Advertisement
తెలుగు కరెంట్ అఫైర్స్ జనవరి 2023 – వార్తల్లో వ్యక్తులు
Telugu Current Affairs

తెలుగు కరెంట్ అఫైర్స్ జనవరి 2023 – వార్తల్లో వ్యక్తులు

2023 జనవరి నెలకు సంబంధించిన సమకాలిన జాతీయ అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి వివిధ పోటీ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులకు ఈ అంశాలు ఉపయోగపడతాయి.

ఈసీఐఎల్ సీఎండీగా అనురాగ్ కుమార్

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా (సీఎండీ) అనురాగ్ కుమార్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం ఇదే సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేసే భారత ప్రభుత్వ సంస్థ. దీనిని 1967లో హైదరాబాద్‌లో స్థాపించారు.

కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ (75) కన్నుమూశారు

బీహార్‌కు చెందిన మాజీ కేంద్ర మంత్రి మరియు ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు శరద్ యాదవ్, జనవరి 12న 75 సంవత్సరాల వయస్సులో మరణించారు. శరద్ యాదవ్ గతంలో 2003 నుండి 2016 వరకు జనతాదళ్ (యునైటెడ్) పార్టీ అధ్యక్షుడుగా పనిచేసారు. ఈ పార్టీ తరుపున ఏడుసార్లు లోక్‌సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.

2017 లో ఆ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు రాజ్యసభ నుండి తొలగించబడ్డారు, అదే సమయంలో పార్టీ నాయకత్వ పదవుల నుండి తొలగించబడ్డాడు. ఈయన మొదటిసారి 1991లో వాజ్‌పేయి నేతృత్వంలో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వంలో పౌర విమానయాన మంత్రిగా నియమింపబడ్డారు. ఆ తరువాత 2001లో ఏవియేషన్ నుండి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు మార్చబడ్డాడు.

తెలంగాణ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి

తెలంగాణ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి శాంతికుమారిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నియమించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ బాధ్యతలు స్వీకరించిన మొదటి మహిళా ఆఫీసరుగా నిలిచారు.

ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కోర్టు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ కేడరులో చేరడంతో ఆయన స్థానంలో శాంతి కుమారిని నియమించారు. ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అత్యున్నత కార్యనిర్వాహక అధికారిగా పరిగణించబడతారు.

ఓఈసీడీ చీఫ్ ఎకనామిస్ట్‌గా క్లార్ లాంబార్డెల్లి

యూకే ట్రెజరీ అడ్వైజర్ ర్ లోంబార్డెల్లి, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) యొక్క నూతన చీఫ్ ఎకనామిస్ట్‌గా నియమితులయ్యారు. ఆర్థికరంగ విశ్లేషణలో ఆమె దాదాపు 20 సంవత్సరాల అనుభవం కలిగివున్నారు.

ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ అనేది 38 సభ్య దేశాలతో కూడిన అంతర్ ప్రభుత్వ సంస్థ. ఇది సభ్య దేశాలకు సంబంధించి స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, విధాన ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి సహకరించే ఒక ప్రత్యేకమైన ఎకనామిక్ ఫోరమ్. ఇది 1961లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం పారిస్'లో ఉంది.

మిస్ యూనివర్స్ 2022 విజేతగా ఆర్‌బోని గాబ్రియేల్

మిస్ యూనివర్స్ 2022 కిరీటంను అమెరికాకు చెందిన ఆర్‌బోని గాబ్రియేల్ సొంతం చేసుకున్నారు. అమెరికాలోని లూసియానలోని న్యూ ఓర్లీన్స్ యందు ఈ అందాల పోటీలు నిర్వహించారు. ఈ 71వ మిస్ యూనివర్స్ పోటీల్లో మొత్తం 84 దేశాల నుంచి అందగత్తెలు పాల్గొన్నారు. మిస్ వెనుజులా ఫస్ట్ రన్నరప్ గా నిలువగా, మిస్ డొమినికన్ రిపబ్లిక్ సెకండ్ రన్నరప్ గా నిలిచారు.

మిస్ యూనివర్స్ 2021గా నిలిచిన భారత మహిళ హర్నాజ్ కౌర్ సంధు, ఆర్‌బోని గాబ్రియేల్'ను కిరీటంతో అలంకరించారు. ఈ ఏడాది మిస్ యూఎస్ఏ 2022గా నిలిచిన ఆర్‌బోని గాబ్రియేల్, మిస్ యూనివర్స్ 2022గా కిరిటాన్ని కూడా కైవసం చేసుకుంది. ఆర్‌బోని గాబ్రియేల్ ప్రస్తుతం తన సొంత ఆర్‌బోని నోలా అనే దుస్తుల కంపెనీకి సీఈఓగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇండియాకు చెందిన దివితా రాయ్ మిస్ యూనివర్స్ కిరీటంపై చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది.

నేషనల్ హెల్త్ అథారిటీ డైరెక్టర్‌గా ప్రవీణ్ శర్మ

నేషనల్ హెల్త్ అథారిటీ(ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్) నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్ శర్మ వచ్చే ఐదేళ్ల కాలానికి నియమితులయ్యారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) దేశంలోని ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు మద్దతు ఇవ్వడానికి రూపొందించబడింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులతో రోగులను అనుసంధానిస్తుంది.

Post Comment