Basic English Grammar Terms In Telugu | తెలుగులో స్పోకెన్ ఇంగ్లీష్
Spoken English

Basic English Grammar Terms In Telugu | తెలుగులో స్పోకెన్ ఇంగ్లీష్

ఇంగ్లీషు భాషను నేర్చుకునే ముందు దానికి సంబంధించిన ప్రాథమిక గ్రామర్ టెర్మినాలజీ నేర్చుకోవాలి. ఈ గ్రామర్ టెర్మినాలజీ తెలియకుండా ముందుకు పోతే అభ్యాసన కఠినమౌతుంది. ముందుముందు తారసపడే కొన్ని సంగతులు ఒక పట్టున అర్దమైచావవు.

Advertisement

అవి ముఖ్యంగా Number, Gender, Tense, Person, Articles, Subject, Object, Verb, Parts of speech etc. ఈ విషయాల్ని ప్రారంభంలోనే కొంచెంగా అయినా తెలియకపోతే, వాక్యాల్లో ఏ మాట కావాలంటే ఆ మాటని ఉపయోగించలేము. కాబట్టి వీటన్నింటిని క్లుప్తంగా చూద్దాం.

Word ( పదం)

A sound or letter or group of sounds or letters that expresses a particular meaning

ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలా కలయిక వలన ఏర్పడిన మాట లేదా శబ్దాన్ని పదం అంటారు. ఆంగ్లభాషలో ఏక అక్షర పదాలుగా A & I లు ఉన్నాయి. Ex : Bat, Cat , Success, freedom etc.

Sentence (వాక్యం)

A group of words containing a subject and a verb, that expresses a statement, a question, etc. When a sentence is written it begins with a big (capital) letter and ends with a full stop.

అర్థవంతమైన అర్దనిచ్చే కొన్ని పదాల సముదాయాన్ని వాక్యం (sentence) అంటారు. వ్యాకరణం పరంగా చెప్పాలంటే కర్త, కర్మ, క్రియ కలిగిన పదాల సమూహాన్ని వాక్యం అంటారు. Ex : Arjun is walking.

Tense (కాలం)

కాలాన్ని గురించి మాట్లాడే ఇంగ్లీషు వ్యాకరణ మాటను Tense అంటారు. తెలుగులో ఉన్నట్లే ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా మూడు కాలాలు ఉన్నాయి. వాటిని Past Tense (భూత కాలం), Present Tense (వర్తమాన కాలం), Future Tense (భవిష్యత్ కాలం) గా చెప్పుకుంటాం. వీటితో పాటుగా ఇంకో కాలం కూడా ఉంది. అన్ని కాలాలకూ వర్తించే కాలం. తెలుగులో దీన్ని "తద్ధర్మ కాలం" అంటారు. ఇంగ్లీషులో జనరల్ టెన్స్ అంటారు.

"నేను జ్యూస్ తాగాను" అనే వాక్యం, జరిగిపోయిన కాలాన్ని చెబుతుంది. ఈ కాలం, "నేను"నీ బట్టి గానీ, "జ్యూస్"నీ బట్టి గానీ తెలియదు. "తాగాను" బట్టి తెలుస్తుంది. తాగాను అనేది ఈ వాక్యంలో ఉన్న క్రియ రూపం. వాక్యంలో ఉండే క్రియ రూపం బట్టే ..ఆ క్రియ ఈ కాలంలో జరిగిందనేది మనకు అర్ధమౌతుంది. భాష నేర్చుకోవడంలో "Tenses" (కాలం) ముఖ్యమైన ఘట్టం. మీరు కాలానికి అనుగుణంగా క్రియ రూపాలను మార్చి, మాటలు రూపొందించ గలిగితే, మీరు భాష  నేర్చుకోవడంలో విజయవంతమైనట్లు అర్ధం.

Yesterday (నిన్న) Past tense (భూత కాలం)
Today (ఈ రోజు) Present tense (వర్తమాన కాలం)
Tomorrow (రేపు) Future tense (భవిష్యత్ కాలం)

Subject, Object, Verb

వాక్యాలు ఎలా ఏర్పడతాయో నేర్చుకోవడానికి Subject (కర్త), Object (కర్మ), Verb (క్రియా) అంశాలపై అవగాహనా ఉండాలి. ఒక వాక్యాన్ని చూసినప్పుడు, అందులో జరిగిన పని ఏమిటో ముందుగా అర్ధం చేసుకుంటే, దానికి వచ్చే జవాబు క్రియ అవుతుంది. క్రియ (పని) చేసింది ఎవరు/ఏది అనే ప్రశ్నవేస్తే వచ్చే సమాధానం కర్త (subject) అవుతుంది. అలానే క్రియ మీద దేనిని, వేటిని అనే ప్రశ్నలు వేస్తె, జరిగిన కర్మ ఏంటో తెలుస్తుంది.

Subject (కర్త)

A subject is a part of a sentence that contains the person or thing performing the action in a sentence. Ex : You were a great singer.

Object (కర్మ)

An object is a noun (or pronoun) that is governed by a verb or a preposition. There are three kinds of object: Direct Object (I know him.) Indirect Object (Give her the prize.) Object of a Preposition (Sit with them.)

Verb (క్రియ)

A verb is the action or state of being in a sentence. Verbs can be expressed in different tenses, depending on when the action is being performed. Ex : She accepted the job offer.

Person

Person refers to a human or non-human entity that is treated as a person.

పర్సన్ అంటే వ్యక్తి అని కాదు. వ్యక్తి గానీ, జంతువు గానీ, వస్తువు గానీ, విషయం గానీ, ఏదైనా పర్సన్ కిందకే వస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే కర్తగా ఉండేది ఏదైనా పర్సనే అవుతుంది. వాక్యంలో క్రియ అనే అతి ముఖ్యమైన భాగం దేనిని బట్టి వస్తుందో అదే పర్సన్ అవుతుంది.

" నేను ఉన్నాను " అనే వాక్యంలో "ఉన్నాను' అనేది క్రియ. ఇది "నేను" అనే కర్తను బట్టి వచ్చింది. ఉదాహరణకు నేను కాకుండా నువ్వు అని మార్పు చేస్తే, క్రియ ఉన్నాను నుండి ఉన్నావు కీ మారుతుంది. అలానే అతడు అని మార్పు చేస్తే ఉన్నాడు అని, వస్తువు అయితే ఉంది అని వస్తుంది. అంటే వాక్యం ఏర్పడటానికి అవసరమయ్యే క్రియ పర్సన్ బట్టి ఉంటుంది.

ఇంగ్లీషు భాషలో మూడు రకాల పర్సన్స్ ఉంటారు. First Person (ఉత్తమ పురుష), Second person (మధ్యమ పురుష ), Third person (ప్రథమ పురుష).

First Person
(మాట్లాడే వ్యక్తి)
Person used by a speaker in statements referring to himself or herself (first person singular ) or to a group including himself or herself (first person plural ).
Second person
(ఎదురుగా ఉండే వ్యక్తి)
The second-person point of view belongs to the person (or people) being addressed. This is the “you” perspective
Third person
(సంభాషణలో లేని మూడవ వ్యక్తి )
The third-person point of view belongs to the person (or people) being talked about.

పర్సన్ సంబంధించి విభజన అన్ని భాషల్లోనూ ఉంటుంది. కొన్ని భాషల్లో అది మూడు కన్నా ఎక్కువ రకాలుగా కూడా ఉండొచ్చు. తెలుగులో పర్సన్స్ మూడు రకాలుగానే ఉంటుంది. "తను -ఉత్తమ, ఎదుట - మధ్యమ, ఎక్కడో - ప్రథమ" అనే సూత్రం మాత్రమే ఉంది. తెలుగులో ఉండే ప్రథమ పురుషులలోని ప్రథమ మాటను చూసి, దీనినే ఫస్ట్ పర్సన్ అనుకునే పొరపాటు జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటిని సరిగా గుర్తుపెట్టుకోండి. ఈ పర్సన్ విభజన అవసరం ఏమిటో, వాక్యం రాయడం ప్రారంభించినప్పుడు తెలుస్తుంది.

First Person (ఉత్తమ పురుష) Second person (మధ్యమ పురుష) Third person (ప్రథమ పురుష)
I (నేను)
WE (మేము/మనము)
YOU (నువ్వు, మీరు) HE (అతడు, ఇతడు), SHE (ఆమె. ఈమె)
THEY (వారు, వీరు)
THIS (ఇది), THAT (అది), IT (ఇదీ, అదీ)

Number (ఏక, బహు వచనాలు)

ఒక్క సంఖ్యని మాత్రమే చెప్పే మాట "ఏక వచనం" (singular Number), ఒకటి కంటే ఎక్కువ సంఖ్యని చెప్పే మాట  బహు వచనం (plural number) అవుతుంది. సాధారణంగా ఇంగ్లీషులో ఏక వచనానికి "S" చేరితే బహు వచనం అవుతుంది. కానీ ప్రతీచోటా అలాగే జరగదు.

ఏక వచనం బహు వచనం ఏక వచనం బహు వచనం
Book Books Box Boxes
Cow Cows Man Men
Pen Pens Foot Feet
Baby Babies Tooth Teeth
Potato Potatoes Knife Knives
Crisis Crises Thief Thieves
Analysis Analyses Goose Geese
Life Lives Child Children

పై ఉదాహరణలలో ముందు వరుసలో మొదటి మూడు ఏక వచన పదాలకు చివరన "S" చేర్చడం ద్వారా బహు వచన రూపాలు ఏర్పడటం మనం చూసాం. కానీ మిగత పదాలలో ఈ ఫార్ములా పనిచేయలేదు.  కొన్ని చోట్ల es చేరి బహు వచనం అయితే, కొన్నింటికి ies చేరడం ద్వారా, ఇంకొన్నిటికి మధ్యలో అక్షరాలు మారడం ద్వారా బహు వచన రూపాలు ఏర్పడ్డాయి.

అలానే వాక్యాలు రాసేటప్పుడు ఏక వచన సబ్జెక్టు (కర్త) తర్వాత "is" అనే సహాయక/ప్రధాన క్రియను ఉపయోగిస్తారు. బహు వచన సబ్జెక్టు (కర్త) తర్వాత "are" అనే సహాయక/ప్రధాన క్రియను ఉపయోగిస్తారు.ex

Ex :  This is book (ఏక వచనం) | These are books (బహు వచనం)

కొన్ని మాటలు ఏక వచనాలుగా కనిపించేటప్పటికీ, అవి బహు వచనాలుగా పరిగణించాలి. ఈ పదాలతో వాక్యాలు వచ్చేటప్పుడు "are" క్రియను ఉపయోగించాలి. Ex : People, Cattle, Police

కొన్ని మాటలు ఏక వచన మరియు బహు వచన రూపాలు ఒకేవిదంగా ఉంటాయి. వీటిని మాట్లాడే సందర్భం అనుచరించి సబ్జెక్టు ఏక వచనంలో ఉందా లేక బహు వచనంలో ఉందా అనేది గుర్తించీ, దానికి అనుగుణంగా is లేదా are క్రియ ఉపయోగించాలి. Ex : Deer, Sheep, Species, Corps, Canon

Gender (లింగ భేదం)

వ్యక్తి లేదా జంతువు లేదా వస్తువు యొక్క స్త్రీ పురుష భేదాన్ని తెలుసుకునేందుకు ఉపయోగించే పదాన్ని లేదా మాటను జండర్ అంటారు. ఇంగ్లీషు భాషలో నాలుగు రకాల లింగ బేధాలను గుర్తించారు. మనుషులు లేదా జంతువుల యొక్క స్త్రీ లింగ జీవులను feminine Gender (స్త్రీ లింగం) అంటారు. మనుషులు లేదా జంతువుల యొక్క పులింగ జీవులను Masculine Gender (పుల్లింగము) అంటారు.

లింగ భేదం గుర్తించలేని మాటలను Neuter Gender (నపుంసక లింగం) అంటారు. స్త్రీ పురుషులు ఇద్దరికి ఒకరకమైన మాటతో పిలిచే లింగాన్ని Common Gender అంటారు. తెలుగు వ్యాకరణంలో మొదటి మూడు రకాలే ఉన్నాయి గానీ, కామన్ జండర్ లేదు. అంటే తెలుగులో ఈ రకమైన మాటలే లేవని అర్ధం కాదు. తెలుగులో కూడా స్త్రీ పురుష బేధాలు తెలియని "బిడ్డ, చుట్టం, వ్యక్తి, పని మనిషి" లాంటి మాటలు ఉన్నాయి. కానీ వాటిని ఒక ప్రత్యేక జండరుగా తెలుగులో వర్గీకరించలేదు.

feminine Gender (స్త్రీ లింగం) Bhavani, She, Girl, Cow
Masculine Gender (పుల్లింగము) Ramu, He, Boy, Bull
Neuter Gender (నపుంసక లింగం) Book, Table, River, Tree
Common Gender (కామన్ లింగం) Child, Person, Servant, Student, Teacher, People

ఇంగ్లీషు మాటల్లో స్త్రీ, పురుష బేధాలు మూడు రకాలుగా ఏర్పడుతాయి. 1. స్త్రీ లింగం మాటకు, పులింగాల మాటకీ సంబంధం లేకుండా, ఇవి పూర్తిగా వేరువేరు మాటలుగా ఉంటాయి. 2. పుల్లింగము మాటకీ ess చేరి, స్త్రీ లింగం మాట ఏర్పడుతుంది. 3. స్త్రీ పురుష బేధాన్నీ తెలిపే మాటలు అదనంగా చేరడం ద్వారా స్త్రీ లింగం ఏర్పడే పదాలు.

1 స్త్రీ లింగం మాటకు, పులింగాల మాటకీ సంబంధం లేకుండా ఉండేవి. Boy - Girl
Son - Daughter
Father - Mother
Brother - Sister
Bull - Cow
Cock - Hen
Husband - Wife
king - Queen
2 పుల్లింగము మాటకీ ess చేరడం ద్వారా స్త్రీ లింగం ఏర్పడే పదాలు. Lion - Loiness
Poet - Poetess
God - Goddess
Master - Mistress
3 స్త్రీ పురుష బేధాన్నీ తెలిపే మాటలు అదనంగా చేరడం ద్వారా స్త్రీ లింగం ఏర్పడే పదాలు. He- goat
She - goat
Cock- sparrow
Hen - Sparrow
Land - lord
Land - lady
Male - servant
Maid - servant

ఇవి మాత్రమే కాకా ఇంకొన్ని ఇంగ్లీషు వ్యాకరణ పదాలు ఉన్నాయి. వీటికి సంబంధించి, అవి తారసపడే సందర్భాలలో వివరంగా నేర్చుకుందాం. ఈ వ్యాకరణ టెర్మినాలజీ పై అవగహన కుదిరితేనే, భాషను సులువుగా అధ్యయనం జరిపేందుకు అవకాశం కుదురుతుంది. ఇంతటితో దీన్ని ముగిద్దాం.

Advertisement

Post Comment