ఫెలోస్ ఆఫ్ నేషనల్ బోర్డు (ఎఫ్ఎన్‌బీ) కోర్సులలో అడ్మిషన్ కల్పించేందుకు ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎఫ్‌ఈటీ) నిర్వహించబడుతుంది. ఈ టెస్టు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎన్‌బీఈ దేశ వ్యాప్తంగా దాదాపు 700 పైగా హాస్పిటళ్లలో 80 పైగా మెడికల్ విభాగాల్లో ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ అందిస్తుంది. ఈ 700 హోస్పిటళ్లలో ఎన్‌బీఈ గుర్తింపు కలిగిన 9500 పైగా డీఎన్‌బీ & ఎఫ్ఎన్‌బీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
Exam Name | NBE FET 2023 |
Exam Type | Entrance Exam |
Admission For | FNB Courses |
Exam Date | 10 Feb 2023 |
Exam Duration | 1.45 Hours |
Exam Level | National Level |
ఎఫ్ఎన్‌బీ కోర్సులలో అడ్మిషన్ పొందేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు డీఎన్‌బీ/ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్/డీఎం కోర్సులలో ఏదోకటి పూర్తిచేసి ఉండాలి. ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్టులో అభ్యర్థులు చూపిన మెరిట్ ఆధారంగా ఎఫ్ఎన్‌బీ కోర్సుల కోసం ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ ప్రోగ్రాం అందిస్తారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వివిధ సందర్భాలలో అభ్యర్థులు చూపే ప్రతిభను నమోదుచేస్తారు. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు ఏటా జరిగే నేషనల్ బోర్డు ఎగ్జామినేషన్ కాన్వాకేషన్ లో ఎఫ్ఎన్‌బీ ఫెలోషిప్ అవార్డు అందజేస్తారు.
ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ నిడివి రెండేళ్లు ఉంటుంది. కోర్సు ఫీజు ఏడాదికి 1,25,000/- రూపాయలు. ఎంపికైన అభ్యర్థులకు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ స్టైపెండ్ అందిస్తుంది. మొదటి ఏడాది 41,000 రూపాయలు, రెండవ ఏడాది 43,000 రూపాయలు అందజేస్తుంది.
భారతీయ విద్యార్థుల కోసం ఎఫ్ఎన్‌బీ ప్రోగ్రామ్స్
|
|
విదేశీ విద్యార్థుల కోసం ఎఫ్ఎన్‌బీ ప్రోగ్రామ్స్
|
|
ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 ముఖ్యమైన తేదీలు
ఎఫ్‌ఈటీ రిజిస్ట్రేషన్ ప్రారంభం | 6 జనవరి 2023 |
ఎఫ్‌ఈటీ దరఖాస్తు గడువు | 27 జనవరి 2023 |
ఎఫ్‌ఈటీ ఎగ్జామ్ తేదీ | 10 ఫిబ్రవరి 2023 |
ఎఫ్‌ఈటీ ఫలితాలు | 28 ఫిబ్రవరి 2023 |
ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్ ఎలిజిబిలిటీ
- దరఖాస్తు చేసే అభ్యర్థులు డీఎన్‌బీ/ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్/డీఎం కోర్సులలో గుర్తింపు కలిగిన పోస్టుగ్రాడ్యుయేషన్ మెడికల్ డిగ్రీ కలిగి ఉండాలి.
- పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ మెడికల్ కౌన్సిళ్లలో రిజిస్టర్ చేసుకుని దానికి తగిన గుర్తింపు కార్డు కలిగివుండాలి.
- పరీక్షకు హాజరయ్యేందుకు ఎటువంటి గరిష్ట వయో పరిమితి లేదు.
ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్
ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్టుకు హాజరయ్యే అభ్యర్థులు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ (www.nbe.edu.in) వెబ్సైటు ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. బోర్డు నియమాలను అనుసరించి అభ్యర్థుల విద్య మరియు వ్యక్తిగత వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి.
వీటికి సంబంధించిన డూప్లికేట్ ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటుగా అందజేయాలి. అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఆమోదం పొందిన అభ్యర్థులకు పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు.
ఎఫ్‌ఈటీ ఎగ్జామ్ ఫీజు & ఎగ్జామ్ సెంటర్లు
దరఖాస్తు ఫీజు (ఇండియన్ స్టూడెంట్స్) | Rs 4250 + 18% GST |
---|---|
దరఖాస్తు ఫీజు (విదేశీ స్టూడెంట్స్) | Rs 37500 + 18% GST |
ఎగ్జామ్ సెంటర్లు | విశాఖపట్నం, హైదరాబాద్ |
ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ ఫార్మేట్
ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్ సీబీటీ విధానంలో జరుగుతుంది. పరీక్ష వ్యవధి గంట 45 నిముషాలు ఉంటుంది. పరీక్ష పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు 2 భాగాలుగా ఉంటాయి. పార్ట్ A లో 40 ప్రశ్నలు 45 నిముషాలలో పూర్తిచేయాల్సి ఉంటుంది.
పార్ట్ B లో 60 ప్రశ్నలు 60 నిముషాలలో పూర్తిచేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 4 మార్కులు ఇవ్వబడతాయి. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1 మార్కు తొలగించబడుతుంది. సమాధానం చేయని ప్రశ్నలకు ఎటువంటి మార్కులు కేటాయించబడవు. ఒకదానికి మించి సమాధానాలు గుర్తించిన ప్రశ్నలను లెక్కించారు.
సబ్జెక్టు / సిలబస్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
---|---|---|---|
పార్ట్ - A (సూపర్ స్పెషాలిటీ సబ్జెక్టు) | 40 | 160 | 45 నిముషాలు |
పార్ట్ - B (ఫెలోషిప్ కోర్సు సంబంధించి) | 60 | 240 | 60 నిముషాలు |
మొత్తం | 100 | 400 | 105 నిముషాలు |