Advertisement
బేసిక్ పార్టనర్షిప్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ కోసం తెలుసుకోండి
Entrepreneur Guide

బేసిక్ పార్టనర్షిప్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ కోసం తెలుసుకోండి

పార్టనర్షిప్ ఫర్మ్ అనేది సాధారణ బిజినెస్ రిజిస్ట్రేషన్. ఇది సాధారణ వ్యాపార భాగస్వాములు మధ్య తలెత్తే ఆర్ధిక వివాదాల నుండి భాగస్వాములకు తమ వాటాలపై చట్టబద్దమైన హక్కు కల్పిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేయాల్సిన నిబంధన లేదు.

పార్టనర్షిప్ ఫర్మ్ భాగస్వాముల ఇష్టానుసారం బిజినెస్ ప్రారంభించే ముందు లేదా బిజినెస్ ప్రారంభించిన కొన్నాళ్ల తర్వాత కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసేందుకు కనిష్టంగా ఇద్దరు భాగస్వాములు ఉండాలి. గరిష్టంగా 15 మందికి అవకాశం ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ చిన్న స్టార్టప్‌లకు, రెగ్యులర్ వ్యాపారాలకు, వ్యక్తుల స్థాయిలో జరిపే వ్యాపారాలకు చక్కగా సరిపోతుంది.

పార్టనర్షిప్ ఫర్మ్ రాష్ట్రాల పరిధిలో MSME 2006 చట్టం ప్రకారం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసేముందు భాగస్వాములు అందరు చట్టబద్దమైన నోటరైజ్డ్ అగ్రిమెంట్ అఫిడివిట్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో వ్యాపారానికి సంబంధించిన వివరాలు, వ్యాపార స్వభావం, భాగస్వాముల పెట్టుబడి వాటాలు, భాగస్వాముల హక్కులు, విధులు, లాభాలు/నష్టాల పంపకాల సంబంధించి పూర్తి వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది.

పార్టనర్షిప్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ ప్రాధమిక నియమావళి

  • పార్టనర్షిప్ ఫర్మ్ రిజిస్టర్ చేసేందుకు కనీసం ఇద్దరు భాగస్వాములు ఉండాలి. గరిష్టంగా 15 మంది ఉండేందుకు అవకాశం.
  • పార్టనర్షిప్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఆయా రాష్ట్రాల పరిధిలో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది.
  • రిజిస్టర్ ఆఫీస్ కలిగి ఉండాలి. కంపెనీ ఆఫీస్ కమర్షియల్ భవనం కానవసరంలేదు. మీరు ఉండే ఇంటిని లేదా అనుమతి ధ్రువపత్రాలతో మీరుండే రెంటల్ హౌస్ కూడా ఆఫీసుగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
  • పార్టనర్షిప్ ఫర్మ్ అగ్రిమెంట్ తప్పనిసరి
  • సర్టిఫైడ్ పార్టనర్షిప్ డీడ్
  • పార్టనర్షిప్ ఫర్మ్ నేమ్ రిజిస్ట్రేషన్
  • కంపెనీ PAN & TAN నంబర్లు తప్పనిసరి.

పైన చెప్పిన అన్ని రకాల డాక్యూమెంట్స్ తో రాష్ట్ర పరిదిలో ఉండే కంపెనీ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ విధానములో పార్టనర్షిప్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ (ఫారం 1) నింపి సంబంధించిన దరఖాస్తు రుసుములు  చెల్లించడం ద్వారా పార్టనర్షిప్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ పూర్తిచేయొచ్చు. మీరు పొందుపర్చిన డాక్యూమెంట్లు అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉంటె రిజిస్ట్రేషన్ చేసిన రోజునుండి 30 రోజుల్లోపు పార్టనర్షిప్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ అందజేస్తారు.

Post Comment