వన్ పర్సన్ కంపెనీ రిజిస్ట్రేషన్ గైడెన్స్
Entrepreneur Guide

వన్ పర్సన్ కంపెనీ రిజిస్ట్రేషన్ గైడెన్స్

సవరించిన 2013 కంపెనీ చట్టం భారత వ్యాపార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. అందులో ముఖ్యమైనది వన్ పర్సన్ కంపెనీ రిజిస్ట్రేషన్. ఓనర్షిప్ షేరింగ్ లేకుండా, షేర్ హోల్డర్లు లేకుండా ఒంటి చేతితో కార్పొరేట్ స్టైల్ బిజినెస్ ఫార్మేట్ నిర్వహించలనుకునే వారికీ వన్ పర్సన్ కంపెనీ రిజిస్ట్రేషన్ గొప్ప ప్రత్యామ్నాయం.

Advertisement

ఈ బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసేందుకు కేవలం ఒక డైరెక్టర్ ఒక నామీని ఉంటె సరిపోతుంది. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఉండే అన్ని సౌలభ్యలు వన్ పర్సన్ కంపెనీ రిజిస్ట్రేషన్ లో మీరు పొందొచ్చు. లిమిటెడ్ బిజినెస్ ఐడియా స్టార్టప్‌ మరియు వ్యవస్థాపకులకు, వాటాదారుల తలనొప్పి వద్దునుకునే ఎంట్రప్రెన్యూర్లకు ఈ వన్ పర్సన్ కంపెనీ రిజిస్ట్రేషన్ చక్కగా సరిపోతుంది. ఇప్పు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వన్ పర్సన్ కంపెనీ స్థాపించేందుకు ప్రాధమిక నియమావళి

  • వన్ పర్సన్ కంపెనీ రిజిస్టర్ చేసేందుకు ఒక డైరెక్టరు మరియు ఒక నామీని ఉండాలి .
  • వన్ పర్సన్ కంపనీలో వాటాదారులుగా ఒక వ్యక్తిని మాత్రమే చేర్చుకునే అవకాశం ఉంటుంది.
  • వన్ పర్సన్ కంపెనీ రిజిస్టర్ చేసేందుకు భారతీయ పౌరులకు మాత్రమే అవకాశం ఉంటుంది.
  • రిజిస్టర్ కంపెనీ ఆఫీస్ కలిగి ఉండాలి. కంపెనీ ఆఫీస్ కమర్షియల్ భవనం కానవసరంలేదు. మీరు ఉండే ఇంటిని లేదా అనుమతి ధ్రువపత్రాలతో మీరుండే రెంటల్ హౌస్ కూడా ఆఫీసుగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఓపీసీ రిజిస్ట్రేషన్ చేసేందుకు అవసరమయ్యే డాక్యూమెంట్స్

  • వ్యక్తిగత గుర్తింపు కోసం : వ్యక్తిగత గుర్తింపు కోసం భారతీయ పౌరులు ఓటర్ కార్డు/ పాస్‌పోర్ట్ / డ్రైవింగ్ లైసెన్స్ /పాన్ కార్డు కలిగి ఉండాలి.
  • చిరునామా గుర్తింపు కోసం తాజాగా తీసుకున్న బ్యాంకు స్టేటుమెంట్, టెలిఫోన్ బిల్, గ్యాస్ బిల్, కరెంటు బిల్ ఉండాలి.
  • పాస్‌పోర్ట్-సైజ్డ్ ఫొటోగ్రాఫ్ మరియు మీసొంత దస్తూరితో సంతకం (డైరెక్టర్లకు మాత్రమే) అందించాలి.
  • రిజిస్టర్ ఆఫీస్: ఆఫీసుకు సంబంధించిన ఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ కలిగివుండాలి.
  • ఇంగ్లీషులో టైపుచేసిన నోటరైజ్డ్ రెంటల్ అగ్రిమెంట్ కలిగివుండాలి.
  • భవన యాజమాని నుండి నిరభ్యంతర పత్రం (NOC) పొందిఉండాలి.
  • సొంత భవనమైతే అమ్మకపు దస్తావేజు / ఆస్తి దస్తావేజు అందజేయాలి.

వన్ పర్సన్ కంపెనీ రిజిస్ట్రేషన్ విధానం

వన్ పర్సన్ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వంద శాతం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పోలి ఉంటుంది. ఇది 8 దశలలో పూర్తిచేయాల్సి ఉంటుంది.

ఏకరూప కంపెనీ పేరు కోసం దరఖాస్తు చేయాలి డైరెక్టర్ సిగ్నేచర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయాలి (DSC)
డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (DIN) eMOA మరియు eAOA డాక్యుమెంటేషన్
కంపెనీ PAN మరియు TAN నెంబర్ కోసం దరఖాస్తు చేయాలి ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ మరియు కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ జారీ
జిఎస్టీ రిజిస్ట్రేషన్, కంపెనీ ఆధార్, ఇంపోర్ట్ & ఎక్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ కంపెనీ బ్యాంకు అకౌంట్  కోసం దరఖాస్తు

యూనిక్ కంపెనీ పేరు ఎంపిక

కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అతి ముఖ్యమైన భాగం మీ వ్యాపారానికి మంచి పేరు ఎంపిక చేయడం. అది అక్షర సరూపంలో కానీ, పలకడంలో కానీ ఇంకో కంపెనీ పేరును పోలి ఉండకూడదు. అందుకారణంగా మీ బిజినెస్ కు పేరు పెట్టేముందు MCA (మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్) వెబ్సైటులో  సంబంధించిన బిజినెస్ పేరు మరియు ట్రేడ్ మార్క్ సంబంధిత వివరాలు ముందుగా శోధించి పూర్తి వివరాలు సేకరించండి.

అలానే నేమ్ రిజిస్ట్రేషన్ కోసం MCA కు దరఖాస్తు చేసేటప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా 3 నుండి 4 ఆప్షనల్ నేమ్స్ సిపార్సు చేయండి. ఒక బిజినెస్ నేమ్ పాపులర్ గా ఉండటం ఎంతుయా ముఖ్యమో అది రాబోయే కాలంలో చిక్కులు తేకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం.

ఈరోజుల్లో ప్రతి బిజినెస్ కు ఒక వెబ్సైటు ఉండటం తప్పనిసరి.  కంపెనీ పేరు ఖరారు చేసేముందు మీ పేరుకు సంబంధించిన డొమైన్ నేమ్ (.in/.com) అందుబాటులో ఉందేలేదో చెక్ చేసుకోండి.

DSC & DIN రిజిస్ట్రేషన్

ఇంటర్నెట్ అధికారిక దరఖాస్తులు పూర్తిచేసేందుకు డైరెక్టర్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (DSC) తప్పనిసరి. ఒక సారి DSC పొందేక దాని కాలపరిమితి ఒకటి లేదా రెండేళ్లు ఉంటుంది. తర్వాత దాన్ని క్రమానుగతంగా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.

DSC లేనిదే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (DIN) కు దరఖాస్తు చేయలేము. DIN లేనిదే కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగదు. ప్రతి కంపెనీ డైరెక్టర్ DIN కలిగి ఉండటం తప్పనిసరి. DIN కంపెనీ డైరెక్టర్ సంబంధించిన వ్యక్తిగత సమాచారం కలిగి ఉంటుంది.

ఇది ఫేక్ కంపెనీ రిజిస్ట్రేషన్లలు జరగకుండా ఉండేందుకు, ఫైనాన్సియల్ స్కామ్స్ జరిగేటప్పుడు ఆ డైరెక్టర్లు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా చేస్తుంది. DIN నెంబర్ కోసం సంబంధిత ధ్రువపత్రాలతో MCA వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

eMOA మరియు eAOA డాక్యుమెంటేషన్

eMOA (మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్) మరియు eAOA (ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ) డాక్యుమెంటేషన్ నిబంధన ప్రక్రియ 2013 కంపెనీ చట్టంలో MCA ప్రవేశ పెట్టింది. వీటికి సంబంధించిన ఫారం నెంబర్ IN 33 & IN 34 తప్పనిసరి పూర్తిచేయాల్సి ఉంటుంది.

ఈ నిబంధన ప్రకారం కంపెనీ స్థాపించేందుకు గల కారణంతో పాటుగా, పెట్టుబడుల గురించి, డైరెక్టర్లు, షేర్ హోల్డర్ల గురించి పూర్తి వివరాలు తెలియజేయాల్సి. ఈ వివరాలన్నీ నిబంధలు అనుచరించి ఆఫేడివిట్ రూపంలో అందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తిచేసాక కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

కంపెనీ పాన్ & టాన్ కోసం దరఖాస్తు

ఇండియాలో బిజినెస్ చేసే ప్రతి వ్యాపార సంస్థ పాన్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్) మరియు టాన్ (టాక్స్ డెడిక్షన్ నెంబర్) నంబర్లు తప్పనిసరి కలిగి ఉండాలి.  ఆదాయ పన్ను చెల్లింపులు వాటికీ సంబందించిన రిటర్న్ లావాదేవీలు నిర్వహించేందుకు ఈ నంబర్లు అవసరం. పాన్, టాన్ నంబర్లకు దరఖాస్తు చేసే ముందు కంపెనీ పేరు తప్పనిసరి రిజిస్టర్ అయ్యి ఉండాలి. పాన్ మరియు టాన్ నంబర్లకు ఆదాయ పన్ను వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ & కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ జారీ

కంపెనీ రిజిస్ట్రేషన్ లో ఇది చివరి ప్రక్రియ. రిజిస్ట్రేషన్ కోసం అందించిన అన్ని వివరాలు సరైనవని MCA ధ్రువీకరించక ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ మరియు కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ జారీ చేస్తుంది. దీనికి 15 నుండి 20 రోజులు సమయం పడుతుంది.  ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ జారీతో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తివుతుంది. ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ జారీ ద్వారా మీ కంపెనీకి అధికారకంగా వ్యాపారం చేసేందుకు అనుమతి లభించినట్లు అర్ధం.

కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యాక కరెంట్ బ్యాంకు అకౌంట్, జిఎస్టీ నెంబర్, కంపెనీ ఆధార్ మరియు ఇంపోర్ట్ & ఎక్స్పోర్ట్ సర్టిఫికెట్లు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనితో మీ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సంపూర్ణంగా పూర్తిఅయినట్లు భావించవచ్చు.

ఈ ప్రక్రియ మొత్తం మీరు సొంతంగా చేసుకునేందుకు అన్నిరకాల రుసుములు కలుపుకుంటే 5000 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదే కన్సల్టెన్సీ సంస్థలను ఆశ్రయిస్తే వారు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు పది వేల నుండి 15 వేలు తీసుకుని ఈ మొత్తం ప్రక్రియ పూర్తిచేసి పెడతారు.

వన్ పర్సన్ కంపెనీ రిజిస్ట్రేషన్ వలన ప్రయోజనాలు

ప్రయోజనాల పరంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సమకూరే అన్ని సౌలభ్యలు వన్ పర్సన్ కంపెనీకు లభిస్తాయి. వ్యాపారం ఒక్కరే నిర్వహించేటప్పటికీ దానికి కార్పొరేట్ హోదా ఉంటుంది. ఇది కస్టమర్లను ఆకర్షించేందుకు, బ్యాంకులు నుండి సులభంగా లోన్లు పొందేందుకు సహాయపడుతుంది. బిజినెస్ నడిపేందుకు అవసరమయ్యే నాణ్యమైన మానవ వనరులను ఆకర్షిస్తుంది. దీనితో నైపుణ్యం ఉండే టీంతో పనిచేసే అవకాశం లభిస్తుంది.

వన్ పర్సన్ కంపెనీ ప్రారంభించేందుకు ఒక డైరెక్టర్ ఒక షేర్ హోల్డర్ ఉంటె సరిపోతుంది. ఆ ఇద్దరు ఒకే వ్యక్తి అయినా అవ్వొచ్చు. కంపెనీలో ఒకే డైరెక్టర్ ఉండటం వలన కంపెనీ నిర్వహణపై పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంటుంది . కంపెనీ నష్టాల్లో కూరుకుపోయిన వ్యక్తిగత ఆస్తులకు వచ్చే ముప్పు ఉండదు.

వన్ పర్సన్ కంపెనీకి ప్రభుత్వం అనేక పన్ను ప్రయోజనలను చేకూర్చిపెడుతుంది. కంపెనీ నమోదు చేసే లాభాలపై టాక్స్ చెల్లిస్తే చాలు. వ్యక్తుల రాబడిపై పన్ను మినహాయింపు ఉంటుంది. వన్ పర్సన్ కంపెనీ సోలో ప్రోపరైటెర్షిప్ రకం బిజినెస్ లకు చక్కగా సరిపోతుంది. చిన్న స్థాయి ఈకామెర్స్, బ్లాగర్స్ మరియు ఇతర టెక్ ఎంట్రీప్రెన్యూర్స్ ఈ రకం రిజిస్టేషన్ చేసుకోవడం ద్వారా కార్పొరేట్ స్థాయి ప్రయోజనాలు సేకురుతాయి.

వన్ పర్సన్ కంపెనీ ప్రతికూలతలు

వన్ పర్సన్ కంపెనీ రిజిస్ట్రేషన్ వలన వ్యాపార నిర్వహణ పరంగా స్వేచ్ఛ ఉండేటప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. కంపెనీ రిజిస్టర్ చేసేందుకు 15 నుండి 20 రోజులు పడుతుంది. ప్రైవేట్ లిమిటెడ్ వాలే OPC దరఖాస్తు రుసుములు కూడా కాసింత అధికంగా ఉంటాయి. ఒకరికి మించి పెట్టుబడి దారులను చేర్చుకునే అవకాశం ఉండదు. విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉండదు. ఒక డైరెక్టర్ ఉండటం వలన అభివృద్ధి, విస్తరణ, భవిష్యత్ వ్యూహాలు రూపొందించేందుకు రెండవ అభిప్రాయం ఉండదు.

కంపెనీ ఆర్జించే ఆర్జించే లాభాలకు 30% టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. MCA నిబంధనలు ఏడాదికోసారి కంపెనీ అకౌంట్స్ ఆడిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది రిటర్న్స్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ పేరు వెనక OPC ట్యాగ్ తప్పనిసరి ఉంచాల్సి ఉంటుంది. ఇది కంపెనీ హోదాను కొంచెం తగ్గించి చూపిస్తుంది. అధిక టర్నవోర్ నమోదు చేసే కంపెనీలకు వన్ పర్సన్ కంపెనీ మంచి ఎంపిక కాదు.

Advertisement

Post Comment