Advertisement
బీఆర్‌ఏఓయూ పీహెచ్డీ & ఎంఫిల్ ప్రోగ్రామ్స్  | డిస్టెన్స్ ఎడ్యుకేషన్
Distance Education

బీఆర్‌ఏఓయూ పీహెచ్డీ & ఎంఫిల్ ప్రోగ్రామ్స్ | డిస్టెన్స్ ఎడ్యుకేషన్

బీఆర్‌ఏఓయూ దూరవిద్య ద్వారా ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులు ఆఫర్ చేస్తుంది. 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ లేదా యూజీసీ నెట్ పరీక్ష యందు ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఎంఫిల్ కోర్సులు రెండేళ్ల నిడివితో, పీహెచ్డీ కోర్సులు 3 ఏళ్ళ నిడివితో అందిస్తున్నారు.

కోర్సులకు ఎన్రోల్ చేసుకున్న విద్యార్థులు 3 ఏళ్ళ నుండి 5 లోపు పూర్తిచేసే అవకాశం కల్పిస్తారు. అడ్మిషన్ పొందిన వారికి కోర్సుకు సంబంధించి పూర్తి స్టడీ మెటీరియల్ అందిస్తారు. విద్యార్థులకు ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ద్వారా ఆడియో క్లాసులు ప్రచారం చేస్తారు. ఆవిధంగా తెలంగాణ ప్రభుత్వ టీశాట్ చానల్స్ ద్వారా వీడియో క్లాసులు అందుబాటులో ఉంచారు. ఉన్నత విద్యను పూర్తిచేయాలనుకునే ఉద్యోగస్తులకు, గృహాణిలకు ఇది మంచి అవకాశం.

బీఆర్‌ఏఓయూ ఎంఫిల్ ప్రోగ్రామ్స్

ఎంఫిల్ అడ్మిషన్ పొందేందుకు 50 శాతం మార్కులతో ఏదైనా మాస్టర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. కోర్సు వ్యవధి రెండు ఏళ్ళు ఉంటుంది. గరిష్టంగా మూడేళ్ళ లోపు పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తారు.

మాస్టర్ ఇన్ ఫీలాసఫీ
ఎలిజిబిలిటీ మాస్టర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 12 నెలలు - 2 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 10,000/-
అడ్మిషన్ లింక్ వెబ్‌సైట్
కోర్సు సిలబస్ వెబ్‌సైట్
ఆన్‌లైన్ క్లాసులు వెబ్‌సైట్

బీఆర్‌ఏఓయూ పీహెచ్డీ ప్రోగ్రామ్స్

పీహెచ్డీ అడ్మిషన్ పొందేందుకు 50 శాతం మార్కులతో ఏదైనా మాస్టర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లేదా యూజీసీ నెట్, స్లేట్, ఎంఫిల్ అర్హుత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి మూడు ఏళ్ళు ఉంటుంది. గరిష్టంగా ఐదేళ్ల లోపు పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తారు.

డాక్టర్ ఆఫ్ ఫీలాసఫీ
ఎలిజిబిలిటీ మాస్టర్ డిగ్రీ
కోర్సు వ్యవధి 2 ఏళ్ళు - 5 ఏళ్ళు
కోర్సు మీడియం ఇంగ్లీష్
కోర్సు ఫీజు 15,000/-
అడ్మిషన్ లింక్ వెబ్‌సైట్
కోర్సు సిలబస్ వెబ్‌సైట్
ఆన్‌లైన్ క్లాసులు వెబ్‌సైట్

Post Comment