మాస్టర్‌క్లాస్‌ ఆన్‌లైన్ కోర్సులు : అమెరికన్ ఎడ్యుకేషన్  ప్లాట్‌ఫారమ్
Online Education Useful websites

మాస్టర్‌క్లాస్‌ ఆన్‌లైన్ కోర్సులు : అమెరికన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్

అమెరికా కేంద్రంగా పురుడు పోసుకున్న ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికల్లో మాస్టర్‌క్లాస్‌ ఒకటి. ఇది 2014 లో డేవిడ్ రోజియర్ మరియు ఆరోన్ రాస్ముసేన్ లచే స్థాపించబడింది. ఇది మొదట యాంకా ఇండస్ట్రీస్.ఇంక్ పేరుతొ రిజిస్టర్ చేయబడిండి. ప్రస్తుతం మాస్టర్‌క్లాస్‌ పేరుతో వ్యాపారం చేస్తుంది.

మాస్టర్‌క్లాస్‌ రూపొందించిన కొద్ది నెలల్లోనే ముప్పైవేల వినియోగదారులను ఆకర్షించి రికార్డు నమోదు చేసింది. మాస్టర్‌క్లాస్‌ ఏ ఆన్‌లైన్ లెర్నింగ్ వేదిక అందించని విభిన్న కోర్సులను అందిస్తుంది. ఇది ప్రధానంగా ఆర్ట్స్ & ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్, ఫుడ్, రైటింగ్, బిజినెస్, స్పోర్ట్స్ & గేమింగ్, డిజైన్ & స్టైల్, హోమ్ & లైఫ్ స్టైల్ మరియు సైన్స్ & టెక్నాలజీ విభాగాల్లో కోర్సులు అందిస్తుంది.

వీటిలో మెజారిటీ కోర్సులు సృజనాత్మక నైపుణ్యాలకు సంబంధించి ఉన్నాయి. ఫుడ్, స్పోర్ట్స్ & గేమింగ్ మరియు హోమ్ & లైఫ్ స్టైల్ కోర్సులు ఇంకే ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికల్లో మనకు తారసపడవు.

మాస్టర్‌క్లాస్‌ ఆయా రంగాల్లో నిపుణులైన వ్యక్తులచే ఆన్‌లైన్ ట్యుటోరియల్‌లు రూపొందిస్తుంది. దీనితో పాటుగా ప్రతి క్లాసుకు అభ్యస ప్రశ్నలు, వర్క్‌బుక్‌లు మరియు బోధకుడితో ఇంటర్వ్యూ సెషన్‌లు అందుబాటులో ఉంచుతుంది. రైటింగ్, కుకింగ్ మరియు స్పోర్ట్స్ & గేమింగ్ వంటి కోర్సులకు ప్రత్యక్ష ఆన్‌లైన్ లైవ్ కోర్సులు క్లాసులు నిర్వహిస్తారు.

మాస్టర్‌క్లాస్‌ ట్యుటోరియల్‌ పొందాలంటే రుసుములు చెలించాల్సి ఉంటుంది. మాస్టర్‌క్లాస్ మూడు ప్లాన్ రకాలను అందిస్తుంది. ఇండివిజువల్ ప్లాన్ కోసం సంవత్సరానికి రూ. 1,299/-, డుయో ప్లాన్ కోసం సంవత్సరానికి రూ. 1,725/-, మరియు ఫ్యామిలీ ప్లాన్ కోసం సంవత్సరానికి రూ. 1,985/- చెల్లించాల్సి ఉంటుంది.

మాస్టర్‌క్లాస్‌ అందిస్తున్న కోర్సులు

ఆర్ట్స్ & ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్
ఫుడ్ రైటింగ్
బిజినెస్ స్పోర్ట్స్ & గేమింగ్
హోమ్ & లైఫ్ స్టైల్  డిజైన్ & స్టైల్
సైన్స్ & టెక్నాలజీ

మాస్టర్‌క్లాస్ కోర్సుల కీ పాయింట్స్

  • మాస్టర్‌క్లాస్ కోర్సులు క్వాలిటీ పరంగా ఉత్తమమైనవి
  • మాస్టర్‌క్లాస్ కోర్సులు మొబైల్, లాప్టాప్, కంప్యూటర్ మరియు టీవీ ద్వారా కూడా నేర్చుకునే అవకాశం ఉంది
  • మాస్టర్‌క్లాస్ కోర్సులకు సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి
  • మాస్టర్‌క్లాస్ సంబంధించి స్కిప్ చేసుకునే సదుపాయం ఉంటుంది
  • మాస్టర్‌క్లాస్ కోర్సులను వీడియోతో పాటుగా ఆడియో రూపంలో కూడా వినొచ్చు
  • మాస్టర్‌క్లాస్ కోర్సులు ఆయా రంగాల్లో నిపుణులైన కళాకారులు, రచయతలు, క్రీడాకారులచే రూపొందించబడ్డాయి
  • మాస్టర్‌క్లాస్ కోర్సుల ఎన్రోల్మెంట్ ఫీజులు పరిమితం

మాస్టర్‌క్లాస్ కోర్సుల ప్రతికూలతలు

  • మాస్టర్‌క్లాస్ కోర్సులు అన్ని దాదాపు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి
  • మాస్టర్‌క్లాస్ కోర్సులు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే అందజేస్తారు
  • టెక్నికల్ కోర్సులు అనుకునేంత ప్రామాణికంగా ఉండవు
  • మాస్టర్‌క్లాస్ కోర్సులకు కమ్యూనిటీ ఫారం సపోర్టు లేదు

మాస్టర్‌క్లాస్ కోర్సుల ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు కొంచెపు పక్కన పెడితే, ఆన్‌లైన్ ద్వారా సుజనాత్మకత నైపుణ్య విద్య అభ్యసించాలనుకునే వారికీ, కొత్త నైపుణ్యాలు నేర్చుకునే ఆలోచన ఉన్నవారికి మాస్టర్‌క్లాస్ కోర్సులు ఉత్తమ ఎంపిక.ఇది విస్తృతమైన నైపుణ్య సంబంధిత కోర్సుల ఎంపికను అందిస్తుంది. దాదాపు

Post Comment