కరెంటు అఫైర్స్ : ఏప్రిల్ 20022 | ప్రభుత్వ పథకాలు & పాలసీలు
Telugu Current Affairs

కరెంటు అఫైర్స్ : ఏప్రిల్ 20022 | ప్రభుత్వ పథకాలు & పాలసీలు

అనాధ పిల్లలను గుర్తించేందుకు ఫీల్డ్ టాస్క్ ఫోర్స్‌ ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం

దేశ రాజధానిలో నిరాశ్రయులైన పిల్లలకు పునరావాసం కల్పించే లక్ష్యంతో, ఢిల్లీ ప్రభుత్వం ఫీల్డ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇది నగరం అంతటా నిరాశ్రయులైన పిల్లలను గుర్తించి, వారికి విద్యా, ఆర్థిక మరియు సంరక్షక సహాయాన్ని అందించడంపై దృష్టి సారించనుంది. డైలాగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిషన్ ఆఫ్ ఢిల్లీ (DDCD) యొక్క వ్యూహాత్మక మద్దతుతో, ఢిల్లీ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (DCPCR) మరియు సలామ్ బాలక్ ట్రస్ట్ మరియు యూత్ రీచ్‌తో కలిసి ఈ ప్రాజెక్టు నిర్వహించనున్నారు.

Advertisement

కర్ణాటకలో పాల ఉత్పత్తిదారుల కోసం సహకార బ్యాంకు ఏర్పాటు

దేశంలో పాల ఉత్పత్తిదారుల కోసం ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పాల ఉత్పత్తిదారుల కోసం 01 ఏప్రిల్ 2022 న కొత్తగా 'నందిని క్షీర సమృద్ధి సహకార బ్యాంకును ఏర్పాటు చేసారు. ఇది ఆ రాష్ట్రంలో పాల ఉత్పత్తిదారులకు ఆర్థికంగా చేయూతని అందివ్వనుంది.

ఈ కార్యక్రమంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా కూడా పాల్గున్నారు. ఈ సందర్బంగా ఆయన నందిని క్షీర సమృద్ధి సహకార బ్యాంకు యొక్క లోగోను విడుదల చేసారు.

లోక్‌సభలో ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు

లోక్‌సభలో 'ది ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు 2022'ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంటార్కిటిక్‌లో భారతదేశ పరిశోధన కార్యకలాపాలకు నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను అందించడం మరియు అంటార్కిటిక్ పర్యావరణ వ్యవస్థను రక్షించడమే లక్ష్యంగా ఈ బిల్ రూపొందించారు. 1983 లో అంటార్కిటికా ఒప్పందంపై భారతదేశం సంతకం చేసింది. ఈ జాబితాలో ఇండియాతో పాటు మరో 53 దేశాలు ఉన్నాయి.

గత కొంత కాలంగా “అంటార్కిటికాలోని సముద్ర జీవ వనరులు మరియు మానవ ఉనికిని దోపిడీ చేయకుండా అంటార్కిటికా చుట్టూ ఉన్న సహజమైన అంటార్కిటిక్ పర్యావరణం మరియు సముద్రాన్ని సంరక్షించడంపై ఆందోళన పెరుగుతోంది. వీటి నియంత్రణ కోసమే ఈ బిల్ రూపొందించబడింది.

NCW యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్‌ ప్రారంభం

నేషనల్ కమీషన్ ఫర్ ఉమెన్ (NCW) కొత్తగా మానవ అక్రమ రవాణా నిరోధక సెల్‌ను ప్రారంభించి. మానవ అక్రమ రవాణా కేసులను పరిష్కరించడంలో ప్రభావాన్ని మెరుగుపరచడానికి దీనిని ఏర్పాటు చేసారు.

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం 40,000 మంది పిల్లలు అపహరణకు గురవుతున్నారు, 11,000 మంది జాడ తెలియట్లేదు. సెక్స్ ట్రేడ్‌లో భాగంగా పొరుగు దేశాల నుండి ఏటా 12,000 నుండి 50,000 మంది మహిళలు మరియు పిల్లలు దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నారని రిపోర్టులు నివేదిస్తున్నాయి.

యూపీలో 'స్కూల్ చలో అభియాన్' ప్రారంభం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏప్రిల్ 4న శ్రావస్తి జిల్లాలో 'స్కూల్ చలో అభియాన్' అనే నూతన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో 100% విద్యార్థుల నమోదు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా విద్యార్థుల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న శ్రావస్తి జిల్లా నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

పబ్లిక్ ఎమర్జెన్సీ కోసం 'కావల్ ఉతవి' యాప్‌ ప్రారంభం

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రజాప్రయోజనార్థం కొత్తగా 'కావల్ ఉతవి' యాప్‌ను ప్రారంభించారు. 60 ఫీచర్లతో కూడిన ఈ యాప్ పౌరులు ఏదైనా అత్యవసర సమయంలో పోలీసు సహాయం పొందేందుకు సహాయపడుతుంది. 112/100/101 వంటి ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లు ఈ యాప్‌కు అనుసంధించబడ్డాయి.

కొత్త జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ విడుదల

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 26 కొత్త, పాత జిల్లాలతో కూడిన భౌగోళిక మ్యాపును విడుదల చేసింది. వికేంద్రీకరణ, వేగవంతమైన మరియు సమతుల్యమైన పరిపాలన సౌలభ్యం కోసం 13 కొత్త జిల్లాలను రూపొందించినట్లు ఆంధ్రా ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉత్తరాంధ్ర , కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాలలో మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం , విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాలు ఉండగా, కోస్తా ఆంధ్రలో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం మరియు పొట్టిశ్రీరాములు జిల్లాలు ఉన్నాయి. అలానే రాయలసీమలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలు ఉన్నాయి.

విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా
విస్తీర్ణంలో అతిచిన్న జిల్లా
అత్యధిక జనాభా కలిగిన జిల్లా
అత్యల్ప జనాభా కలిగిన జిల్లా
ప్రకాశం జిల్లా
విశాఖపట్నం
పొట్టిశ్రీరాములు నెల్లూరు
పార్వతీపురం మన్యం

తెలంగాణా విభజన తర్వాత, కొత్త ఆంధ్రప్రదేశ్ 9 జిల్లాలను కోల్పోయింది, అయితే పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఖమ్మం జిల్లా నుండి అనేక గిరిజన ప్రాబల్య మండలాలు ఏపీకి ఇవ్వబడ్డాయి. వీటిని వరుసగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో చేర్చారు. ఈ ఏడాది 6 జనవరి 2022న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 13 కొత్త జిల్లాలను ప్రతిపాదించారు.

ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం, సెక్షన్ 3(5) ప్రకారం నోటిఫై చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు మరియు సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, 3 ఏప్రిల్, 2022న తుది నోటిఫికేషన్‌ను ప్రచురించింది. 4 ఏప్రిల్ 2022 న కొత్త జిల్లాల నుండి పరిపాలన ప్రారంభమైంది.

సబ్‌కా వికాస్ మహా క్విజ్ సిరీస్ ప్రారంభం

భారత ప్రభుత్వం సబ్కా వికాస్ మహా క్విజ్ అనే క్విజ్ పోటీని ప్రారంభించింది. ఈ క్విజ్ పోటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. వీటిని పథకాలు పథకాలు మరియు కార్యక్రమాలపై పౌరులలో అవగాహనను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం రూపొందించింది. ఒక్కో ప్రభుత్వ పథకం లేదా కార్యక్రమానికి సంబంధించి ఈ క్విజ్ పోటీలు ఏప్రిల్ 14 నుండి ప్రారంభమయ్యాయి.

Advertisement

Post Comment