Advertisement
ఏపీ మోడల్ స్కూల్ అడ్మిషన్లు 2023 : క్లాస్ VI & ఇంటర్మీడియట్
Andhra Pradesh

ఏపీ మోడల్ స్కూల్ అడ్మిషన్లు 2023 : క్లాస్ VI & ఇంటర్మీడియట్

ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్ల యందు 2023-24 విద్యా ఏడాదికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ మరియు సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. అర్హుత పొందిన విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో పూర్తి ఉచిత విద్యను అందిస్తారు. అడ్మిషన్ ప్రక్రియ టెన్త్ క్లాస్ మెరిట్ ఆధారితంగా ఉంటుంది.

  • దరఖాస్తు ప్రారంభం : 22 మే 2023
  • దరఖాస్తు ఆఖరు తేదీ : 07 జూన్ 2023
  • దరఖాస్తు రుసుము : 200/-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనకబడిన మండలాల్లో  2013-14 విద్యా సంవత్సరం నుండి ఏపీ మోడల్ స్కూళ్లను ప్రారంభించింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 164 ఆదర్శ పాఠశాలలు నెలకొల్పింది. వీటి ద్వారా గ్రామీణ వెనకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలకు క్లాస్ VI నుండి ఇంటర్మీడియట్ వరకు పూర్తిస్థాయి క్వాలిటీతో కూడిన ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తుంది.

ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలు ఏటా ఏప్రిల్ మరియు జూన్ నెలలో నిర్వహిస్తారు. అడ్మిషన్లు ప్రవేశ పరీక్ష ఆధారంగా చేపడతారు. క్లాస్ V వరకు తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలకు ఒక నెల బ్రిడ్జ్ కోర్సు నిర్వహించి తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి ప్రవేశపెడతారు.

ఏపీ మోడల్ స్కూళ్లలో ప్రతి తరగతిలో 80 సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రవేశాలు కేవలం క్లాస్ VI మరియు ఇంటర్ మొదటి ఏడాదికి సంబంధించి మాత్రమే నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్ష తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న మోడల్ స్కూళ్లలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. తుది ఎంపిక ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ మరియు రిజర్వేషన్ కోటాల ఆధారంగా ఉంటుంది.

ఏపీ మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష (క్లాస్ VI)

ఏపీ మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్షా ఆబ్జెక్టివ్ విధానములో పెన్ మరియు పేపర్ ఆధారిత ఆఫ్‌లైన్ పద్దతిలో నిర్వహిస్తారు. పరీక్షా 2 గంటల నిడివితో 100 మార్కులకు జరుపుతారు. ప్రశ్నపత్రం క్లాస్ V స్థాయి సిలబస్ తో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ & సోషల్ సంబంధిత అంశాలతో నిర్వహిస్తారు.

ప్రతి ప్రశ్న 4 ఆప్షనల్ సమాదానాలు కలిగి ఉంటుంది. వాటిలో నుండి సరైన సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు లేవు.

ఇంటర్మీడియట్ ప్రవేశాలు పదివ తరగతి మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు.

సబ్జెక్టు ప్రశ్నలు (100) మార్కులు (100) సమయం
తెలుగు
ఇంగ్లీష్
మ్యాథమెటిక్స్
జనరల్ సైన్స్ & సోషల్
25 ప్రశ్నలు
25 ప్రశ్నలు
25 ప్రశ్నలు
25 ప్రశ్నలు
25 మార్కులు
25 మార్కులు
25 మార్కులు
25 మార్కులు
2 గంటలు

ఏపీ మోడల్ స్కూల్ క్లాస్ VI అడ్మిషన్ ఎలిజిబిలిటీ

  • విద్యార్థుల వయస్సు 10 నుండి 12 ఏళ్ళ మధ్య ఉండాలి. షెడ్యూల్ కులాల వారికీ రెండేళ్ల సడలింపు కల్పిస్తారు.
  • పూర్తి అటెండెన్స్ తో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాఠశాలల్లో క్లాస్ V చదువుకుని ఉండాలి.
  • ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 75 రూపాయల దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
  • ఓబీసీ మరియు జనరల్ కేటగిరి విద్యార్థుల దరఖాస్తు రుసుము 150/- రూపాయులుగా నిర్ణహించారు.

ఏపీ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ ఎలిజిబిలిటీ

  • విద్యార్థుల వయస్సు 14 నుండి 16 ఏళ్ళ మధ్య ఉండాలి. షెడ్యూల్ కులాల వారికీ రెండేళ్ల సడలింపు కల్పిస్తారు.
  • పూర్తి అటెండెన్స్ తో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాఠశాలల్లో టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
  • ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 150 రూపాయల దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
  • ఓబీసీ మరియు జనరల్ కేటగిరి విద్యార్థుల దరఖాస్తు రుసుము 200/- రూపాయులుగా నిర్ణహించారు.

ఏపీ మోడల్ స్కూల్ దరఖాస్తు విధానం

అర్హుత ఉండే విద్యార్థులు ఏపీ మోడల్ స్కూల్ వెబ్సైటు (https://apms.apcfss.in) నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వెబ్సైటు ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించి, దానికి సంబంధించిన జర్నల్ నెంబర్ పొందాల్సి ఉంటుంది. ఆ జర్నల్ నెంబర్ సహాయంతో తర్వాత దశ దరఖాస్తును పూర్తిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తులో అడిగిన విద్య, వ్యక్తిగత మరియు చిరునామా వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చి, వాటికీ సంబంధించిన ధ్రువపత్రాలు సూచించిన ఫార్మేట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు పూర్తిఅయ్యాక ఒక ప్రింట్ కాపీ తీసుకుని భద్రపర్చాల్సి ఉంటుంది. అన్ని సక్రమంగా ఉన్న దరఖాస్తుదారులకు పరీక్షా తేదికి 10 రోజుల ముందు వెబ్సైటులో హాల్ టిక్కెలు అందుబాటులో ఉంచుతారు.

వివిధ కేటగిర్ల వారి రిజర్వేషన్ల కోటా

రిజర్వేషన్ కేటగిరి రిజర్వేషన్ కోటా
ఎస్సీ కేటగిరి 15 శాతం
ఎస్టీ కేటగిరి 6 శాతం
ఓబీసీ కేటగిరి 29 శాతం
జనరల్ కేటగిరి 50 శాతం

Post Comment