తెలంగాణ కార్పొరేట్ కళాశాల ఉచిత ఇంటర్ అడ్మిషన్లు 2023
Scholarships

తెలంగాణ కార్పొరేట్ కళాశాల ఉచిత ఇంటర్ అడ్మిషన్లు 2023

తెలంగాణ కార్పొరేట్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని, 10వ తరగతిలో అత్యధిక మెరిట్ సాధించిన ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, కాపు మరియు వికలాంగు విద్యార్థులకు టాప్ కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో ఉచిత ఇంటర్మీడియట్ అడ్మిషన్ కపిస్తుంది. ఈ పథకం పరిధిలో ఎంపికైన విద్యార్థులకు కార్పొరేట్ జూనియర్ కాలేజీలో పూర్తి ఉచితంగా రెండేళ్ల రెసిడెన్సియల్ ఇంటర్మీడియట్ విద్యను అందిస్తారు.

Advertisement
స్కాలర్షిప్ తెలంగాణ కార్పొరేట్ జూనియర్ కాలేజీ అడ్మిషన్స్ పథకం
స్కాలర్షిప్ టైప్ కార్పొరేట్ అడ్మిషన్స్
ఎవరికి అందిస్తారు ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, కాపు మరియు వికలాంగు విద్యార్థులు
అర్హుత ప్రభుత్వ పాఠశాలల్లో 10 ఉత్తీర్ణత

ఎవరు అర్హులు

పదివ తరగతిలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణతయిన ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, కాపు మరియు వికలాంగు విద్యార్థులు ఈ పథకం పరిధిలోకి వస్తారు. సదురు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లో పదివ తరగతి చదువుకుని ఉండాలి. 10వ తరగతి సప్లమెంటరీలో ఉత్తీర్ణత అయిన వారు ఈ పథకాన్ని అర్హులు కారు. అడ్మిషన్లు పదిలో సాధించిన మెరిట్ ఆధారంగా కల్పిస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి

అర్హుత ఉన్న విద్యార్థులు ఈపాస్ వెబ్సైటులో ఉండే కార్పొరేట్ కాలేజీ స్కీమ్ ట్యాబ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ తో లాగిన్ అయ్యి, దరఖాస్తులో అడిగిన వివరాలను తప్పులు దొర్లకుండా నమోదు చేసి, సంబంధిత ధ్రువపత్రాలతో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. విజయవంతంగా నమోదు అయినా తర్వాత విద్యార్థి మొబైల్ నంబరుకు ఓటీపీ అందుతుంది. సదురు నెంబర్ ఎంటర్ చేసిన ఆమోదం తెలపడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఎంపికైన విద్యార్థులకు అడ్మిషన్ వివరాలు మొబైల్ నెంబరుకు పంపిస్తారు.

Advertisement

Post Comment