ఎస్‌బీఐ పీఓ పోస్టులకు దరఖాస్తు చేయండి | మొత్తం ఖాళీలు 1673
Bank Jobs Latest Jobs

ఎస్‌బీఐ పీఓ పోస్టులకు దరఖాస్తు చేయండి | మొత్తం ఖాళీలు 1673

ఎస్‌బీఐ మరియు దాని అనుబంధ శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ & మానేజ్మెంట్ ట్రైనీల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా దరఖాస్తులు కోరుతుంది. దేశంలో ఉండే ఇతర ప్రభుత్వ బ్యాంకులు తమ సిబ్బందిని ఐబీపీఎస్ నియామక పరీక్షల ద్వారా భర్తీ చేసుకుంటూండగా ఎస్‌బీఐ మాత్రం సమ స్వంత నియామక ప్రక్రియను అవలంభిస్తుంది.

తాజా నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 1673 ప్రొబేషనరీ ఆఫీసర్స్ & మానేజ్మెంట్ ట్రైనీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి 21 నుండి 30 ఏళ్ళ మధ్య వయసు ఉండే అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఈ నియామక పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

నియామక బోర్డు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
నియామక పరీక్ష ఎస్‌బీఐ పీఓ ఎగ్జామ్
ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష/ఇంటర్వ్యూ
ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేషన్
వయో పరిమితి 21 - 30 ఏళ్ళ మధ్య

ఎస్‌బీఐ పీఓ పోస్టుల ఖాళీల వివరాలు

మొత్తం ఖాళీలు 1,673 పోస్టులు
రెగ్యులర్ ఖాళీలు బ్యాక్‌లాగ్ ఖాళీలు
SC - 240 పోస్టులు
ST - 120 పోస్టులు
OBC - 432 పోస్టులు
EWS - 160 పోస్టులు
UR - 648 పోస్టులు
SC - 30 పోస్టులు
ST - 11 పోస్టులు
OBC - 32 పోస్టులు
EWS - 0
UR - 0
మొత్తం ఖాళీలు - 1,600 పోస్టులు మొతం ఖాళీలు - 73 పోస్టులు

డిగ్రీ అర్హుతతో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఎంట్రీ లెవెల్ జూనియర్ మానేజ్మెంట్ సీట్లలో పాగా వేయాలనుకుంటే ఎస్‌బీఐ పీఓ పరీక్ష రాయాల్సిందే. సామాజిక హోదా, ఉద్యోగ భరోసా, విధి నిర్వహణ సవాలు, ఈ మూడింటింటిని పుణికిపుచ్చుకున్న పీఓ ఉద్యోగాలన్ని సాధించేందుకు లక్షల కొలది నిరుద్యోగులు పోటీపడతారు.

బ్యాంకుల సాంకేతిక, ఆర్థిక కార్యకలాపాకు మార్గనిర్దేశం వహించే పీఓలు, వ్యక్తిగత బ్యాంకింగ్ నుండి రూరల్ బ్యాంకింగ్, క్రెడిట్, ఫారెక్స్, ట్రెజరీ వంటి అనేక ముఖ్య విధులు నిర్వర్తిస్తారు. ఎస్‌బీఐ పీఓల ప్రారంభ వేతనం 41,960/- నుండి ప్రారంభమౌతుంది. డీఏ, హౌస్ రెంట్, ఇతర అలెవెన్సులు అన్ని కలుపుకుంటే యేడాదిలో గరిష్టంగా 12.5 లక్షల నుండి 18.9 లక్షల ( మెట్రో సిటీలలో) రూపాయల వరకు అందుకుంటారు.

దీనితో పాటుగా నాలుగు దశలో ప్రతీ మూడేళ్లకు శాలరీ ఇంక్రిమెంట్స్ తో పాటుగా కెరీర్ పరంగా ఎదిగేందుకు ప్రొమోషన్స్ కల్పించబడతాయి. ఎస్‌బీఐ యేటా ఏప్రిల్, సెప్టెంబర్ నెలల్లో పీఓ నియామక ప్రకటన విడుదల చేస్తుంది.

ఎస్‌బీఐ పీఓ 2022 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభం 22-09-2022
దరఖాస్తు తుదిగడువు 12-10-2022
ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ డిసెంబర్ 2022
ప్రిలిమినరీ ఎగ్జామ్ 17 to 20 డిసెంబర్ 2022
ప్రిలిమినరీ ఫలితాలు జనవరి 2023
మెయిన్స్ ఎగ్జామ్ కాల్ లెటర్ ఫిబ్రవరి 2023
మెయిన్స్ ఎగ్జామ్ ఫిబ్రవరి 2023
మెయిన్స్ ఫలితాలు ఫిబ్రవరి 2023
ఇంటర్వ్యూ & గ్రూపు డిస్కషన్ మార్చి 2023
తుది ఫలితాలు మార్చి 2023
ట్రైనింగ్ నవంబర్ 2023

ఎస్‌బీఐ పీఓ ఎలిజిబిలిటీ

  • జాతీయత: అభ్యర్థులు భారతీయ పౌరులయి ఉండాలి.
  • విద్య అర్హుత: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. చివరి యేడాది గ్రాడ్యుయేషన్ చదువవుతున్న విద్యార్థులు కూడా అర్హులు.
  • ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులు
  • ఇంగ్లీష్ధ నైపుణ్యం: రఖాస్తు చేసే అభ్యర్థులు ఆంగ్ల బాషా పరిజ్ఞానం కలిగివుండాలి (ఇంగ్లీష్ రాయడం, చదవటం తెలిసి ఉండాలి)
  • వయోపరిమితి: ధరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థుల వయసు 21 నుండి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ వారీగా వయోపరిమితి సడలింపు ఉంటుంది
  • ప్రయత్నాల సంఖ్యా: జనరల్ కేటగిరి అభ్యర్థులు గరిష్టంగా నాలుగు సార్లు మాత్రమే పీఓ పరీక్ష రాసేందుకు అర్హులు. ఓబీసీ కేటగిరి అభ్యర్థులు గరిష్టంగా ఏడు సార్లు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వికలాంగు అభ్యర్థులకు యెటువంటి హాజరు పరిమితి లేదు.
కేటగిరి ధరఖాస్తు ఫీజు ( ఇంటిమేషన్ చార్జీ)
1 ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/ట్రాన్స్ జండర్ 125/- (కేవలం ఇంటిమేషన్ చార్జీ )
2 జనరల్ మరియు ఓబీసీ 750/- (ధరఖాస్తు రుసుము+ఇంటిమేషన్ చార్జీ)

ఎస్‌బీఐ పీఓ దరఖాస్తు ప్రక్రియ

అర్హుత ఉన్న అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ యందు పొందిపర్చిన విదంగా ఎస్‌బీఐ అడిగిన వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు పారంభించే ముందు అవసరమయ్యే వివరాల్ని అందుబాటులో పెట్టుకోండి. పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి.

పరీక్ష కేంద్ర ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి. అప్లోడ్ చేసే ధ్రువపత్రాలు బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేశాక అందుబాటులో ఉండే పేమెంట్ మార్గం ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి. దరఖాస్తు రుసుము చెల్లించని అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోబడవు.

ఎస్‌బీఐ పీఓ ఎగ్జామ్ సెంటర్లు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
ప్రిలిమినరీ పరీక్షా: అనంతపూర్, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ప్రిలిమినరీ పరీక్షా: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం 
మెయిన్ పరీక్షా: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం మెయిన్ పరీక్షా: హైదరాబాద్ 

ఎస్‌బీఐ పీఓ ఎగ్జామ్ నమూనా

ఎస్‌బీఐ పీఓ పరీక్ష ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పేరుతో రెండు దశలలో జరుగుతుంది. ప్రిలిమ్స్ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి మెయిన్స్ పరీక్షకు ఆహ్వానిస్తారు. మెయిన్స్ లో మెరిట్ సాధించిన అభ్యర్థులను తర్వాతి దశలో గ్రూపు డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ కి పిలుస్తారు.

ప్రిలిమ్స్ మినహాయించి మిగతా మూడు అంశాల్లో అభ్యర్థులు కనబర్చిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు. కేటగిరి వారిగా మెరిట్ సాధించిన వారి షార్ట్ లిస్ట్ తయారుచేసి, ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ద్వారా కాల్ లెటర్ అందజేస్తారు.

ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్

ప్రాథమిక స్థాయిలో అభ్యర్థులను వడపోసేందుకు ఎస్‌బీఐ పీఓ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులకు ఆన్లైన్ జరిగే ఈ ఆబ్జెక్ట్ టెస్టులో మూడు సెక్షన్లలో ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ మూడు సెక్షన్లలో జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అంశాలకు సంబంధించి వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి.

ఒక్కో సెక్షన్ కు 20 నిముషాలు చెప్పున, ఒక గంట వ్యవధిలో 100 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు ఒక మార్కు, తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 1/4 వంతు ఋణాత్మక మార్కు ఇవ్వబడతాయి. అభ్యర్థులు మూడు సెక్షన్లలో కనీస అర్హుత మార్కులు సాధించాల్సి ఉంటుంది. కేటగిరి వారీగా ఉన్న ఖాళీలకు సుమారుగా 20 రేట్లు మెరిట్ అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు.

సెక్షన్ / సబ్జెక్ట్ ప్రశ్నలు (మార్కులు) సమయం
1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 (30 మార్కులు ) 20 నిముషాలు
2 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 (30 మార్కులు ) 20 నిముషాలు
3 రీజనింగ్ ఎబిలిటీ 35 (30 మార్కులు ) 20 నిముషాలు
4 మొత్తం 100 (100 మార్కులు ) 60 నిముషాలు

ఎస్‌బీఐ పీఓ మెయిన్స్

ప్రిలిమినరీ ఎగ్జామ్ యందు మెరిట్ సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష రెండు దశలో జరుగుతుంది. మొదటి దశలో 3 గంటల వ్యవధిలో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. నాలుగు సెక్షన్లుగా ఉండే ఈ పరీక్షలో ప్రతి సెక్షన్ నిర్దిష్ట సమయంలో కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది.

రెండవ దశలో 30 నిముషాల వ్యవధితో 50 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహించబడుతుంది. ఈ రెండు టెస్టులు పూర్తి ఆన్‌లైన్ పద్దతిలో నిర్వహించబడతాయి. తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 1/4 వంతు ఋణాత్మక మార్కు ఇవ్వబడుతుంది.

S.NO సెక్షన్ / సబ్జెక్ట్ ప్రశ్నలు (మార్కులు) సమయం
1 రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 45 (60 మార్కులు ) 60 నిముషాలు
2 డేటా అనాలిసిస్ & ఇంటర్ప్రెటీషన్ 35 (60 మార్కులు ) 45 నిముషాలు
3 జనరల్ అవెర్నెస్ (బ్యాంకింగ్/ఎకానమీ) 40 (40 మార్కులు ) 35 నిముషాలు
4 జనరల్ ఇంగ్లీష్ 35 (40 మార్కులు ) 40 నిముషాలు
5 మొత్తం 155 (200 మార్కులు ) 3 గంటలు

రెండవ దశలో 50 మార్కులకు ఇంగ్లీషు భాషకు సంబంధించి లెటర్ రైటింగ్, డిస్క్రిప్టివ్ ఎస్సై రాయాల్సి. లెటర్ రైటింగ్ మరియు ఇంగ్లీషు వ్యాసం 30 నిముషాల నిర్ణీత సమయంలో కంప్యూటర్ యందు టైపు చేయాల్సి ఉంటుంది.

గ్రూపు డిస్కషన్ & ఇంటర్వ్యూ

ఎస్‌బీఐ పీఓ మెయిన్స్ పరీక్ష యందు షార్ట్ లిస్ట్ చేయబడ్డ అభ్యర్థులకు చివరిగా గ్రూపు డిస్కషన్ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి, వివిధ రిజర్వేషన్ పోస్టుల ఖాళీల ఆధారంగా నియామక ప్రక్రియ పూర్తిచేస్తారు.

ఎగ్జామినేషన్ మార్కులు
1 గ్రూపు డిస్కషన్ 20
2 ఇంటర్వ్యూ 30
3 మొత్తం మార్కులు 50

 

ఎస్‌బీఐ పీఓ తుది ఎంపిక

ఎస్‌బీఐ పీఓ నియామకాల తుది ఎంపిక ప్రిలిమ్స్ పరీక్ష (ఫేజ్ ) మినహాయిస్తే, మెయిన్స్ (ఫేజ్ 2), గ్రూపు డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ (ఫేజ్ 3)లో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.

ఫేజ్ 2 జరిగే మెయిన్స్ గరిష్ట మార్కులను 75 కు, ఫేజ్ 3 జరిగే గ్రూపు డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ల గరిష్ట మార్కులను 25 మార్కులకు నార్మలైజషన్ చేసి తుది గరిష్ట మార్కులను వందకు సరిజేస్తారు. ఈ మార్కులకు సాధించిన అభ్యర్థుల మెరిట్ ఆధారంగా చేసుకుని కేటగిరి వారీగా తుది ఎంపిక చేపడతారు.

నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గరిష్ట మార్కులు నార్మలైజ్డ్ మార్కులు
1 మెయిన్స్ 250 75
2 గ్రూపు డిస్కషన్ & ఇంటర్వ్యూ 50 25
మొత్తం 300 100

ఎస్‌బీఐ పీఓ ఎగ్జామ్ ఇతర వివరాలు

ఎస్‌బీఐ పీఓ సిలబస్  ఎస్‌బీఐ పీఓ మాక్ టెస్ట్
ఎస్‌బీఐ పీఓ నోటిఫికేషన్ దరఖాస్తు చేయండి 

Post Comment