GAT-B & BET 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ
Admissions Research Entrance Exams

GAT-B & BET 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ

GAT-B & BET పరీక్షలను వివిధ బయోటెక్నాలజీ కోర్సులలో అడ్మిషన్లు మరియు జెఆర్ఎఫ్ ఎన్రోల్మెంట్ కోసం నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షలను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ బయోటెక్నాలజీ సహాయంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉమ్మడిగా నిర్వహిస్తుంది. ఏడాదికి ఒకసారి నిర్వహించే ఈ ప్రవేశ మరియు అర్హుత పరీక్ష పూర్తి వివరాలు తెలుసుకోండి.

Advertisement

GAT-B & BET 2023

Exam Name GATB & BET 2023
Exam Type Entrance Exam
Admission For Bio.tech  Courses & JRF
Exam Date 23/04/2023
Exam Duration 3 Hours
Exam Level National Level

గ్యాట్-బి & బీఈటీ వివరాలు

GAT-B - గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్-బయోటెక్నాలజీ

గ్యాట్-బి ప్రవేశ పరీక్షను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ బయోటెక్నాలజీకి చెందిన వివిధ బయోటెక్నాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్ మరియు వాటి అనుబంధ పీజీ ప్రోగ్రామ్స్ వైనాడు అడ్మిషన్లు కల్పించేందుకు నిర్వహిస్తారు. గ్యాట్-బి అనగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్-బయోటెక్నాలజీ (GAT-B) అని అర్ధం.

గ్యాట్-బి పరీక్ష ద్వారా అడ్మిషన్ పొందే కోర్సుల జాబితాలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంటెక్ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ మరియు మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ యానిమల్ బయోటెక్నాలజీ ఉన్నాయి.

ఈ ప్రవేశపరీక్షలో అర్హుత పొందడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 63 డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ బయోటెక్నాలజీ యొక్క రీజనల్ కేంద్రాలు & బయోటెక్నాలజీ యూనివర్సిటీలు మరియు ఇనిస్టిట్యూట్లలో ప్రవేశాలు పొందొచ్చు. వీటి యందు అడ్మిషన్ పొందిన వారికీ 5వేల నుండి గరిష్టంగా 12వేల వరకు నెలవారీ స్టైపెండ్ అందిస్తారు.

బయోటెక్నాలజీ ప్రోగ్రామ్స్ స్టైపెండ్
ఎంఎస్సీ బయోటెక్నాలజీ & అనుబంధ ప్రోగ్రామ్స్
ఎంఎస్సీ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ & అనుబంధ ప్రోగ్రామ్స్
ఎంటెక్ & మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రోగ్రామ్స్
5,000/- pm
7,500/- pm
12,000/- pm

బీఈటీ - బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్

బీఈటీ (BET) ప్రవేశ పరీక్షను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ బయోటెక్నాలజీ - జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ( DBT JRF ) ప్రోగ్రాం అందించేందుకు నిర్వహిస్తారు. బెట్ అనగా బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ అని అర్ధం.

బీఈటీ అందించే జేఆర్ఎఫ్ ప్రోగ్రాంను కేంద్రప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ సహాయంతో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ బయోటెక్నాలజీ అందిస్తుంది. బయోటెక్నాలజీ పరిశోధన రంగంలో భారతీయ యువతను భాగస్వామ్యం చేసే ఉద్దేశ్యంతో, ఈ జాతీయ అర్హుత పరీక్షను 2004 నుండి ఏటా ఒకసారి నిర్వహిస్తున్నారు. ఇందులో అర్హుత పొందిన వారు సంబంధిత ఇనిస్టిట్యూట్లలో పీహెచ్డీ ప్రోగ్రాంకు రిజిస్టర్ చేసుకునే అవకాశం లభిస్తుంది.

బీఈటీ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను రెండు కేటగిర్లుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. కేటగిరి - I జాబితాలో ఉన్న అభ్యర్థులకు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ల యందు జేఆర్ఎఫ్ చేసే అవకాశంతో పాటుగా పీహెచ్డీ రిజిస్టర్ చేసుకునే ఛాన్స్ కల్పిస్తారు.

కేటగిరి - II మెరిట్ అభ్యర్థులకు నెట్/గేట్ మాదిరిగా డీబీటీ స్పాన్సర్ చేసే రీసెర్చ్ ప్రోగ్రామ్స్ యందు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ అవకాశం కల్పిస్తారు. అలానే పీహెచ్డీ ప్రోగ్రాంకు రిజిస్టర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

గ్యాట్-బి & బీఈటీ ఎలిజిబిలిటీ

  • దరఖాస్తుదారుడు భారత పౌరుడు అయి ఉండాలి.
  • అభ్యర్థి వయస్సు గరిష్టంగా 28 ఏళ్ళు మించకూడదు.
  • సంబంధిత గ్రూపులతో 60% మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి.
GAT-B ఎలిజిబిలిటీ
GATB కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు సైన్స్ గ్రూపులో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత అయి ఉండాలి.
BET ఎలిజిబిలిటీ
బీఈటీ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు బీఈ, బీటెక్, ఎంబీబీఎస్ (బ్యాచిలర్ డిగ్రీ) పూర్తిచేసి ఉండాలి లేదా ఎంఎస్సీ/ ఎంటెక్/ వెటర్నరీ సైన్స్/ఎంఫార్మసీ/ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ, ఎంటెక్ (మాస్టర్ డిగ్రీ) కోర్సులు పూర్తిచేసి ఉండాలి లేదా బయోమెడికల్, బయోఇన్ఫర్మేటిక్స్, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటేషనల్ బయాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, జువాలజీ లేదా ఇతర అనుబంధ బయాలజీ/లైఫ్-సైన్స్ సబ్జెక్టులల్లో పీజీ పూర్తిచేసి ఉండాలి.

గ్యాట్-బి & బీఈటీ 2023 ఎగ్జామ్ షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభం 10 మార్చి 2023
దరఖాస్తు తుదిగడువు 31 మార్చి 2023
అడ్మిట్ కార్డు 10 ఏప్రిల్ 2023
పరీక్ష తేదీ 23 ఏప్రిల్ 2023
ఫలితాలు జూన్ 2023

గ్యాట్-బి & బీఈటీ దరఖాస్తు ఫీజు

ఎగ్జామ్ జనరల్  ఎస్సీ, ఎస్టీ & Pwd
GATB 2023 1,200/- 600/-
BET 2023 1,200/- 600/-
GATB & BET (Both) 2,400/- 1,200/-

గ్యాట్-బి & బీఈటీ దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు , జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.

గ్యాట్-బి & బీఈటీ ఎగ్జామ్ సెంటర్లు

గ్యాట్-బి & బీఈటీ దదరఖాస్తు సమయంలో అభ్యర్థులు కనీసం నాలుగు ఆప్షనల్ పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి దరఖాస్తు సమర్పించాక పరీక్ష కేంద్రాన్ని మార్చుకునే అవకాశం ఉండదు.

ఆంధ్రప్రదేశ్  తెలంగాణ 
గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం హైదరాబాద్/సికింద్రాబాద్

గ్యాట్-బి & బీఈటీ దరఖాస్తు ప్రక్రియ

గ్యాట్-బి & బీఈటీ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. గ్యాట్-బి & బీఈటీ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఇమెయిల్ మరియు మొబైల్ నెంబర్ ఆధారంతో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు మొదటి దశలో విద్యార్థి వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు పొందు పర్చాల్సి ఉంటుంది. రెండవ దశలో పరీక్షకు సంబందించి పేపర్ మరియు ఎగ్జామ్ కేంద్రం వంటి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

చివరిగా సంబంధిత ధ్రువపత్రాలు అప్లోడ్ చేసి, పరీక్ష ఫీజును చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అందించే సమాచారంకు పూర్తి జవాబుదారీ మీరే కాబట్టి ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి.

దరఖాస్తులో సమర్పించే ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక మూడు లేదా నాలుగు కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.

  • వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
  • మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
  • ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో  మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా  చూసుకోండి.
  • దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో  ఇవ్వాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
  • పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
  • నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

 గ్యాట్-బి పరీక్ష విధానం

గ్యాట్-బి ప్రవేశ పరీక్ష పూర్తి ఆన్‌లైన్‌ (CBT) విధానంలో జరుగుతుంది. పరీక్ష మూడు గంటల నిడివితో పూర్తి ఆబ్జెక్టివ్ పద్దతిలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మోత్తం 160 ప్రశ్నలతో రెండు సెక్షన్లుగా ఉంటుంది. సెక్షన్ A లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ అంశాల నుండి 60 ప్రశ్నలు ఇవ్వబడతాయి.

60 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 0.5 మార్కులు తొలగిస్తారు. ప్రశ్నలు 10+2 స్థాయిలో ఉంటాయి. సెక్షన్ B లో డిగ్రీ స్థాయి సిలబస్ నుండి బేసిక్ బయాలజీ, లైఫ్ సైన్సెస్ మరియు బయోటెక్నాలజీ సంబంధించి 100 ప్రశ్నలు ఇవ్వబడతయి.

వీటిలో 60 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కులు తొలగిస్తారు. ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో GAT-B లో పొందుపర్చిన సిలబస్ నుండి ఉంటాయి.

సెక్షన్ ఇవ్వబడే ప్రశ్నలు సమాధానం చేయాల్సిన ప్రశ్నలు మార్కులు
సెక్షన్ A  60 ప్రశ్నలు 60 ప్రశ్నలు 60 మార్కులు
సెక్షన్ B 100 ప్రశ్నలు 60 ప్రశ్నలు 180 మార్కులు
మొత్తం  160 ప్రశ్నలు 120 ప్రశ్నలు 240 మార్కులు
ప్రశ్న పత్రాలు ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. పరీక్ష నిడివి 3 గంటలు. సమయం : 9 Am నుండి 12 Pm 

 బీఈటీ పరీక్ష విధానం

బీఈటీ ప్రవేశ పరీక్ష పూర్తి ఆన్‌లైన్‌ (CBT) విధానంలో జరుగుతుంది. పరీక్ష మూడు గంటల నిడివితో పూర్తి ఆబ్జెక్టివ్ పద్దతిలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మోత్తం 200 ప్రశ్నలతో రెండు సెక్షన్లుగా ఉంటుంది. సెక్షన్ A లో జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, జనరల్ ఆప్టిట్యూడ్, అనలిటికల్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ మరియు జనరల్ బయోటెక్నాలజీ అంశాల నుండి 50 ప్రశ్నలు ఇవ్వబడతాయి.

50 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కులు తొలగిస్తారు. ప్రశ్నలు 10+2 స్థాయిలో ఉంటాయి. సెక్షన్ B లో బయోటెక్నాలజీ సంబంధించి 150 ప్రశ్నలు ఇవ్వబడతయి.

వీటిలో 50 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కులు తొలగిస్తారు. ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో BET లో పొందుపర్చిన సిలబస్ నుండి ఉంటాయి.

సెక్షన్ ఇవ్వబడే ప్రశ్నలు సమాధానం చేయాల్సిన ప్రశ్నలు మార్కులు
సెక్షన్ A  50 ప్రశ్నలు 50 ప్రశ్నలు 150 మార్కులు
సెక్షన్ B 150 ప్రశ్నలు 50 ప్రశ్నలు 150 మార్కులు
మొత్తం  200 ప్రశ్నలు 100 ప్రశ్నలు 300 మార్కులు
ప్రశ్న పత్రాలు ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. పరీక్ష నిడివి 3 గంటలు. సమయం : 3 Pm నుండి 6 Pm 

 గ్యాట్-బి & బీఈటీ తుది ఎంపిక

తుది ఎంపిక సంబంధిత అర్హుత పరీక్షలో పొందిన మెరిట్ మరియు వివిధ రిజర్వేషన్ల సమీకరణాల ఆధారంగా జరుగుతుంది.

Advertisement

Post Comment