ఇండియన్ రిచెస్ట్ రియల్ ఎస్టేట్ ఎంట్రెప్రెన్యూరుగా రాజీవ్ సింగ్
డీఎల్ఎఫ్ చైర్ రాజీవ్ సింగ్ భారతదేశంలో అత్యంత సంపన్నమైన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా నిలిచారు. గ్రోహె - హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్ 2021 ప్రకారం, రాజీవ్ సింగ్ 61,220 కోట్ల సంపదను కలిగి ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో 68 శాతం సంపద గత ఏడాది కాలంలో సంపాదించినట్లు నివేదించింది. ఈ జాబితాలో మాక్రోటెక్ వ్యవస్థాపకుడు మంగళ్ ప్రభాత్ లోధా రెండవ స్థానంలో ఉన్నాడు.
ఢిల్లీ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వికాస్ కుమార్
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా వికాస్ కుమార్ నియమితులయ్యారు. 2012 నుండి DMRC మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న మంగు సింగ్ పదవీకాలం ముగియడంతో, ఆయన స్థానంలో 01 ఏప్రిల్ 2022 నుండి వికాస్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (DMRC) అనేది ఢిల్లీ మెట్రోను నిర్వహించే కేంద్ర-రాష్ట్ర జాయింట్ వెంచర్. దీనిలో భారత ప్రభుత్వంకు 50% వాటా ఉండగా, మిగిలిన 50 శాతం వాటాను ఢిల్లీ ప్రభుత్వం కలిగిఉంది.
విల్ స్మిత్‌పై పదేళ్ల పాటు ఆస్కార్ నిషేధం
94వ అకాడమీ అవార్డుల సందర్భంగా వేదికపై అమెరికన్ హాస్యనటుడు క్రిస్ రాక్‌ని చెంపదెబ్బ కొట్టినందుకు ప్రముఖ నటుడు విల్ స్మిత్‌పై 10 సంవత్సరాల పాటు ఆస్కార్ గాలా మరియు ఇతర అకాడమీ ఈవెంట్‌ల నుండి నిషేధం విధించబడింది. స్మిత్ ఏప్రిల్ 1న అకాడమీకి రాజీనామా చేశాడు. అదే సమయంలో క్రిస్ రాక్, ఆస్కార్ నిర్మాతలు, నామినీలు మరియు వీక్షకులకు క్షమాపణలు చెబుతూ ప్రకటనలు జారీ చేశాడు.
యూఎన్ క్లైమేట్ చేంజ్ ఎక్సపెర్ట్'గా ఇయాన్ ఫ్రై
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) మానవ హక్కులు మరియు వాతావరణ మార్పుల కోసం, మొదటిసారి క్లైమేట్ చేంజ్ ఎక్సపెర్ట్'ను నియమించింది. టువాలువాన్ మరియు ఆస్ట్రేలియా యొక్క ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్న ఇయాన్ ఫ్రై, వచ్చే మూడేళ్ళ కాలానికి ఈ పదవిలో ఉండనున్నారు. ఈ హోదాను గత ఆక్టోబరులో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సృష్టించింది.
లాయిడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సౌరవ్ గంగూలీ
హావెల్స్ ఇండియా యొక్క కంజ్యూమర్ డ్యూరబుల్ బ్రాండ్‌లో ఒకటైన లాయిడ్ ఉత్పత్తులకు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నుకోబడ్డారు. లాయిడ్ యొక్క ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు మరియు ఎల్ఈడీ టీవీలు ఉన్నాయి. ఉత్తర భారత్ మార్కెట్'ను క్యాష్ చేసుకునేందుకు ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తుంది. సౌరవ్ గంగూలీ ప్రస్తుతం భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడుగా ఉన్నారు.
ఈవై ఎంటర్‌ప్రెన్యూర్ అఫ్ ది ఇయర్ విజేతగా ఫల్గుణి నాయర్
ఆన్‌లైన్ రిటైల్ సంస్థ నైకా వ్యవస్థాపకరాలు ఫల్గుణి నాయర్ 2021 సంవత్సరానికి ఈవై ఎంటర్‌ప్రెన్యూర్ అఫ్ ది ఇయరుగా ఎంపికయ్యారు. దీనికి సంబంధించి ఈ ఏడాది జూన్‌లో జరిగే EY వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వేడుకలో ఈమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా తన వృత్తి జీవితంలో ఎక్కువ భాగాన్ని గడిపిన నాయర్, 2012లో బ్యూటీ ఉత్పత్తులను విక్రయించడానికి నైకా బ్రాండ్ పేరుతో ఈకామర్స్ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఫ్యాషన్ మరియు జీవనశైలి విభాగంలో ఈ సంస్థ ప్రస్తుతం 2,600 అంతర్జాతీయ బ్రాండ్‌ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. అలానే దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ ఆఫ్‌లైన్ స్టోర్‌లను కలిగి ఉంది.
ఎల్ & టీ చైర్మన్ ఏఎమ్ నాయక్‌కు ఈవై లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
లార్సెన్ & టూబ్రో చైర్మన్ ఏఎమ్ నాయక్‌ను ఈవై లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. అతను 1965లో ఎల్ & టీ కంపెనీలో చేరారు. 2003లో సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఇంజనీరింగ్ సేవల సంస్థను నిర్మాణం, ఇంధనం, ఫైనాన్స్ మరియు ఐటీలలో విస్తరించి, భారతదేశపు అగ్రగామి సంస్థల్లో ఒకటిగా మార్చడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.
జాతీయ మైనారిటీల కమిషన్ చైర్‌పర్సన్‌గా ఎస్ ఇక్బాల్ సింగ్
జాతీయ మైనారిటీల కమిషన్ (ఎన్‌సిఎం) చైర్‌పర్సన్‌గా మాజీ ఐపిఎస్ అధికారి ఎస్ ఇక్బాల్ సింగ్ లాల్‌పురా మరోమారు నియమితులయ్యారు. ఇదివరకు ఎన్‌సిఎం చైర్‌పర్సన్‌గా పనిచేసిన కాలంలో, మైనారిటీల ఫిర్యాదులను త్వరిగతంగా పరిష్కరించడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను వారికీ అందేలా దృష్టి సారించినందుకు గాను ఆయనకు ఈ అవకాశం మరోసారి దక్కింది.
ఐపీజీఎ కొత్త ఛైర్మన్‌గా బిమల్ కొఠారీ
ఇండియన్ పల్సెస్ & గ్రెయిన్స్ అసోసియేషన్ (ఐపీజీఎ) యొక్క మూడవ ఛైర్మన్‌గా బిమల్ కొఠారీ బాధ్యతలు స్వీకరించారు.ఆయన 2011 నుండి ఐపీజీఎ వైస్-ఛైర్మెన్‌గా ఉన్నారు. 2018 నుండి ఇండియా పప్పులు మరియు ధాన్యాల సంఘానికి ఛైర్మన్‌గా ఉన్న జితు భేడా నుండి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇండియా పప్పులు మరియు ధాన్యాల సంఘం (ఐపీజీఎ) అనేది భారతదేశం యొక్క పప్పులు మరియు ధాన్యాల పరిశ్రమ మరియు వాణిజ్యం యొక్క అపెక్స్ బాడీ. ఇది భారతదేశం యొక్క ఆహారం & పోషకాహార భద్రతను మెరుగుపరచడం కోసం కృషి చేస్తుంది.
యూపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా డాక్టర్ మనోజ్ సోనీ
గుజరాత్‌కు చెందిన విద్యావేత్త డాక్టర్ మనోజ్ సోనీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) యొక్క నూతన ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం పదవీకాలం ముగిసిన ప్రదీప్ కుమార్ జోషి స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.
కొత్త గ్లోబల్ పీస్ అంబాసిడర్‌గా బబితా సింగ్
ఆఫ్రికా కన్సార్టియం (AAC) సహకారంతో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ కాన్క్లేవ్ 2022లో ఎడ్యుకాసీరియల్ వ్యవస్థాపకులు బబితా సింగ్‌కు గ్లోబల్ పీస్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. వివిధ రూపాల్లో క్రీడలు, కళలు, సంస్కృతి & దౌత్యం ద్వారా శాంతిని ప్రోత్సహించినందుకు గాను ఆమెకు ఈ అవకాశం లభించింది.
ప్రపంచ అత్యంత వృద్ధురాలు కేన్ తనకా మృతి
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా గుర్తింపు పొందిన జపాన్‌కు చెందిన కేన్ తనకా 119 ఏళ్ల వయసులో మరణించిరు. తనకా జనవరి 2, 1903న జన్మించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, తనకా జనవరి 30, 2019న 116 సంవత్సరాల 28 రోజుల వయసులో ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలుగా నిలిచారు.