ఆర్ట్ & కల్చర్ అఫైర్స్ : మార్చి 2022 | తెలుగు కరెంట్ అఫైర్స్
Magazine 2022

ఆర్ట్ & కల్చర్ అఫైర్స్ : మార్చి 2022 | తెలుగు కరెంట్ అఫైర్స్

ఉషా ఉతుప్ బయోగ్రఫీ "ది క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్" విడుదల

ఇండియన్ పాప్ ఐకాన్ ఉషా ఉతుప్ జీవిత చరిత్ర "ది క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ : ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఉషా ఉతుప్" పేరుతో మార్కెట్లోకి విడుదలైంది. భారతీయ పాప్ సంగీతంలో తిరుగులేని ఐకానుగా, తన మరపురాని స్వరంతో అన్ని తరాల శ్రోతలను ఉర్రూతలూగించిన ఉషా ఉతుప్, 2020 నాటికీ ప్రొఫెషనల్ సింగర్‌గా విజయవంతంగా యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ పుస్తకం తన వ్యక్తిగత మరియు ప్రోఫిసినల్ కెరీరుకి సంబంధించిన వివరణాత్మక రూపం.

“అన్‌ఫిల్డ్ బారెల్స్: ఇండియాస్ ఆయిల్ స్టోరీ” పుస్తకం విడుదల

ప్రముఖ మహిళా జర్నలిస్ట్ రిచా మిశ్రా రచించిన “ అన్‌ఫిల్డ్ బారెల్స్ : ఇండియాస్ ఆయిల్ స్టోరీ ” అనే పుస్తకం త్వరలో మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ పుస్తకం అప్‌స్ట్రీమ్ సెక్టార్ కథను చెబుతుంది. ఢిల్లీలో ఆయిల్ రిపోర్టర్‌గా తన ఉద్యోగ అనుభవాలను ఒక దగ్గర చేర్చుతూ ఇండియా పెట్రోలియం, సహజ వాయువుల కార్పొరేట్ లొసుగుల కోసం ఇందులో వివరించే ప్రయత్నం చేసారు.

బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ కొత్త ఛైర్మన్‌గా శశి సిన్హా

బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC) ఇండియా బోర్డు కొత్త ఛైర్మన్‌గా ఐపీజీ మీడియాబ్రాండ్స్ ఇండియా సీఈవో శశి సిన్హా నియమితులయ్యారు. గత మూడేళ్లుగా టీవీ వ్యూయర్‌షిప్ మెజర్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్‌గా పనిచేసిన పునీత్ గోయెంకా నుంచి ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా అనేది భారతీయ ప్రసారదారులకు, ప్రకటనదారులకు మరియు మీడియా ఏజెన్సీలకు ప్రాతినిధ్యం వహించే పర్యవేక్షణ సంస్థ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టెలివిజన్ రీసెర్చ్ సంస్థ. దీనిని 2010 లో స్థాపించారు. దీని ప్రస్తుత సీఈఓగా నకుల్ చోప్రా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇది దేశీయ టెలివిజన్ వీక్షకుల సంఖ్యను అంచనా వేస్తుంది.

పది రోజుల 'భారత్ భాగ్య విధాత' ఫెస్టివల్ ప్రారంభం

పది రోజుల మెగా రెడ్ ఫోర్ట్ ఫెస్టివల్ 'భారత్ భాగ్య విధాత' ఉత్సవాన్ని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ 26 మార్చి 2022 న ఎర్రకోటలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలోని విభిన్న సంస్కృతినలు, కళారూపాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసున్నారు. ఈ ఉత్సవాల్లో 70 మందికి పైగా మాస్టర్ హస్తకళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. దీనిని ఆజాదికా అమృత మహోత్సవవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీనిని నిర్వహిస్తుంది.

రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022 ప్రారంభం

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022 ను, రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండులో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించారు. భారత సంస్కృతి, సంప్రదాయాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఏడాది పొడుగునా వివిధ పండుగలను నిర్వహిస్తుంది.

పునరుద్ధరించిన యాదాద్రి ఆలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

నూతనంగా తిరిగి నిర్మించిన యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అంకితం చేశారు. గత ఆరేళ్లుగా కొనసాగిన ఆలయ పునర్నర్మాణ పనులు పూర్తికావడంతో స్వామివారి నిజరూప దర్శనం పునఃప్రారంభమైంది. ఈ ఆలయ పునర్నర్మాణంలో భాగస్వామ్యులైన ప్రధాన స్థపతి సౌందరరాజన్, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, ఈవో గీతారెడ్డి, రుత్విజులు, పూజారులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సన్మానించారు. అలానే ఆలయ పునర్నిర్మాణ యజ్ఞంలో భాగమైన వారందరినీ అభినందించారు.

ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు తిరుమల మాదిరిగా.. తెలంగాణకు యాదాద్రి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రకటించారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టి.. ఆరేళ్ల పాటు నిర్విఘ్నంగా కొనసాగించి, పూర్తిచేశారు.

 

Post Comment