ఏపీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద మండల, జిల్లా, మున్సిపల్ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 5 నుండి 10వ తరగతి చదువుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు స్వల్ప మొత్తంలో ఆర్థిక సాయాన్ని అందిస్తారు. అలానే 9 మరియు 10వ తరగతి చదివే బీసీ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. కుటంబ ఆదాయం రెండుల లక్షలోపు ఉండే విద్యార్థులు ఈ పథకంకు అర్హులు.
ఏపీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్‌కు అర్హుత పొందిన బాలురులకు నెలకు 100 రూపాయలు, బాలికలకు నెలకు 150 రూపాయల చెప్పున ఏడాదిలో గరిష్టంగా 10 నెలలు అందజేస్తారు. దీనికి అదనంగా ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకునే 9 మరియు 10 వ తరగతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నెలకు 350 రూపాయల చెప్పున పది నెలలు అందిస్తారు.
స్కాలర్షిప్ పేరు | ఏపీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ |
స్కాలర్షిప్ టైప్ | ఫైనాన్సియల్ అసిస్టెన్స్ |
ఎవరికి | V నుండి X ఎస్సీ, ఎస్టీ & వికలాంగు విద్యార్థులకు |
అర్హుత | 75% కనీస హాజరు & 2 లక్షలలోపు కుటుంబ ఆదాయం |
ఏపీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ
మండల, జిల్లా, మున్సిపల్ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 5 నుండి 10వ తరగతి చదువుకునే ఎస్సీ, ఎస్టీ, వికలాంగు విద్యార్థులు ఈపథకం పరిధిలోకి వస్తారు. వీరి కుటుంబ ఆదాయం రెండు లక్షలోపు ఉండాలి. విద్యార్థుల హాజరు తగినంత ఉండాలి. 9 మరియు 10 చదువుతున్న బీసీ విద్యార్థులు కూడా అర్హులు.
ఏపీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు
ప్రభుత్వ జన్మభూమి వెబ్సైటులో అందుబాటులో ఉండే లింక్ ద్వారా పాఠశాల ప్రిన్సిపాల్ లేదా విద్యార్థి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులో అడిగిన వివరాలు అన్ని తప్పులు దొర్లకుండా నమోదు చేసి, తగిన ధ్రువపత్రాలతో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన దరఖాస్తును హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ దృకరించవల్సి ఉంటుంది. వెల్ఫేర్ ఆఫీసర్ ధ్రువీకరించిన దరఖాస్తుదారులకు స్కాలర్షిప్ జమ చేస్తారు.
వచ్చే ఏడాది రెన్యువల్ చేసే సమయంలో ప్రిన్సిపాల్ లేదా విద్యార్థి పాత దరఖాస్తు నెంబర్ మరియు ఆధార్ నెంబర్ సాయంతో తిరిగి రెన్యువల్ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. సదురు దరఖాస్తును హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆమోదం తెలిపిన తర్వాత స్కాలర్షిప్ అందజేస్తారు.