హెచ్‌డిఎఫ్‌సి ఎడ్యుకేషన్ లోన్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఎటువంటి గందరగోళం లేకుండా అన్ని కోర్సులకు ఒకే విధమైన ఎడ్యుకేషన్ లోన్ ఆఫర్ చేస్తుంది. ఒకే రుణ పథకాన్ని అందరి విద్యార్థులపై రుద్దకుండా, విద్యార్థి చదివే యూనివర్సిటీ ఫీజుల విలువ ఆధారంగా ప్రతి విద్యార్థికి అవసరమయ్యే నిర్దిష్ట విలువతో కూడిన రుణాన్ని మంజూరు చేస్తుంది.
అర్హులైన విద్యార్థులకు 5 వేల కనీస మొత్తం నుండి గరిష్టంగా 20 లక్షల వరకు విద్యా రుణం మంజూరు చేస్తుంది. 7.5 లక్షల లోపు రుణాలను ఎటువంటి పూచీకత్తు అవసరం లేకుండా అందిస్తుంది. రుణాలను 15 ఏళ్ళ వ్యవధిలో, కోర్సు పూర్తయిన ఏడాది తర్వాత లేదా, ఉద్యోగం వచ్చిన 6 నెలల తర్వాత తిరిగి చెల్లించే అవకాశాన్ని కల్పిస్తుంది.
విద్యా రుణాలు అకాడమిక్ మెరిట్ ఆధారంగా మంజూరు చేస్తారు. అర్హులైన విద్యార్థులు, విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా లేదా హెచ్‌డిఎఫ్‌సి పోర్టల్ ద్వారా సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. ఈ లొనుకు సంబంధించిన మరిన్ని వివరాలు క్రింది పట్టిక ద్వారా చూద్దాం.
హెచ్‌డిఎఫ్‌సి ఎడ్యుకేషన్ లోన్ & వడ్డీ రేట్లు
Loan Amount | విద్యార్థి ఎంపిక చేసుకున్న కోర్సు లేదా యూనివర్సిటీ ఆధారంగా 5 వేల కనీస మొత్తం నుండి గరిష్టంగా 20 లక్షల వరకు విద్యా రుణాన్ని మంజూరు చేస్తుంది. |
Courses Covered | UGC/ Government/ AICTE/ AIBMS/ ICMR వంటి సంస్థల గుర్తింపు కలిగిన యూనివర్సిటీలలో ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్, పీజీ డిప్లొమా కోర్సులు. విద్యార్థి వయస్సు 16 నుండి 35 ఏళ్ళ మధ్య ఉండాలి. |
Expenses Covered |
|
Interest Rate | 9.55 % నుండి 12.75% |
Processing Charges | మంజూరు చేసిన లోను మొత్తంలో 1% లేదా కనీస ప్రాసెసింగ్ 1,000/- రూపాయల్లో ఏది ఎక్కువ ఉంటె అది. |
Margin | 0 % |
Security | 7.5 లక్షల లోపు రుణాలకు విద్యార్థి హామీ ఉంటె సరిపోతుంది. 7.5 లక్షలు మించే దాటే రుణాలకు తల్లిదండ్రులు మరియు 3rd పార్టీ పూచీకత్తు అందజేయాల్సి ఉంటుంది. |
Repayment | రీపెమెంట్, కోర్సు పూర్తయినా 12 నెలల తర్వాత లేదా ఉద్యోగం పొందిన 6 నెలల తర్వాత నుండి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రీపెమెంట్ 15 ఏళ్ల నిడివితో పూర్తిచేయాల్సి ఉంటుంది. |
హెచ్‌డిఎఫ్‌సి ఎడ్యుకేషన్ లోన్ కోసం కావాల్సిన సర్టిఫికెట్లు
- చదివిన విద్యాసంస్థ నుంచి బదిలీ ధ్రువపత్రం (టీసీ)
- మార్కుల జాబితా (ఉత్తీర్ణత సర్టిఫికెట్).
- ఇంతవరకు పొందిన ఉపకార వేతన పత్రాలు.
- ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షా ర్యాంకు కార్డు.
- ప్రవేశ అనుమతి పత్రాలు (అడ్మిషన్ సర్టిఫికెట్).
- చదవాల్సిన కోర్సుకు చెందిన ఫీజుల అంచనా వివరాలు.
- తల్లి/ తండ్రి/ సంరక్షుడు/ విద్యార్థికి సంబంధించిన పాస్ ఫోటోలు.
- విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి వేతన ధ్రువపత్రాలు, ఆస్తి వివరాలు.
- నివాస ధృవీకరణ కోసం ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ లాంటివి జత చేయాలి.
- విదేశీ చదువులు : చెలుబాటు అయ్యే పాసుపోర్టు, i20వీసా, అడ్మిషన్ పొందిన విదేశీ యూనివర్సిటీ అడ్మిట్ లెటర్, గ్యాప్ సర్టిఫికేట్, జీఆర్ఈ, జీమ్యాట్, ఐఈఎల్టీఎస్, టోఫెల్, శాట్ పరీక్షలలో ఏదోకటి ఉత్తీర్ణత పొంది ఉండాలి
హెచ్‌డిఎఫ్‌సి ఎడ్యుకేషన్ లోన్ దరఖాస్తు విధానం
హెచ్‌డిఎఫ్‌సి ప్రస్తుతం విద్యా రుణాలు అన్నీ విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా అందిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సదురు అధికారులు మీ దరఖాస్తును పరిశీలించి, విద్యార్థి అర్హుతను నిర్ణహిస్తారు. అర్హుత పొందిన విద్యార్థులకు 10 నుండి 15 రోజులలో లోన్ మంజూరు చేస్తారు.
రెండవ విధానంలో విద్యార్థులు నేరుగా దగ్గరలో ఉండే హెచ్‌డిఎఫ్‌సి బ్రాంచుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్రాంచు మేనేజర్ లేదా లోన్ సెక్షన్ అధికారులను కలవడం ద్వారా ఎడ్యుకేషన్ లోన్లకు సంబంధించి పూర్తి వివరాలు అందజేస్తారు. మీరు అర్హులైతే సంబంధిత సర్టిఫికెట్లు సేకరించి, పరిశీలించి విద్యా రుణనాన్ని మంజూరు చేస్తారు.