టాటా క్యాపిటల్ ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేయండి. ఇండియాలో ఒకొనొక లీడింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టుమెంట్ సంస్థ అయినా టాటా క్యాపిటల్, ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థుల కోసం కాంపిటేటివ్ వడ్డీ రేట్లతో విద్యా రుణాలను ఆఫర్ చేస్తుంది. దేశ వ్యాప్తంగా విస్తరించిన తమ బ్రాంచు శాఖల ద్వారా సులభ సింపుల్ డాక్యుమెంటేషన్ తో, కనిష్టంగా 75 వేల నుండి గరిష్టంగా 25 లక్షల వరకు లోను మంజూరు చేస్తున్నారు.
టాటా క్యాపిటల్ ఎడ్యుకేషన్ లోన్ దరఖాస్తు విధానం
అర్హుత ఉండే విద్యార్థులు టాటా క్యాపిటల్ పోర్టల్ ద్వారా లేదా మీకు దగ్గరలో ఉండే టాటా క్యాపిటల్ బ్రాంచు శాఖల ద్వారా సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు జాయిన్ అయినా కోర్సు, యూనివర్సిటీ, విద్యార్థి ఆర్థిక పరిస్థితి, రీపేమెంట్ చేసే సామర్థ్యం పరిశీలించి అర్హులైన వారికీ లోన్ మంజూరు చేస్తారు.
దరఖాస్తుతో పాటుగా జత చేయాల్సిన ధ్రువపత్రాలు
- చదివిన విద్యాసంస్థ నుంచి బదిలీ ధ్రువపత్రం (టీసీ).
- మార్కుల జాబితా (ఉత్తీర్ణత సర్టిఫికెట్). ఇంతవరకు పొందిన ఉపకార వేతన పత్రాలు.
- ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షా ర్యాంకు కార్డు. ప్రవేశ అనుమతి పత్రాలు (అడ్మిషన్ సర్టిఫికెట్).
- చదవాల్సిన కోర్సుకు చెందిన ఫీజుల అంచనా వివరాలు. తల్లి/ తండ్రి/ సంరక్షుడు/ విద్యార్థికి సంబంధించిన పాస్ ఫోటోలు.
- విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి వేతన ధ్రువపత్రాలు, ఆస్తి వివరాలు.
- నివాస ధృవీకరణ కోసం ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ లాంటివి జత చేయాలి.
- విదేశీ చదువులు : చెలుబాటు అయ్యే పాసుపోర్టు, i20వీసా, అడ్మిషన్ పొందిన విదేశీ యూనివర్సిటీ అడ్మిట్ లెటర్, Gap certificate, GRE, GMAT, IELTS, TOEFL, SAT లలో ఏదోకటి ఉత్తీర్ణత పొంది ఉండాలి.
టాటా క్యాపిటల్ ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేయండి
Loan Amount | Need Based. కనిష్టంగా 75 వేల నుండి గరిష్టంగా 25 లక్షల వరకు |
Courses Covered | గుర్తింపు పొందిన యూనివర్సిటీలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్, డిప్లొమా కోర్సులు. అలానే పార్ట్ టైమ్ రీసెర్చ్ & ఇతర సర్టిఫికేటెడ్ కోర్సులకు కూడా ఈ ఋణం మంజూరు చేస్తారు. |
Expenses Covered |
|
Interest Rate | Up to 10.99% PA |
Processing Charges | మంజూరు చేసిన లోనులో 2.75% ప్రాసెసింగ్ ఛార్జీ మినహాయింపు ఉంటుంది. |
Margin | Not specified |
Security | మంజూరు చేసే రుణానికి సమానమైన పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది. |
Repayment | ఏడాది నుండి 5 ఏళ్ళ లోపు పూర్తిచేయాల్సి ఉంటుంది. |