వేదాంతు అనేది ఇండియన్ ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ లైవ్ ట్యూటరింగ్ ప్లాట్‌ఫామ్. ఈ వేదిక ద్వారా ఉత్తమ నైపుణ్యమున్న ఉపాధ్యాయులు ఇంటర్‌నెట్ ద్వారా విద్యార్థులకు ట్యూషన్లు అందిస్తారు. దీన్ని ఒకరకంగా ఆన్‌లైన్ హోమ్ ట్యూషన్ ప్లాటుఫారమ్‌గా అభివర్ణించవచ్చు.
వేదాంతు పూర్తిగా ఉపాధ్యాయుల దృష్టికోణంలో ఏర్పడ్డ ఆన్‌లైన్ లెర్నింగ్ వేదిక. దీన్ని 2014 లో వంశీ కృష్ణ, పుల్కిత్ జైన్, సౌరభ్ సక్సేనా మరియు ఆనంద్ ప్రకాష్ లు స్థాపించారు. ప్రస్తుతం వేదాంతు ఐదు వందలకు పైగా ఉపాధ్యాయులతో, 30 పైగా దేశాల్లో, 10 వేలకు పైగా సిటీల్లో వేల కొలది విద్యార్థులకు ఆన్‌లైన్ ట్యూషన్లు అందిస్తుంది.
వైట్‌బోర్డ్ ఆధారిత ఆడియో వీడియో ఎన్విరాన్మెంట్ ద్వారా వేదాంతు ఆన్‌లైన్ లైవ్ ట్యూషన్లు అందిస్తుంది. ఇంటర్నెట్ ద్వారా విద్యార్థి లేదా గ్రూపుగా ఉండే విద్యార్థులతో నేరుగా టీచర్ ఇంటరాక్ట్ అవుతాడు. ఈ ప్రక్రియలో టీచర్, విద్యార్థి ఒకరితో ఒకరు మాట్లాడే, చూసే అవకాశం ఉంటుంది. ఇది ఒకరకమైన పర్సనలైజ్డ్ టీచింగ్ మెకానిజమని చెప్పొచ్చు.
లైవ్ ఇన్-క్లాస్ క్విజ్‌లు గేమిఫైడ్ పద్ధతిలో నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాల యందు ఆసక్తి పెరిగి వాటిలో నిమగ్నమయ్యే అవకాశం ఉంటుంది. ఈ రకమైన టీచింగ్ విధానం ద్వారా సబ్జెక్టు యందు విద్యార్థికి తలెత్తే సందేహాలను ఎప్పటికి అప్పుడే పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా విద్యార్థులు కూడా ఉత్తమ పలితాలు సాధించే అవకాశం ఉంటుంది.
వేదాంతు ప్రధానంగా 4 వ తరగతి నుండి 12 వ తరగతి విద్యార్థులకు ట్యూషన్స్ అందిస్తుంది. వీరు ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మరియు ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసిఎస్ఇ) సిలబస్ పరిధిలో కంటెంట్ అందిస్తున్నారు. దీనితో పాటుగా జేఈఈ మరియు నీట్ ప్రవేశ పరీక్షలకు పూర్తిస్థాయి ఆన్‌లైన్ కోచింగ్ ప్రోగ్రాంను విద్యార్థులకు ఆఫర్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా మాక్ టెస్ట్ నిర్వహణ, ప్రీవియస్ క్యూస్షన్ పేపర్ల సాధన, శాంపిల్ పేపర్ల సాధన మరియు ఎన్‌సిఈఆర్‌టి సొల్యూషన్స్‌పై పూర్తిస్థాయి అవగాహన అందిస్తున్నారు. ఈ ప్రత్యక్ష ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ కోచింగ్ ద్వారా విద్యార్థులు ఇంట్లో కూర్చునే ఉత్తమ ర్యాంకులు సాధించే అవకాశం కల్పిస్తున్నారు.
వీటితో పాటుగా ఆరు నుండి 12 ఏళ్ళ విద్యార్థులకు కోడింగ్ ఫౌండేషన్ కోర్సులు అందిస్తున్నారు. దీనిలో భాగంగా వెబ్సైట్లు రూపకల్పన, యాప్స్, ఆన్లైన్ గేమింగ్ యందు పరిచయపు తరగతులు అందిస్తున్నారు. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులలో మాథ్స్, లాజికల్ స్కిల్స్ యందు అవగాహనా కల్పిస్తున్నారు. అనలిటికల్ థింకింగ్, డిజైన్ థింకింగ్ మరియు కంప్యూటేషనల్ థింకింగ్ ద్వారా విద్యారులను ఆయా అంశాల యందు అభిరుచిని పెంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు.