Advertisement
డౌట్‌నట్ ఇ-లెర్నింగ్ : సబ్జెక్టు వారీగా వీడియో సొల్యూషన్లు
Online Education Useful websites

డౌట్‌నట్ ఇ-లెర్నింగ్ : సబ్జెక్టు వారీగా వీడియో సొల్యూషన్లు

భారత్ నుండి పుట్టుకొచ్చిన విద్యా పరమైన ఉత్తమ ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికల్లో డౌట్‌నట్ ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. డౌట్‌నట్ ప్రధానంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ సబ్జెక్టులలో సందేహాలు తీర్చే ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికగా రూపొందించబడింది. దీన్ని 2016 లో తనూశ్రీ గుప్తా మరియు ఆదిత్య శంకర్‌లు స్థాపించారు.

డౌట్‌నట్ టెక్ట్స్ మరియు ఇమేజ్ గుర్తింపు సాంకేతిక ద్వారా విద్యార్థుల సందేహాలను తీర్చుతుంది. ముందుగా రూపొందినబడిన వీడియో మరియు టెక్ట్స్ డేటా బేస్‌ను డౌట్‌నట్ సర్వర్ యందు అందుబాటులో ఉంచుతుంది. విద్యార్థి తనకు కావాల్సిన ప్రశ్నను లేదా ఇమేజ్‌ను పోస్టు చేసినప్పుడు దానికి సరితూగే వీడియో మరియు టెక్ట్స్ సమాదానాలను విద్యార్థి ముందు ఉంచుతుంది.

ఒకవేళ మీ ప్రశ్నకు సరిపడే సమాధానం దొరకనప్పుడు వారి వెబ్సైటులో అందుబాటులో ఉండే ట్యూటర్లకు మీ ప్రశ్నను ఫార్వర్డు చేయడం ద్వారా వారు ప్రశ్నకు సంబంధించిన సమాధానాన్ని మీకు అందిస్తారు.

జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు  మరియు ఇతర పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ డౌట్‌నట్ వేదిక చక్కగా ఉపయోగపడుతుంది. చాల మంది విద్యార్థులు తమ ప్రశ్నకు సమాధానం ఉన్నా, దానికి సంబంధించిన సాధన కోసం ఆలోచిస్తుంటారు. అలాంటి విద్యార్థులకు పూర్తిగా ఈ ప్లాటుఫామ్ సహకరిస్తుంది.

doubtnut

డౌట్‌నట్ సందేహాలను తీర్చడమే కాకుండా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ సబ్జెక్టుల సంబంధించి ప్రఖ్యాత టెక్ట్స్ బుక్స్  అందుబాటులో ఉంచింది. అలానే ఎన్‌సీఈఆర్టికి చెందిన 6 నుండి 10+2 వరకు పీడీఎఫ్ టెక్ట్స్ బుక్స్ కూడా ఈ వేదికలో మీకు అందుబాటులో ఉంచుతుంది. అంతే కాకుండా ఎన్‌సీఈఆర్టికి చెందిన 6 నుండి 10+2 వరకు, జేఈఈ మరియు నీట్ పరీక్షలకు ఆన్‌లైన్ కోర్సులతో పాటుగా మెటీరియల్స్ అందిస్తుంది.