అమ్మఒడి పథకం ద్వారా 1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షులకు ఏడాదికి 15 వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుంది. దేశంలో మరెక్కడలేని ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019-20 విద్య సంవత్సరం నుండి ప్రారంభించారు.
స్కాలర్షిప్ | జగనన్న అమ్మఒడి |
స్కాలర్షిప్ టైప్ | పిల్లల్ని బడికి పంపే తల్లులకు ఆర్థిక సాయం |
ఎవరికి అందిస్తారు | I నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు |
అర్హుత | రెండు లక్షలలోపు కుటుంబ ఆదాయం |
అమ్మఒడి పథకం ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ ఎయిడెడ్, ఆన్ ఎయిడెడ్ పాఠశాలలు మరియు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో చదువుకునే పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు అమలుచేస్తున్నారు. ఈ పథకానికి సంబంధించిన లబ్దిదారులను పాఠశాల, స్థానిక గ్రామా మరియు వార్డు పరిపాలన విభాగాల ద్వారా గుర్తిస్తున్నారు.
అలానే అమ్మఒడి పథకాన్ని కుల, మత, ప్రాంత వివక్షత లేకుండా దారిద్య రేఖకు దిగువన వుండే అందరి విద్యార్థులకు దీన్ని అందిస్తున్నారు. ఈ పథకం పాఠశాల విద్యకు దూరమయ్యే ఎందరో నిరుపేద విద్యార్థులను బడిబాట పట్టేలా చేసింది. ఈ పథకాన్ని కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే అందజేస్తున్నారు.
అమ్మఒడి ఎలిజిబిలిటీ
- ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ ఎయిడెడ్, ఆన్ ఎయిడెడ్ పాఠశాలలు మరియు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో 1 నుండి ఇంటర్మీడియట్ చదువుకునే పేద కుటుంబాలకు చెందిన పిల్లలు.
- ఇంట్లో గరిష్టంగా ఒక విద్యార్థికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
- ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఉండకూడదు.
- నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు.
అమ్మఒడిక దరఖాస్తు విధానం
అమ్మఒడి పథకంకు సంబంధించి లబ్దిదారుల ఎంపికలో, సదురు విద్యార్థి చదువుతున్న పాఠశాలలు, కాలేజీలు మరియు స్థానిక గ్రామా, వార్డు పరిధిలో ఉండే వాలంటరీలు, ఇతర పరిపాలన విభాగాలు పాల్గొంటాయి.
ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలైన వెంటనే పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందిస్తారు. రెండవ దశలో విద్యార్థి తల్లి లేదా సంరక్షులు నుండి ఆధార్ నెంబర్, బ్యాంకు అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ మరియు రైస్ కార్డు వివరాలు సేకరిస్తారు.
తర్వాత దశలో సేకరించిన వివరాలను ఆన్‌లైన్'లో పొందుపర్చుతారు. ఆన్‌లైన్ యందు పొందుపర్చిన వివరాల ఆధారంగా స్థానిక పరిపాలన విభాగం సామజిక తనిఖీల ఆధారంగా తుది అర్హులను నిర్ణహిస్తారు. ఈ అర్హుతుల జాబితాను తర్వాత దశలో జగనన్న అమ్మఒడి పోర్టల్'లో ఉంచుతారు. ఇదే జాబితాను స్థానిక గ్రామ మరియు వార్డు సభల ద్వారా ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
ఇలా ఆమోదం పొందిన జాబితాను తర్వాత దశలో స్థానిక సచివాలయం, ప్రధాన ఉపాధ్యాయులు/ప్రిన్సిపాల్, మండల విద్యశాఖా అధికారి ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇలా ఆమోదం పొందిన విద్యార్థి తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని జమచేస్తుంది.