Advertisement
ఐసీఐసీఐ బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ : స్టూడెంట్ లోన్ కోసం అప్లై చేయండి
Student Loans

ఐసీఐసీఐ బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ : స్టూడెంట్ లోన్ కోసం అప్లై చేయండి

ఐసీఐసీఐ బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేయండి. ఐసీఐసీఐ బ్యాంకు, అన్ని రకాల దేశీయ మరియు విదేశీ విద్యకు అవసమయ్యే విద్యా రుణాలను విద్యార్థులకు ఆఫర్ చేస్తుంది. అందుబాటులో ఉండే వడ్డీ రేట్లలతో సహా, సులభతరమైన డాక్యుమెంటేషన్ విధానంతో 50 వేల మొత్తం నుండి గరిష్టంగా కోటి రూపాయల వరకు రుణం మంజూరు చేస్తుంది. 40 లక్షల లోపు రుణాలను ఎటువంటి పూచీకత్తు లేకుండా అందిస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ దరఖాస్తు విధానం

ప్రస్తుతం విద్యా రుణాలు అన్నీ విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా అందిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సదురు అధికారులు మీ దరఖాస్తును పరిశీలించి, విద్యార్థి అర్హుతను నిర్ణహిస్తారు. అర్హుత పొందిన విద్యార్థులకు 10 నుండి 15 రోజులలో లోన్ మంజూరు చేస్తారు.

రెండవ విధానంలో విద్యార్థులు నేరుగా దగ్గరలో ఉండే ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్రాంచు మేనేజర్ లేదా లోన్ సెక్షన్ అధికారులను కలవడం ద్వారా ఎడ్యుకేషన్ లోన్లకు సంబంధించి పూర్తి వివరాలు అందజేస్తారు. మీరు అర్హులైతే సంబంధిత సర్టిఫికెట్లు సేకరించి, పరిశీలించి విద్యా రుణనాన్ని మంజూరు చేస్తారు.

ఐసీఐసీఐ ఎడ్యుకేషన్ లోన్ కోసం జత చేయాల్సిన ధ్రువపత్రాలు

  • చదివిన విద్యాసంస్థ నుంచి బదిలీ ధ్రువపత్రం (టీసీ).
  • మార్కుల జాబితా (ఉత్తీర్ణత సర్టిఫికెట్). ఇంతవరకు పొందిన ఉపకార వేతన పత్రాలు.
  • ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షా ర్యాంకు కార్డు. ప్రవేశ అనుమతి పత్రాలు (అడ్మిషన్ సర్టిఫికెట్).
  • చదవాల్సిన కోర్సుకు చెందిన ఫీజుల అంచనా వివరాలు. తల్లి/ తండ్రి/ సంరక్షుడు/ విద్యార్థికి సంబంధించిన పాస్‌ ఫోటోలు.
  • విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి వేతన ధ్రువపత్రాలు, ఆస్తి వివరాలు.
  • నివాస ధృవీకరణ కోసం ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, పాస్‌పోర్ట్‌ లాంటివి జత చేయాలి.
  • విదేశీ చదువులు : చెలుబాటు అయ్యే పాసుపోర్టు, i20వీసా, అడ్మిషన్ పొందిన విదేశీ యూనివర్సిటీ అడ్మిట్ లెటర్, గ్యాప్ సర్టిఫికేట్, జీఆర్ఈ, జీమ్యాట్, ఐఈఎల్టీఎస్, టోఫెల్, శాట్ పరీక్షలలో ఏదోకటి ఉత్తీర్ణత పొంది ఉండాలి.
Loan Amount Need Based (విద్యార్థుల అవసరానికి తగ్గట్టు). 50 వేల నుండి గరిష్టంగా కోటి రూపాయల వరకు విద్యా రుణాలను మంజూరు చేస్తుంది. ఇండియాలో చదివే విద్యార్థులకు గరిష్టంగా 50 లక్షలు, విదేశాల్లో చదివే విద్యార్థులకు గరిష్టంగా కోటి వరకు ఆఫర్ చేస్తున్నారు.
Courses Covered గుర్తింపు పొందిన యూనివర్సిటీలలో డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్, పీహెచ్డీ, టెక్నికల్, ప్రొపిసినల్ మరియు మానేజ్మెంట్ కోర్సులు. అలానే పార్ట్ టైమ్ రీసెర్చ్ & ఇతర సర్టిఫికేటెడ్ కోర్సులకు కూడా ఈ ఋణం మంజూరు చేస్తారు. CIMA (లండన్ ) CPA (USA) సంస్థలు నిర్వహించే కోర్సులు.
Expenses Covered
  • పూర్తి ట్యూషన్ ఫీజు & హాస్టల్ రుసుములు
  • పరీక్ష / లైబ్రరీ / ప్రయోగశాల ఫీజు
  • పుస్తకాలు / పరికరాల కొనుగోలు
  • కాషన్  డిపాజిట్ / బిల్డింగ్ ఫండ్ / రిఫండబుల్ డిపాజిట్.
  • కంప్యూటర్ / ల్యాప్‌టాప్ కొనుగోలు.
  • విద్యకు సంబంధించిన ఇతర ఖర్చులు.
Interest Rate Up to 12%
Processing Charges Not specified
Margin ప్రీమియర్ ఇనిస్టిట్యూట్లకు ఎటువంటి మార్జిన్ వర్తింపజేయరు. మిగతా యూనివర్సిటీలలో కూడా 20 లక్షల  వరకు ఎటువంటి మార్జిన్ లేదు. 20 లక్షలు దాటే రుణాలకు 5 నుండి 15% మార్జిన్ అమలు చేస్తారు.
Security ఎంపిక చేసిన యూనివర్సిటీలలో గరిష్టంగా 40 లక్షల వరకు విద్యార్థి మరియు తల్లిదండ్రుల హామీ ఉంటె సరిపోతుంది. 40 లక్షలు దాటే రుణాలకు పూర్తి స్థాయి పూచీకత్తులు సమర్పించాల్సి ఉంటుంది.
Repayment రీపెమెంట్, కోర్సు పూర్తయినా 6 నెలల తర్వాత నుండి చెల్లించాల్సి ఉంటుంది. రీపెమెంట్ 8 నుండి 12 ఏళ్ల నిడివిలో పూర్తిచేయాల్సి ఉంటుంది.

Post Comment