఎలిజిబిలిటీ
పీజీ డిప్లొమా ఇన్ కో-ఆపరేషన్ & రూరల్  స్టడీస్ 6,000/- ఏడాది బ్యాచిలర్ డిగ్రీ
పీజీ  డిప్లొమా ఇన్ ఫంక్షనల్ ఇంగ్లీష్ 4,000/- ఏడాది బ్యాచిలర్ డిగ్రీ
పీజీ డిప్లొమా ఇన్ ట్రావెల్ & టూరిజం మానేజ్మెంట్ 5,000/- ఏడాది బ్యాచిలర్ డిగ్రీ
పీజీ డిప్లొమా ఇన్ మానేజ్మెంట్  ఆఫ్ వాలంటరీ ఆర్గనైజషన్స్ 5,000/- ఏడాది బ్యాచిలర్ డిగ్రీ
పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ & అప్లికేషన్స్ 8,000/- ఏడాది బ్యాచిలర్ డిగ్రీ
పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్సిలేషన్ 4,000/- ఏడాది బ్యాచిలర్ డిగ్రీ
పీజీ డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 5,000/- ఏడాది బ్యాచిలర్ డిగ్రీ
పీజీ డిప్లొమా ఇన్ మానేజ్మెంట్ 10,000/- ఏడాది బ్యాచిలర్ డిగ్రీ
పీజీ డిప్లొమా ఇన్ 5,000/- ఏడాది బ్యాచిలర్ డిగ్రీ
పీజీ డిప్లొమా ఇన్ ఫంక్షనల్ హిందీ & ట్రాన్సిలేషన్ 5,000/- ఏడాది బ్యాచిలర్ డిగ్రీ

ఏయూలో దూరవిద్య డిగ్రీ కోర్సులు & ఫీజులు

దూర విద్య కోర్సు ఫీజు మొత్తం కోర్సు వ్యవధి ఎలిజిబిలిటీ
బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్  (తెలుగు & ఇంగ్లీష్ మీడియం ) 7,100/- 3 ఏళ్ళు ఇంటర్మీడియట్
బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (తెలుగు & ఇంగ్లీష్ మీడియం) 8,400/- 3 ఏళ్ళు ఇంటర్మీడియట్
బీకామ్ కస్టమర్ సర్వీస్ మానేజ్మెంట్ 60,000/- 3 ఏళ్ళు ఇంటర్మీడియట్
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (మాథ్స్ గ్రూప్స్) 13,000/- 3 ఏళ్ళు ఇంటర్మీడియట్ (ఎంపీసీ)
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బయాలజీ గ్రూప్స్) 14,000/- 3 ఏళ్ళు ఇంటర్మీడియట్  (బైపీసీ)

ఏయూలో దూరవిద్య పీజీ కోర్సులు & ఫీజులు

దూర విద్య కోర్సు ఫీజు మొత్తం కోర్సు వ్యవధి ఎలిజిబిలిటీ
మాస్టర్ ఆఫ్ కామర్స్ (ఎంకామ్) 8,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
ఎంఎ ఇంగ్లీష్ 8,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
ఎంఎ హిందీ 8,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
ఎంఎ తెలుగు 8,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
ఎంఎ హిస్టరీ 8,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
ఎంఎ ఎకనామిక్స్ 8,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
ఎంఎ పాలిటిక్స్ 8,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
ఎంఎ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 8,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
ఎంఎ సైకాలజీ 8,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
ఎంఎ ఫీలోసఫీ 8,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
ఎంఎ / ఏంఎస్సీ మ్యాథమెటిక్స్ 8,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ (మాథ్స్)
ఏంఎస్సీ సైకాలజీ 25,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
ఏంఎస్సీ బోటనీ 25,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ (బోటనీ)
ఏంఎస్సీ జూలజీ 25,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ (జూలజీ)
ఏంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ 25,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ (కెమిస్ట్రీ)
ఏంఎస్సీ ఫిజిక్స్ 25,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ (ఫిజిక్స్)

ఏయూలో దూరవిద్య ప్రొఫిషినల్ కోర్సులు & ఫీజులు

దూర విద్య కోర్సు ఫీజు మొత్తం కోర్సు వ్యవధి ఎలిజిబిలిటీ
బీఈడీ III మెథడాలజీ /ఎంఎ ఎడ్యుకేషన్ III మెథడాలజీ 5,000/- ఏడాది బీఈడీ/ఎంఎ
మాస్టర్ ఆఫ్ లా 15,000/- రెండేళ్లు బ్యాచిలర్ ఆఫ్ లా
ఎంబీఏ ఫైనాన్స్ 35,000/- మూడేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
ఎంబీఏ హెచ్ఆర్ఏం 35,000/- మూడేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
ఎంబీఏ మార్కెటింగ్ 35,000/- మూడేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 50,000/- మూడేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
ఎంసీఏ 45,000/- మూడేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మానేజ్మెంట్ 17,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఫైనాన్స్ 35,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
ఎగ్జిక్యూటివ్  ఎంబీఏ హెచ్ఆర్ఏం 35,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ మార్కెటింగ్ 35,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
మాస్టర్ ఆఫ్ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ 12,000/- రెండేళ్లు బ్యాచిలర్ డిగ్రీ
బీఈడీ 35,000/- రెండేళ్లు డిగ్రీ (టీచింగ్ అనుభవం)

2 Comments

Post Comment