ఎన్ఎంఎంఎస్ 2023 : నేషనల్ మీన్స్ కమ్-మెరిట్ స్కాలర్‌షిప్
Scholarships

ఎన్ఎంఎంఎస్ 2023 : నేషనల్ మీన్స్ కమ్-మెరిట్ స్కాలర్‌షిప్

నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ అందించే నేషనల్ మీన్స్ కమ్-మెరిట్ స్కాలర్షిప్ 2022-23 నోటిఫికేషన్ వెలువడింది. దేశ వ్యాప్తంగా ఏటా లక్ష మందికి నిరుపేద విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందజేస్తారు. ఇందులో ఆంద్రప్రదేశ్ పరిధిలో 4,087 స్కాలర్షిప్లు, తెలంగాణ పరిధిలో 2,921 స్కాలర్షిప్లు పొందే అవకాశం ఉంటుంది.

నేషనల్ మీన్స్ కమ్-మెరిట్ స్కాలర్షిప్ ద్వారా దేశంలో ఉండే ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ కింద నెలకు వెయ్యి రూపాయలు చెప్పున, ఏడాదికి 12,000/-  రూపాయలు అందజేస్తారు. వార్షిక కుటుంబ ఆదాయం 3.5 లక్షల లోపు ఉండే క్లాస్ VII మరియు క్లాస్ VIII చదువవుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఈ స్కాలర్షిప్ క్లాస్ IX నుండి క్లాస్ XII (10+2) విద్యార్థులకు గరిష్టంగా నాలుగేళ్లు అందజేస్తారు.

స్కాలర్షిప్ పేరు నేషనల్ మీన్స్ కమ్-మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్
ఎవరు అర్హులు 3.5 లక్షల లోపు వార్షిక కుటుంబ ఆదాయం
ఎంపిక విధానం ఎలిజిబిలిటీ టెస్ట్ మెరిట్ ఆధారంగా

నేషనల్ మీన్స్ కమ్-మెరిట్ స్కాలర్షిప్, దేశవ్యాప్తంగా ఏటా దాదాపు లక్ష మంది విద్యార్థులకు అందజేస్తారు. స్కాలర్షిప్ లబ్దిదారులను ఎంపిక చేసేందుకు రెండు దశలలో అర్హుత పరీక్షలు నిర్వహిస్తారు.

అర్హుత పరీక్షల్లో మెరిట్ సాధించిన లక్ష మంది విద్యార్థులకు రాష్ట్రాల వారీగా, కేంద్రపాలిత వారీగా మరియు వివిధ సామాజిక రిజర్వేషన్ కోటాల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఇది పూర్తి కేంద్ర ప్రభుత్వ పథకం అయినప్పటికీ, దీనికి సంబంధించిన అర్హుత పరీక్షను రాష్ట్రాలకు చెందిన సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డులు, ప్రాంతాలు వారీగా నిర్వహిస్తాయి.

నేషనల్ మీన్స్ కమ్-మెరిట్ స్కాలర్షిప్ షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
దరఖాస్తు ప్రారంభం 30 సెప్టెంబర్ 2022 30 సెప్టెంబర్ 2022
దరఖాస్తు తుది గడువు 31 అక్టోబర్  2022 11 నవంబర్ 2022
మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT) 05 ఫిబ్రవరి 2023 18 డిసెంబర్ 202
స్కొలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SAT) 05 ఫిబ్రవరి 2023 18 డిసెంబర్ 202
దరఖాస్తు ఫీజు 50/- (ఎస్సీ & ఎస్టీ)
100/- (బీసీ & ఓసీ)
 50/- (ఎస్సీ & ఎస్టీ)
100/- (బీసీ & ఓసీ)

నేషనల్ మీన్స్ కమ్-మెరిట్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ

  1. ఈ స్కాలర్షిప్ స్కీంకు క్లాస్ VIII నుండి క్లాస్ IX ప్రోమోట్ అయ్యే విద్యార్థులకు మాత్రమే అర్హులు.
  2. క్లాస్ VIII చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులు.
  3. విద్యార్థి కుటుంబ ఆదాయం 3.5 లక్షలోపు ఉండాలి.
  4. విద్యార్థి ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుని ఉండాలి.
  5. విదేశాల్లో చదివే విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ వర్తించదు.
  6. డిప్లొమా విద్యార్థులు ఈ స్కాలర్షిప్ 'కు అనర్హులు.
  7. విద్యార్థులు కనీస హాజరు నమోదు చేయాలి.
  8. అకాడమిక్ పరీక్షల్లో కనీసం 55 శాతం మార్కులు సాదించాలి.

నేషనల్ మీన్స్ కమ్-మెరిట్ స్కాలర్షిప్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్

నేషనల్ మీన్స్ కమ్-మెరిట్ స్కాలర్షిప్ ఎంపిక రెండు దశలలో నిర్వహిస్తారు. మొదటి దశలో రాష్ట్రా స్థాయిలో అర్హుత పరీక్షలు నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించి మెంటల్ ఎబిలిటీ & స్కొలాస్టిక్ ఆప్టిట్యూడ్ అంశాల యందు MAT మరియు SAT పేరుతో రెండు పరీక్షలు నిర్వహిస్తారు.

మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT) : ఈ పేపర్లో వెర్బల్, నాన్ వెర్బల్, రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ అనాలోజి, క్లాసిఫికేషన్, న్యూమరికాల్ సిరీస్, పాటర్న్ పెరిసిప్షన్అంశాలకు సంబంధించి 90 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. పరీక్షా వ్యవధి 90 నిముషాలు ఉంటుంది. ఈ పరీక్షను రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రభుత్వాలు తమ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ద్వారా నిర్వహిస్తాయి.

స్కొలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SAT) : MAT పరీక్షలో అర్హుత పొందిన వారికీ SAT నిర్వహిస్తారు. ఈ పేపర్లో క్లాస్ VII, క్లాస్ VIII సంబంధించిన సైన్స్, సోషల్ స్టడీస్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల నుండి 90 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. పరీక్షా వ్యవధి 90 నిముషాలు ఉంటుంది. ఈ పరీక్షను రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రభుత్వాలు తమ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ద్వారా నిర్వహిస్తాయి

సబ్జెక్టు వారీగా ప్రశ్నల వెయిటేజీ

మ్యాథ్స్ - 20 ఫిజిక్స్ - 12 కెమిస్ట్రీ - 11 బయాలజీ -12
హిస్టరీ - 10 జియోగ్రఫీ - 10 పొలిటికల్ సైన్స్ - 10 ఎకనామిక్స్ -5

నేషనల్ మీన్స్ కమ్-మెరిట్ స్కాలర్షిప్ ఎంపిక విధానం

MAT మరియు SAT పరీక్షలలో 40% (36 మార్కులు) స్కోర్ చేసిన వారిని తుది జాబితా కోసం పరిగణలోకి తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కనీసం 32 (29 మార్కులు) శాతం స్కోర్ చేయాల్సి ఉంటుంది. అలానే విద్యార్థులు క్లాస్ VII లేదా క్లాస్ VIII లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 5 శాతం మినహాయింపు కల్పిస్తారు. స్కాలర్షిప్ తుది జాబితా రాష్ట్రాల వారీగా కింది రిజర్వేషన్ల కోటాపై ఆధారపడి రూపొందించబడి ఉంటుంది.

SC : 15% ST : 6% BC - A : 7% BC - B : 10%
BC - C : 1% BC - D : 7% BC - E : 4% PH : 3%

నేషనల్ మీన్స్ కమ్-మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు విధానం

క్లాస్ VIII నుండి క్లాస్ IX ప్రోమోట్ అయ్యే విద్యార్థులు మీ రాష్ట్రానికి చెందిన డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (ఎస్‌ఎస్‌సి బోర్డు) ద్వారా సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసేందుకు బ్యాంకు అకౌంట్ (ఎస్బిఐ), ఆదాయ ద్రువీకరణ పత్రం, కుల ద్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఫోటో, అకాడమిక్ సర్టిఫికెట్లు అవసరం ఉంటుంది.

నేషనల్ మీన్స్ కమ్-మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానంలో అందుబాటులో ఉంటుంది. ఆఫ్‌లైన్ విధానంలో నేరుగా స్కూల్ హెడ్ మాస్టర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మీ స్కూల్ హెడ్ మాస్టర్ ద్వారా పొందవచ్చు.

Post Comment