Advertisement
AISSEE 2024 Notification : 6 & 9 తరగతుల్లో సైనిక్ స్కూల్ అడ్మిషన్లు
Admissions School Entrance Exams

AISSEE 2024 Notification : 6 & 9 తరగతుల్లో సైనిక్ స్కూల్ అడ్మిషన్లు

దేశ వ్యాప్తంగా ఉన్న 33 సైనిక్ స్కూళ్లల్లో క్లాస్ VI మరియు క్లాస్ IX లలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే జాతీయ స్థాయి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఎస్ఎస్ఈఈ) 2024 నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన విద్యార్థులు 16 డిసెంబర్ 2023 లోపు దరఖాస్తు చేసుకోండి.

సైనిక్ స్కూళ్లను ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సె ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్ సొసైటీ నిర్వహిస్తుంది. సైనిక్ స్కూల్ సొసైటీని 1961 లో పూర్తి స్వయంప్రతిపత్తి హోదా కలిగిన ఆర్గనైజషన్‌గా ఏర్పాటు చేసారు. సైనిక్ స్కూళ్ళు ప్రధానంగా నేషనల్ డిఫెన్సె అకాడమీ, ఇండియన్ నావెల్ అకాడెమీ మరియు ఇతర డిఫెన్సె ట్రైనింగ్ అకాడమీలకు అవసరమయ్యే సమర్ధవంతమైన యువతను అందించేందుకు పనిచేస్తున్నాయి.

ఈ స్కూళ్ళు డిఫెన్స్ రంగంలో చేరేందుకు ఆసక్తి కనబర్చే విద్యార్థులకు క్లాస్ VI నుండి XII వరకు పూర్తిస్థాయి పాఠశాల విద్యతో పాటుగా త్రివిధ దళాలకు కావాల్సిన ఫీజికల్ మరియు మెంటల్ ఎబిలిటీ తర్పీదును పాఠశాల స్థాయి నుండి అందిస్తాయి.

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 33 సైనిక్ స్కూల్స్ నడుస్తున్నాయి. ఈ సైనిక్ స్కూళ్ళు అన్ని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీఐఎస్‌సీఈ) అనుబంధిత అకాడమిక్ ప్రణాలికను అనుచరిస్తాయి. ఈ స్కూళ్లలో ప్రవేశాలు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఎస్ఎస్ఈఈ) పరీక్ష ద్వారా భర్తీచేస్తారు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది.

సైనిక పాఠశాలల్లో ప్రవేశం మరియు సీట్లు

సైనిక పాఠశాలల్లో ప్రవేశాలు పరీక్షలో పొందిన మెరిట్ మరియు రిజర్వేషన్ కోటా ఆధారంగా నిర్వహిస్తారు. విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రవేశ సమయంలో స్కూల్ పరిధుల్లోని స్థానిక విద్యార్థులకు 67 శాతం సీట్లు కేటాయిస్తారు, మిగిలిన 33 శాతం సీట్లను ఇతర రాష్ట్రా లు/కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో భర్తీ చేస్తారు.

ప్రతి సైనిక పాఠశాలలో ఆరోతరగతిలో 10 శాతం/గరిష్టంగా 10 సీట్లను బాలికలకు కేటాయిస్తారు. ఎన్ జీఓలు/ప్రైవేట్ పాఠశాలలు/రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 19 నూతన సైనిక పాఠశాలల్లో కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే ఆరోతరగతి అడ్మిషన్స్ నిర్వహిస్తారు. సైనిక పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ తదితరాల్లో చేరేందుకు సన్నద్ధం చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో సైనిక పాఠశాలలు-సీట్లు

  • కలికిరి సైనిక పాఠశాలలో ఆరోతరగతిలో బాలురకు 95 సీట్లు, బాలికలకు 10 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొమ్మిదోతరగతిలో బాలురకు 10 సీట్లు ఉన్నాయి.
  • కోరుకొండ సైనిక పాఠశాలలో ఆరో తరగతిలో బాలురకు 68 సీట్లు.,బాలికలకు 10 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొమ్మిదో తరగతిలో బాలురకు 18 సీట్లు, బాలికలకు 4 సీట్లు ఉన్నాయి.
  • ఎస్‌పిఎస్ఆర్ నెల్లూరులోని ఆదాని వరల్డ్ స్కూల్ నిర్వహి స్తున్న సైనిక పాఠశాలలో ఆరోతరగతిలో 80 సీట్లు ఉన్నాయి.

ఏఐఎస్ఎస్ఈఈ ఎలిజిబిలిటీ

  • క్లాస్ VI కోసం దరఖాస్తు చేసే విద్యార్థుల వయస్సు 10 నుండి 12 ఏళ్ళ మధ్య ఉండాలి,
  • క్లాస్ VI కోసం దరఖాస్తు చేసే అమ్మయిలు ఇదే వయోపరిమితిలో సీట్ల లభ్యతను అనుచరించి నేరుగా అడ్మిషన్ పొందొచ్చు
  • క్లాస్ IX కోసం దరఖాస్తు చేసే విద్యార్థుల వయస్సు 13 నుండి 15 ఏళ్ళ మధ్య ఉండాలి
  • క్లాస్ IX కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు కలిగిన పాఠశాల నుండి క్లాస్ VIII పూర్తిచేసి ఉండాలి
  • ఈ ప్రవేశ పరీక్షలో అర్హుత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులో 25% మార్కులు సాధించాలి. అలానే అన్ని సబ్జెక్టులలో కలుపుకుని 40 శాతం మార్కులు పొందిఉండాలి

ఏఐఎస్ఎస్ఈఈ 2024 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభం 07 నవంబర్ 2023
దరఖాస్తు తుది గడువు 16 డిసెంబర్ 2023
ఎగ్జామ్ తేదీ 21 జనవరి 2024
ఫలితాలు ఫిబ్రవరి 2024

ఏఐఎస్ఎస్ఈఈ 2024 ఎగ్జామ్ ఫీజు

    • జనరల్ కేటగిరి విద్యార్థులకు దరఖాస్తు ఫీజు : 650/-
    • ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజు : 500/-

ఏఐఎస్ఎస్ఈఈ రిజర్వేషన్ కోటా వారీగా సీట్లు కేటాయింపు

  • అందుబాటులో ఉండే సీట్లలో 67 శాతం సీట్లు సంబంధిత సైనిక్ స్కూల్ ఉన్న రాష్ట్ర విద్యార్థులచే భర్తీచేస్తారు. మిగతా 33 శాతం సీట్లు ఇతర రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు
  • అందుబాటులో ఉండే సీట్లలో 15 % ఎస్సీ విద్యార్థులకు కేటాయిస్తారు
  • అందుబాటులో ఉండే సీట్లలో 7.5 % ఎస్టీ విద్యార్థులకు కేటాయిస్తారు
  • అందుబాటులో ఉండే సీట్లలో 27 % ఓబీసీ విద్యార్థులకు కేటాయిస్తారు
  • 25 శాతం సీట్లు డిఫెన్సులో పనిచేసే వారి పిల్లలకు, ex సర్వీస్ మ్యాన్ పిల్లలకు కేటాయిస్తారు

ఏఐఎస్ఎస్ఈఈ 2024 దరఖాస్తు విధానం

సైనిక స్కూళ్లలో చేరేందుకు ఆసక్తి, అర్హుత ఉండే విద్యార్థులు అధికారిక వెబ్సైటు (www.exams.nta.ac.in/AISSEE) ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. మీ సొంత ఇమెయిల్ మరియు మొబైల్ నెంబర్ ఉపయోగించి సంబంధిత వెబ్సైటులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

ఆ తర్వాత దశలో దరఖాస్తులో అడిగిన విద్యార్థి వ్యక్తిగత, విద్య మరియు చిరునామా వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. అలానే ఏ క్లాస్ కోసం దరఖాస్తు చేస్తున్నారు, ఏ సైనిక్ స్కూల్ కోసం దరఖాస్తు చేస్తున్నారనే వివరాలు అందివ్వాల్సి ఉంటుంది.

ఒక విద్యార్థి కేవలం ఒకే స్కూల్ కోసం ఒకే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. చివరిగా దరఖాస్తు రుసుము చెల్లించి, సూచించిన ఫార్మేట్ లో సంబంధిత ధ్రువపత్రాలు అప్లోడ్ చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

కావాల్సిన డాక్యూమెంట్స్ :

  • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మరియు టీసీ
  • క్యాస్ట్/కమ్యూనిటీ  మరియు రెసిడెన్సీ సర్టిఫికెట్
  • సర్టిఫికెట్ ఆఫ్ సర్వీస్ (డెఫెన్సీ లో పనిచేసే వారి పిల్లలకు)
  • ఫోటో గ్రాఫ్, దరకాస్తుదారుని సంతకం మరియు విద్యార్థి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ జేపీజి ఫైల్ ఫార్మేట్ లో
  • ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు etc

ఏఐఎస్ఎస్ఈఈ 2024 ఎగ్జామ్ నమూనా

ఏఐఎస్ఎస్ఈఈ ప్రవేశ పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో పెన్ & పేపర్ (ఓఎంఆర్) ఆధారంగా నిర్వహించబడుతుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ పద్దతిలో నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షనల్ సమాదానాలు అందుబాటులో ఉంటాయి. అందులో నుండి ఒక సరైన సమాధానం గుర్తించాల్సి ఉంటుంది. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 2 లేదా 3 మార్కులు ఇవ్వబడతయి.

తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు లేవు. క్లాస్ VI సంబందించి పరీక్షా 2.30 గంటల నిడివితో 300 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు మీడియం లో అందుబాటులో ఉంటుంది. క్లాస్ IX విద్యార్థులకు 3 గంటల నిడివితో 400 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నలు మ్యాథమెటిక్స్, ఇంటిలిజెన్స్, ఇంగ్లీష్ మరియు జనరల్ అవెర్నెస్ అంశాల నుండి ఇవ్వబడతాయి. ఎగ్జామ్ ఇంగ్లీష్, హిందీ మరియు తెలుగు వంటి 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించబడుతుంది. ఎగ్జామ్ యందు అర్హుత పొందేందుకు కనీసం 40 శాతం మార్కులు సాదించాలి.

క్లాస్ VI ఎగ్జామ్ నమూనా

సెక్షన్ సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు సమయం
A
B
C
D
మ్యాథమెటిక్స్
జనరల్ ఇంటిలిజెన్స్
లాంగ్వేజ్ (తెలుగు)
జనరల్ నాలెడ్జ్
50 ప్రశ్నలు
25 ప్రశ్నలు
25 ప్రశ్నలు
25 ప్రశ్నలు
150 మార్కులు (3)
50 మార్కులు (2)
50 మార్కులు (2)
50 మార్కులు (2)
150 నిముషాలు
ఉదయం
10 నుండి 12.30 వరకు
125 ప్రశ్నలు 300 మార్కులు

క్లాస్ IX ఎగ్జామ్ నమూనా

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు సమయం
A
B
C
D
E
మ్యాథమెటిక్స్
జనరల్ ఇంటిలిజెన్స్
ఇంగ్లీష్
జనరల్ సైన్స్
సోషల్ స్టడీస్
50 ప్రశ్నలు
25 ప్రశ్నలు
25 ప్రశ్నలు
25 ప్రశ్నలు
25 ప్రశ్నలు
200 మార్కులు (4)
50 మార్కులు (2)
50 మార్కులు (2)
50 మార్కులు (2)
50 మార్కులు (2)
180 నిముషాలు
ఉదయం
10 నుండి 1 వరకు
150 ప్రశ్నలు 400 మార్కులు

ఇండియాలో సైనిక్ స్కూళ్ళ లిస్ట్

1. Andhra Pradesh - Sainik School, Korukonda 
2. Andhra Pradesh - Sainik School, Kalikiri 
3. Arunachal Pradesh - Sainik School, East Siang 
4. Assam Sainik School, Goalpara 
5. Bihar - Sainik School, Nalanda
6. Bihar - Sainik School - Gopalganj
7. Chattisgarh - Sainik School, Ambikapur 
8. Gujarat - Sainik School, Balachadi 
9. Haryana - Sainik School, Kunjpura 
10. Haryana - Sainik School, Rewari 
11. Himachal Pradesh - Sainik School, SujanpurTira
12. J & K - Sainik School, Nagrota
13. Jharkhand - Sainik School, Tilaiya 
14. Karnataka - Sainik School, Bijapur 
15. Karnataka - Sainik School, Kodagu
16. Kerala - Sainik School, Kazhakootam
17 Madhya Pradesh - Sainik School, Rewa
18. Maharashtra - Sainik School, Satara 
19. Maharashtra - Sainik School, Chandrapur 
20. Manipur - Sainik School, Imphal 
21. Mizoram - Sainik School, Chhingchhip
22. Nagaland - Sainik School, Punglwa
23.Odisha - Sainik School, Bhubaneswar
24. Odisha - Sainik School, Sambalpur 
25. Punjab - Sainik School, Kapurthala
26. Rajasthan - Sainik School, Chittorgarh
27. Rajasthan - Sainik School, Jhunjhunu 
28. Tamil Nadu - Sainik School,Amaravathinagar 
29. Uttar Pradesh - Sainik School, Mainpuri 
30. Uttar Pradesh - Sainik School, Jhansi
31. Uttar Pradesh - Sainik School, Amethi 
32. Uttarakhand - Sainik School, Ghorakhal 
33. West Bengal - Sainik School, Purulia

Post Comment