ఆంధ్ర ప్రదేశ్‌లో 3 నెలల నిడివి నుండి మూడేళ్ళ నిడివితో పారామెడికల్ కోర్సులను అందిస్తుంది. పదో తరగతి తర్వాత అందించే ఈ పారామెడికల్ కోర్సులను ఒకేషనల్ విద్యలో భాగంగా ఆఫర్ చేస్తున్నారు. వీటిని డిప్లొమా కోర్సులుగా పరిగణిస్తారు. అలానే ఇంటర్ బైపీసీ అర్హుతలో రెండు నుండి మూడేళ్ళ నిడివితో బ్యాచిలర్ పారామెడికల్ కోర్సులను కూడా అందిస్తున్నారు. ఈ కోర్సులు స్టేట్ పారామెడికల్ బోర్డు ద్వారా ఆఫర్ చేస్తున్నారు.
ఏపీలో పారామెడికల్ సర్టిఫికెట్ కోర్సుల అడ్మిషన్
టెన్త్ తర్వాత 3 నెలల నుండి గరిష్టంగా ఏడాది నిడివితో పారామెడికల్ సర్టిఫికేటెడ్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఈ కోర్సుల యందు ప్రవేశాలు ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, నిమ్స్ మరియు ఆయా రాష్ట్రీయ, కేంద్రీయ యూనివర్సిటీలు ప్రతిఏటా విడుదల చేసే నోటిఫికేషన్‌ల ఆధారంగా నిర్వహిస్తారు. అడ్మిషన్లు ప్రవేశ పరీక్ష లేదా అకాడమిక్ మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు.
- DMLT (డిప్లొమా ఇన్ మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ)
- DHFM (డిప్లొమా ఇన్ హాస్పిటల్ అండ్ ఫుడ్ టెక్నాలజీ మేనేజిమెంట్)
- DOT (డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్)
- డిప్లొమా ఇన్ ఫీజియోథెరఫీ
- డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (F)
- ఎక్స్–రే టెక్నీషియన్
- డెంటల్ అసిస్టెంట్
- ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్
- నర్సింగ్ కేర్ అసిస్టెంట్
- ఈసీజీ, సీటీ స్కాన్ టెక్నీషియన్
- డయాలసిస్ టెక్నీషియన్
- న్యూట్రీషన్
ఏపీలో పారామెడికల్ డిప్లొమా కోర్సుల అడ్మిషన్
ఏపీలో పారామెడికల్ డిప్లొమా కోర్సులను రెండేళ్ల నిడివితో వివిధ అందిస్తున్నారు. ఈ కోర్సులను ఇంటర్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు స్టేట్ పారామెడికల్ బోర్డు ద్వారా ఆఫర్ చేస్తున్నారు. ప్రవేశాలు ఇంటర్ మెరిట్ ఆధారంగా లేదా ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల వారీగా దాదాపు 250 కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ పారామెడికల్ కాలేజీల యందు ఈ అడ్మిషన్లు నిర్వహిస్తారు.
ఈ కోర్సులను రాష్ట్రంలోని 8 రీజనల్ మెడికల్ కాలేజీల పరిధిలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పారామెడికల్ కాలేజీలో అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ కోర్సులకు సంబంధించి మొత్తం 861 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల కోసం ఆయా కాలేజీల ప్రిన్సిపాల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము 200/-
- ఆంధ్ర వైద్య కళాశాల, విశాఖపట్నం
- రంగరాయ వైద్య కళాశాల, కాకినాడ
- సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ
- గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు
- ఎస్.వి. వైద్య కళాశాల, తిరుపతి
- ప్రభుత్వం వైద్య కళాశాల, వైఎస్ఆర్ కడప
- కర్నూలు వైద్య కళాశాల, కర్నూలు
- ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురం
ఏపీ పారామెడికల్ అడ్మిషన్ షెడ్యూల్ 2022-23
దరఖాస్తు ప్రారంభం | 30 సెప్టెంబర్ 2022 |
దరఖాస్తు తుది గడువు | 17 అక్టోబర్ 2022 |
పారామెడికల్ కాన్సిలింగ్ | 26 అక్టోబర్ 2022 |
సీట్ల కేటాయింపు | 07 నవంబర్ 2022 |
జాయినింగ్ చివరి గడువు | 14 నవంబర్ 2022 |
క్లాసులు ప్రారంభం | 18 నవంబర్ 2022 |
పారామెడికల్ డిప్లొమా కోర్సుల సిలబస్ | ఏపీలో ప్రైవేట్ పారామెడికల్ కాలేజీలు |
---|---|
పారామెడికల్ డిప్లొమా కోర్సుల పాత ప్రశ్నపత్రాలు | ఏపీలో ప్రభుత్వ పారామెడికల్ కాలేజీలు |
ఏపీలో పారామెడికల్ డిప్లొమా కోర్సుల ట్యూషన్ ఫీజులు
ట్యూషన్ ఫీజు / ఇతర ఫీజులు | ప్రభుత్వ పారామెడికల్ కాలేజీలు | ప్రైవేట్ పారామెడికల్ కాలేజీలు |
---|---|---|
ట్యూషన్ ఫీజు | ఏడాదికి 6,000/- | ఏడాదికి 14,500/- |
స్పెషల్ ఫీజు | - | ఏడాదికి 3,500/- |
ఇతర ఫీజులు | ఏడాదికి 1,500/- | ఏడాదికి 1,500/- |
ఎగ్జామ్ ఫీజు | 1,500/- | 1,500/- |
ఏపీలో పారామెడికల్ డిప్లొమా కోర్సులు
పారామెడికల్ డిప్లొమా | కోర్సు నిడివి |
---|---|
డిప్లొమా ఇన్ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ (D.Perfue) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ (DOA) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (DMPHA) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మానేజ్మెంట్ టెక్నిషియన్ (DHFSM) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ & ఆపరేషన్ థియేటర్ టెక్నిషియన్ (DMST) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నిషియన్ (DAM) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ డయాలిసిస్ టెక్నిషియన్ (DDIALY) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నిషియన్ (DMIT) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ (DMLT) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నిషియన్ (DREST) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ రేడియో థెరఫీ టెక్నిషియన్ (DRT) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నిషియన్ (DOM) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నిషియన్ (DDT) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ డెంటల్ హైజినిస్ట్ టెక్నిషియన్ (DDHY) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నిషియన్ (DANS) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ క్యాథ్ ల్యాబ్ టెక్నిషియన్ (DCLT) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ (DRGA) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ (DDRA) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నిషియన్ (DECG) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నిషియన్ (DCARDIO) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ పారామెడిక్ టెక్నిషియన్ (DEPT) | 2 ఏళ్ళు |
డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ & స్పీచ్ థెరఫీ (DHLST) | 2 ఏళ్ళు |
ఏపీలో పారామెడికల్ బీఎస్సీ కోర్సుల అడ్మిషన్
ఇంటర్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులు మరియు ఇంటర్ ఒకేషనల్ బయాలజీ బ్రిడ్జి కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు బీఎస్సీ పారామెడికల్ కోర్సులు చేసేందుకు అర్హులు. ఈ కోర్సులు మూడేళ్ళ నుండి గరిష్టంగా 4 ఏళ్ళ నిడివితో అందిస్తారు. ఈ కోర్సులలో ప్రవేశాలు ఇంటర్ మెరిట్ ఆధారంగా లేదా ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహిస్తారు.
ఈ కోర్సుల యందు ప్రవేశాలు ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఉస్మానియా మెడికల్ యూనివర్సిటీ, నిమ్స్ మరియు ఆయా రాష్ట్రీయ, కేంద్రీయ యూనివర్సిటీలు ప్రతిఏటా విడుదల చేసే నోటిఫికేషన్‌ల ఆధారంగా నిర్వహిస్తారు. అడ్మిషన్లు ప్రవేశ పరీక్ష లేదా అకాడమిక్ మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు
- బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ
- బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ
- బీఎస్సీ ఓటీటీ (ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ)
- బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ
- బీఎస్సీ ఎంఎల్‌టీ(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ)
- బీఎస్సీ ఎక్స్–రే టెక్నాలజీ
- బీఎస్సీ రేడియోగ్రఫీ
- బీఎస్సీ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ
- బీఎస్సీ మెడికల్ రికార్డ్ టెక్నాలజీ
- బీఏఎస్‌ఎల్‌పీ
- బీఎస్సీ ఆప్తాల్మిక్ టెక్నాలజీలో బీఎస్సీ
- బీఎస్సీ ఆడియాలజీ - స్పీచ్ థెరపీలో బీఎస్సీ;
- బీఎస్సీ ఆప్టోమెట్రీ
- బీఎస్సీ అనస్తీషియా టెక్నాలజీ