Advertisement
జనరల్ నాలెడ్జ్ క్విజ్ 3 : తెలుగులో జీకే ప్రాక్టీస్ బిట్స్
Telugu Gk

జనరల్ నాలెడ్జ్ క్విజ్ 3 : తెలుగులో జీకే ప్రాక్టీస్ బిట్స్

పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను తెలుగులో సాధన చేయండి. వివిధ నియామక పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులు తమ జనరల్ స్టడీస్ అంశాల సన్నద్ధతను ఈ క్విజ్ ద్వారా అంచనా వేసుకునేందుకు అవకాశం లభిస్తుంది.

1. టమాటోలో కనిపించే ప్రధాన రసాయనం

  1. సిట్రిక్ యాసిడ్
  2. ఆక్సలిక్ యాసిడ్
  3. టార్టారిక్ యాసిడ్
  4. హైడ్రోక్లోరిక్ యాసిడ్

సమాధానం
2. ఆక్సలిక్ యాసిడ్

2. రక్తం సరాసరి pH విలువ

  1. 1.0 - 3.0 pH
  2. 7.30 - 7.42 pH
  3. 6.3 - 6.6 pH
  4. 4.8 - 8.4 pH

సమాధానం
2. 7.30 - 7.42 pH

3. ఈ కింది వాటిలో దేనిని బేకింగ్ సోడా అంటారు

  1. సోడియం కార్బోనేట్
  2. సోడియం బైకార్బోనేట్
  3. కాల్షియం ఆక్సీక్లోరైడ్
  4. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్

సమాధానం
2. సోడియం బైకార్బోనేట్

4. ఆభరణాలు మెరుగుపర్చేందుకు ఉపయోగించే రసాయనం

  1. ఫెర్రిక్ ఆక్సైడ్
  2. సిల్వర్ అయోడైడ్
  3. హైడ్రోజన్
  4. కాల్షియం ఆక్సీక్లోరైడ్

సమాధానం
1. ఫెర్రిక్ ఆక్సైడ్

5. బయో గ్యాస్ / గోబర్ గ్యాసులో ఉండే రసాయన వాయువులు

  1. కార్బన్ మోనాక్సైడ్ + హైడ్రోజన్
  2. మీథేన్ + కార్బన్ మోనాక్సైడ్
  3. నైట్రోజన్ + కార్బన్ డయాక్సైడ్ +హైడ్రోజన్
  4. మీథేన్ + కార్బన్ డయాక్సైడ్ + నైట్రోజన్ + హైడ్రోజన్

సమాధానం
4. మీథేన్ + కార్బన్ డయాక్సైడ్ + నైట్రోజన్ + హైడ్రోజన్

6. జంతువుల్లో క్యాన్సరు కలిగించే రసాయనాలు

  1. మెర్క్యూరీ
  2. కాడ్మియం
  3. ఆర్సెనిక్ & క్రోమియం
  4. లెడ్

సమాధానం
3. ఆర్సెనిక్ & క్రోమియం

7. కాస్టిక్ సోడా రసాయన నామం

  1. సోడియం హైడ్రాక్సైడ్
  2. సోడియం కార్బోనేట్
  3. అసిటిక్ యాసిడ్
  4. పొటాషియం కార్బోనేట్

సమాధానం
1. సోడియం హైడ్రాక్సైడ్

8. టెరిలీన్'లో ఉండే రసాయన సమ్మేళనాలు

  1. అడిపిక్ ఆసిడ్+హెక్సామెథైలెనెడియమైన్
  2. టెరెఫ్తాలిక్ యాసిడ్ & ఇథిలీన్ గ్లైకాల్
  3. డైమెథైల్ కార్బోనేట్ బిస్ ఫినాల్
  4. కోటోలున్ డైసోసైనేట్ + ఇథిలీన్ గ్లైకాల్

సమాధానం
2. టెరెఫ్తాలిక్ యాసిడ్ & ఇథిలీన్ గ్లైకాల్

9. లా ఆఫ్ ఎలెక్ట్రోలైసిస్ సృష్టికర్త

  1. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
  2. న్యూటన్
  3. కెల్విన్
  4. మైకేల్ ఫారడే

సమాధానం
4. మైకేల్ ఫారడే

10. కైనెటిక్ థియరీ ఆఫ్ టెంపరేచర్ ఎవరికి సంబంధించింది

  1. కెల్విన్
  2. ఆర్కిమెడిస్
  3. లూయిస్ బ్రెయిలీ
  4. WC రొంటిజెన్

సమాధానం
1. కెల్విన్

11. రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ కిందివానిలో దేనికి సంబంధించింది

  1. పార్టీ ఫిరాయింపులు
  2. ప్రాథమిక హక్కులు
  3. కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన
  4. భారతీయ భాషలు

సమాధానం
4. భారతీయ భాషలు

12. పంచాయతీ వ్యవస్థ గురించి రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ వివరిస్తుంది

  1. షెడ్యూల్ I
  2. షెడ్యూల్ IV
  3. షెడ్యూల్ XI
  4. షెడ్యూల్ IX

సమాధానం
3. షెడ్యూల్ XI

13. ఆదేశ సూత్రాలు ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు

  1. అమెరికా
  2. ఆస్ట్రేలియా
  3. ఐరీష్
  4. దక్షిణ ఆఫ్రికా

సమాధానం
3. ఐరీష్

14. దక్షిణ ఆఫ్రికా నుండి ఏ రాజ్యాంగ లక్షణాన్ని స్వీకరించారు

  1. ఏక పౌరసత్వం
  2. రాజ్యాంగ సవరణ పద్దతి
  3. ఉమ్మడి జాబితా
  4. గణతంత్ర రాజ్యం

సమాధానం
2. రాజ్యాంగ సవరణ పద్దతి

15. భారత పౌరసత్వ చట్టాన్ని ఏ సంవత్సరాల్లో సవరణ చేసారు

  1. 1986, 1992, 2003, 2005
  2. 1952, 1965, 1987, 1999
  3. 1948, 1952, 1969, 1988
  4. 1952, 1962, 1972, 1982

సమాధానం
1. 1986, 1992, 2003, 2005

16. భారత పౌరసత్వం ఏ రకమైనది

  1. ఏక పౌరసత్వం
  2. ద్వంద్వ పౌరసత్వం
  3. పై రెండూ
  4. పైవేవీ కావు

సమాధానం
1. ఏక పౌరసత్వం

17. ఈ క్రింది వానిలో ప్రాథమిక హక్కు కానిది

  1. ఆస్తి హక్కు
  2. సమానత్వ హక్కు
  3. స్వేచ్ఛ హక్కు
  4. రాజ్యాంగ పరిరక్షణ హక్కు

సమాధానం
1. ఆస్తి హక్కు

18. ఆస్తి హక్కును ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు

  1. 41 వ రాజ్యాంగ సవరణ
  2. 42 వ రాజ్యాంగ సవరణ
  3. 43 వ రాజ్యాంగ సవరణ
  4. 44 వ రాజ్యాంగ సవరణ

సమాధానం
4. 44 వ రాజ్యాంగ సవరణ

19. మత స్వచ్ఛను రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ అందిస్తున్నాయి

  1. ఆర్టికల్ 14 - 18
  2. ఆర్టికల్ 19 - 22
  3. ఆర్టికల్ 23 - 24
  4. ఆర్టికల్ 25 - 28

సమాధానం
4. ఆర్టికల్ 25 - 28

20. ఇందులో భావ వ్యక్తీకరణకు సంబంధించిన ఆర్టికల్ ఏది

  1. ఆర్టికల్ 22
  2. ఆర్టికల్ 19
  3. ఆర్టికల్ 20
  4. ఆర్టికల్ 21

సమాధానం
2. ఆర్టికల్ 19

21. ఆర్టికల్ 16 క్రింది వానిలో దేనికి సంబంధించినది

  1. ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు
  2. అంటరానితనం రద్దు
  3. ప్రాథమిక విద్య హక్కు
  4. మత స్వేచ్ఛ హక్కు

సమాధానం
1. ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు 

22. ఈ క్రింది వానిలో దేని కోసం ప్రొహిబిషన్ రిట్ ఉపయోగిస్తారు

  1. నిర్బంధంలో ఉన్న వ్యక్తిని కోర్టు ముందు హాజరు పర్చేందుకు
  2. విధి ఉల్లంఘన చేసిన ప్రభుత్వ అధికారికి
  3. పరిధిని మించిన న్యాయ దిగువ స్థానాలకు
  4. కింది కోర్టుల ఆదేశాలను, తీర్పులను రద్దు చేసేందుకు

సమాధానం
3. పరిధిని మించిన దిగువ న్యాయ స్థానాలకు

23. నిర్బంధపు వ్యక్తిని కోర్టు ముందు హాజరుపర్చేందుకు ఉపయోగించే రిట్

  1. మాండమస్
  2. హెబియస్ కార్పస్
  3. ప్రొహిబిషన్
  4. సెర్షియోరరి

సమాధానం
2. హెబియస్ కార్పస్

24. ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది

  1. వీటిని అమలు పర్చేందుకు శాసనాలు అవసరం
  2. వీటికి చట్టబద్దత లేదు
  3. ఇవి సామాజిక, రాజకీయ ప్రజాస్వామ్యానికి దోహద పడతాయి
  4. పైవన్నీ సరైనవి

సమాధానం
4. పైవన్నీ సరైనవి

25. వన్యప్రాణుల సంరక్షణ చట్టం & అటవీ సంరక్షణ చట్టం

  1. 1972 & 1980
  2. 1962 & 1982
  3. 1952 & 1956
  4. 1972 & 1972

సమాధానం
1. 1972 & 1980

26. ఇందులో ప్రాథమిక విధుల జాబితాలో లేనిది

  1. భారత సార్వమౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను పరిరక్షించడం
  2. మిశ్రమ సంస్కృతీ, సాంప్రదాయాలను గౌరవించడం
  3. బాలకార్మికులను పనులలో చేర్చుకోకపోవడం
  4. ప్రజల ఆస్తిని సంరక్షించడం

సమాధానం
3. బాలకార్మికులను పనులలో చేర్చుకోకపోవడం

27. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను తొలగించే అధికారం ఎవరికి ఉంది

  1. రాష్ట్రపతి
  2. ముఖ్యమంత్రి
  3. గవర్నర్
  4. ప్రధాన న్యాయమూర్తి

సమాధానం
1. రాష్ట్రపతి

28. కృష్ణ జల వివాదాల ట్రిబ్యునల్ ఏ రాష్ట్రాలకు చెందినది

  1. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
  2. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
  3. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
  4. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సమాధానం
2. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్

29. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన సంవత్సరం

  1. 1969
  2. 1986
  3. 1990
  4. 2004

సమాధానం
1. 1969

30. దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించే హక్కు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కల్పిస్తుంది

  1. ఆర్టికల్ 362
  2. ఆర్టికల్ 252
  3. ఆర్టికల్ 262
  4. ఆర్టికల్ 352

సమాధానం
4. ఆర్టికల్ 352

Post Comment