ఉడెమీ ఆన్‌లైన్ కోర్సులు : 130,000 పైగా డిజిటల్ ట్యుటోరియల్స్
Online Education Useful websites

ఉడెమీ ఆన్‌లైన్ కోర్సులు : 130,000 పైగా డిజిటల్ ట్యుటోరియల్స్

డిజిటల్ లెర్నింగ్ పై అవగాహనా ఉన్న వారికి ఉడెమీ (Udemy) గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఆన్‌లైన్ విద్యకు సంబంధించి అతిపెద్ద డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంగా ఉడెమీ గత పదేళ్లుగా తన స్థానాన్ని నిలిబెట్టుకుంటూ వస్తుంది. అమెరికా కేంద్రంగా స్థాపించబడిన ఈ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం నేడు దాదాపు 180 దేశాలకు విస్తరించించి.

ఉడెమీని మే 2010 లో ఎరెన్ బాలి, గగన్ బియానీ మరియు ఓక్టే కాగ్లార్లు స్థాపించారు. మొదట ఈ ఆలోచన అందరికి ఉచిత ఆన్‌లైన్ విద్య లక్ష్యంతో ప్రారంభమైనా, తర్వాత కాలంలో ఇది వ్యాపారాత్మక డిజిటల్ లెర్నింగ్ వేదికగా రూపుమార్చుకుంది.

ఉడెమీలో ప్రస్తుతం విభిన్న కేటగిర్లలో దాదాపు 1,30,000 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లో 35 మిలియన్లకు పైగా విద్యార్థులు మరియు 57,000 మంది బోధకులు 65 పైగా భాషల్లో కోర్సులు బోధిస్తున్నారు. ఇప్పటికి వరకు 180 కి పైగా దేశాల నుండి 400 మిల్లియన్ల మంది ఈ కోర్సుల కోసం నమోదు చేసుకున్నారు.

అలెక్స వెబ్సైటు ర్యాంకింగులో ప్రపంచ వ్యాప్తంగా టాప్ 110 ర్యాంకులో, ఇండియాలో టాప్ 35 ర్యాంకులో ఉడెమీ ఉంది అంటే దాని పాపులారిటీని మనం ఊహించవచ్చు. ఆన్‌లైన్ విద్యకు సంబంధించి ఉడెమీ విస్తృతమైన ఎంపికను అందుబాటులో ఉంచింది.

ఆన్‌లైన్ ద్వారా ప్రోఫిసినల్ విద్యను అభ్యసించాలని అనుకునే వారికి, ఉన్న నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని అనుకునే వారికి మరియు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని తపనపడే వారికీ ఉడెమీ చక్కని ప్రత్యామ్నాయం. ప్రోగ్రామింగ్, వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ డిజైనింగ్, ఐటీ  మరియు బిజినెస్, ఫైనాన్స్ & అకౌంటింగ్ సంబంధించి విస్తృతమైన కోర్సుల ఎంపిక ఉడెమీలో అందుబాటులో ఉంది.

మీ షెడ్యూలు అనుచరించి నేర్చుకోండి అనే ఉడెమీ నినాదం మేరకు, ఉడెమీలో ఒకసారి రిజస్టర్ చేసుకున్న కోర్సును, లైఫ్ టైం అనుమతితో ఎప్పుడైనా, ఎక్కడైన, ఏ డివైజ్ యందు అయినా నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. కోర్సులు విజయవంతంగా పూర్తిచేసిన వారికీ దానికి సంబంధించి స్కిల్ టెస్ట్ నిర్వహించి డిజిటల్ సర్టిఫికేట్లు కూడా అందిస్తుంది.

ఉడెమీలో కోర్సుల కేటగిర్లు

డెవలప్మెంట్ మార్కెటింగ్
బిజినెస్ లైఫ్ స్టైల్
ఫైనాన్స్ & అకౌంటింగ్ ఫోటోగ్రఫీ
ఐటీ & సాఫ్ట్వేర్ హెల్త్ & ఫిట్నెస్
ఆఫీస్ & ప్రొడక్టివిటీ మ్యూజిక్
పర్సనల్ డెవలప్మెంట్ టీచింగ్ & అకాడమిక్స్
డిజైన్ స్పోకెన్ లాంగ్వేజ్స్

ఉడెమీ కోర్సులను ఎందుకు ఎంపిక చేసుకోవాలి ?

  • ఉడెమీ సబ్జెక్టు/టాపిక్ సంబంధించి విస్తృతమైన కోర్సుల ఎంపిక ఉంది
  • ఉడెమీ కోర్సులు జీవితకాల అనుమతితో ఉపయోగించుకోవచ్చు
  • ఉడెమీ కోర్సులు నిర్దిష్ట సమయాల్లో కాకుండా మీకు అందుబాటులో ఉండే సమయంలో అభ్యసించుకోవచ్చు
  • ఉడెమీ కోర్సుల ఎన్రోల్మెంట్ రుసుములు మిగతా డిజిటల్ లెర్నింగ్ వేదికలతో పోల్చుకుంటే తక్కువ
  • ఉడెమీ కోర్సులు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది
  • ఉడెమీ కోర్సులు పూర్తిచేసుకున్న వారికి, కోర్సు పూర్తిచేసిన సర్టిఫికెట్ అందజేస్తారు
  • ఉడెమీఅన్ని కోర్సులకు కొన్ని నియమాలకు లోబడి 30 రోజుల మనీ బ్యాక్ గ్యారెంటీ ఇస్తుంది

ఉడెమీ కోర్సుల ప్రతికూలతలు

  • ఉడెమీ కోర్సులు రూపొందిచే వారందరూ పూర్తిస్థాయి బోధన నిపుణులు కాదు
  • ఉడెమీ అందించే కొన్ని కోర్సులకు ప్రామాణిక నిబద్దత లేదు
  • ఉడెమీ అందించే కొన్ని కోర్సులు, సబ్జెక్టు లేదా టాపిక్ సంబంధించి పూర్తిస్థాయిలో ఉండవు
  • ఉడెమీ అందించే కొన్ని కోర్సులు ప్రామాణిక నాణ్యత కలిగి ఉండవు
  • ఉడెమీ అందించే సర్టిఫికెట్ అన్ని విద్య సంస్థలు ప్రామాణికంగా తీసుకోవు

ఉడెమీ కోర్సుల ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు కొంచెపు పక్కన పెడితే, ఆన్‌లైన్ ద్వారా కొత్త నైపుణ్యాలు నేర్చుకునే ఆలోచన ఉన్నవారికి ఉడెమీ విస్తృతమైన కోర్సుల ఎంపికను అందిస్తుంది. అలానే ప్రతి కోర్సుకు సంబంధించి యూజర్ రేటింగ్ మరియు యూజర్ అభిప్రాయాలను అందుబాటులో ఉంచుతుంది.

కొత్తగా కోర్సు కోసం రిజిస్టర్ అయ్యేవారికి ఈ సమాచారం ఆ కోర్సుకు సంబంధించి పూర్తిస్థాయి అభిప్రాయాన్ని కల్పిస్తాయి. ఈ కారణంగా కొత్త యూజర్లకు ఉన్నవాటిలో నాణ్యమైన ఎంపికను ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది.