పరమాణు నిర్మాణం జీకే క్విజ్ 2 | కెమిస్ట్రీ ప్రాక్టీసు ప్రశ్నలు
Study Material Telugu Gk

పరమాణు నిర్మాణం జీకే క్విజ్ 2 | కెమిస్ట్రీ ప్రాక్టీసు ప్రశ్నలు

పరమాణు నిర్మాణం సంబంధించి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను సాధన చేయండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ ప్రశ్నలు ఉపయోగపడతాయి. పరమాణు నిర్మాణం అనేది న్యూక్లియస్ (కేంద్రం)తో కూడిన అణువు యొక్క నిర్మాణాన్ని సూచిస్తుంది, దీనిలో ధనాత్మకంగా చార్జ్ చేయబడిన ప్రోటాన్లు, తటస్థంగా ఉండే న్యూట్రాన్లు ఉంటాయి. పరమాణువు యొక్క బయటి ప్రాంతాలను ఎలక్ట్రాన్ షెల్స్ అని పిలుస్తారు. వీటిలో ఋణాత్మక ఎలక్ట్రాన్‌లు ఉంటాయి.

Advertisement

1. హైడ్రోజన్ వర్ణపటములో కర్పరము శక్తిని కోల్పోయి వర్ణపటరేఖలుగా ఉద్గారించుట ఏ ప్రాంతములో గుర్తించవచ్చును ?

  1. పరారుణ ప్రాంతము
  2. దృగ్గోచర ప్రాంతము
  3. అతినీలలోహిత ప్రాంతము
  4. అన్నియూ
సమాధానం
4 . అన్నియూ   

2. ఐదవ కర్పరములోని ఎలక్ట్రాన్ ఒకటవ కర్పరంలోనికి దూకుట వలన హైడ్రోజన్ వాయు వర్ణపటములో కనిపించు గీతల సంఖ్య   ?

  1. 5
  2. 10
  3. 20
  4. 1
సమాధానం
2 . 10

3. బోర్ సిద్ధాంత రీత్యా ఐదవ కర్పరములో ఎలక్ట్రాన్ భూస్థాయికి చేరుట వలన హైడ్రోజన్ వర్ణపటములో లైమన్ శ్రేణిలో కనిపించు గీతల సంఖ్య ?

  1. 5
  2. 10
  3. 4
  4. 6
సమాధానం
3. 4 

4. ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి సగానికి తగ్గించబడితే 'రిడ్ బర్గ్ ' స్థిరాంకము ఏమగును  ?

  1. మారదు
  2. సగమగును
  3. రెట్టింపు అగును
  4. పావు అగును
సమాధానం
2. సగమగును   

5. హైడ్రోజన్ పరమాణు వర్ణపటములో అతినీలలోహిత కాంతి విభాగములో కనిపించు గీతల శ్రేణి  ?

  1. బామర్ శ్రేణి
  2. ఫాషన్ శ్రేణి
  3. బ్రాకెట్ శ్రేణి
  4. లైమన్ శ్రేణి
సమాధానం
4. లైమన్ శ్రేణి   

6. క్రింది వానిలో ఏది సాధారణ హైడ్రోజన్ పరమాణువుకు ఇవ్వదు  ?

  1. శోషణ వర్ణపటము
  2. రేఖా వర్ణపటము
  3. పట్టీ వర్ణపటము
  4. పరమాణు వర్ణపటము
సమాధానం
3. పట్టీ వర్ణపటము 

7. రంగు గల వర్ణపట రేఖలు క్రిందివానిలో ఏ ఉద్గారానికి సంబందించినది ?

  1. n =5 నుంచి n =3 కు
  2. n = 4 నుంచి n = 3 కు
  3. n =2 నుంచి n =1 కు
  4. n =3 నుంచి n =1 కు
సమాధానం
2. n = 4 నుంచి n = 3 కు   

8. హైడ్రోజన్ పరమాణు వర్ణపటంలోని లైమన్ , బామర్ , ఫాషన్ మరియు బ్రాకెట్ శ్రేణులలో అధిక శక్తి కలిగి ఉండునది ?

  1. లైమన్
  2. బామర్
  3. ఫాషన్
  4. బ్రాకెట్
సమాధానం
1. లైమన్   

9. బోర్ సిద్ధాంతము ప్రకారం హైడ్రోజన్ పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ స్థితి శక్తి మరియు మొత్తం శక్తుల నిష్పత్తి  ?

  1. 1 : -1
  2. 1 : 1
  3. 1 : 2
  4. 2 : 1
సమాధానం
4.  2 : 1

10. K కర్పరము L నుండి కర్పరానికి హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ దుముకినపుడు ఏర్పడే వేగములో మార్పు ఏవిధముగా ఉంటుంది  ?

  1. నిజ వేగములో సగానికి ఉంటుంది
  2. నిజవేగానికి రెట్టింపు అగును
  3. నిజ వేగానికి నాలుగవ వంతు ఉంటుంది
  4. నిజవేగానికి సమానముగా ఉంటుంది
సమాధానం
1. నిజ వేగములో సగానికి ఉంటుంది   

11. డీబ్రోలి సిద్ధాంతమును అనుసరించి కక్ష్యయొక్క చుట్టుకొలత ఈ క్రింది వాటికి సమానము  ?

  1. ఎలక్ట్రాన్ యొక్క వ్యాసము
  2. ఎలక్ట్రాన్ యొక్క తరంగడైర్గ్యము
  3. ఎలక్ట్రాన్  తరంగడైర్గ్యము యొక్క పూర్ణ సంఖ్య
  4. ప్లాంక్స్ స్థిరాంకము యొక్క సగము విలువ
సమాధానం
3. ఎలక్ట్రాన్  తరంగడైర్గ్యము యొక్క పూర్ణ సంఖ్య 

12. ప్రక్కప్రక్కనే కల రెండు కర్పరాల శక్తి బేధము అతితక్కువుగా ఈ క్రింది వాటిలో ఉండును ?

  1. K , L కర్పరాలు
  2. L , M కర్పరాలు
  3. M  , N  కర్పరాలు
  4. N  , O  కర్పరాలు
సమాధానం
4. N , O కర్పరాలు   

13. M కక్ష్య నుండి K కక్ష్యలోనికి ఎలక్ట్రాన్ల  మార్పిడి జరిగిన వెలువడు శక్తి  ?

  1. కాస్మిక్ కిరణాలు
  2. పరారుణ కాంతి
  3. అతినీలలోహిత కాంతి
  4. X - కిరణాలూ
సమాధానం
3. అతినీలలోహిత కిరణాలు   

14. ఉత్తేజిత పరమాణువు , భూస్థితికి చేరునపుడు ఉద్గారమగునది  ?

  1. మిసాన్
  2. ఎలక్ట్రాన్  లు
  3. X - కిరణాలు
  4. ఫోటాన్లు
సమాధానం
4 . ఫోటాన్లు   

15. హైడ్రోజన్ పరమాణువు భూస్థితి నుండి ఉత్తేజిత స్థితికి చేరినపుడు ?

  1. గతిజశక్తి మరియు స్థితిజశక్తి  రెండూ తగ్గును
  2. స్థితిజశక్తి  పెరుగును గతిజశక్తి తగ్గును
  3. స్థితిజశక్తి  తగ్గును గతిజశక్తి పెరుగును
  4. గతిజశక్తి మరియు స్థితిజశక్తి  రెండూ పెరుగును
సమాధానం
2. స్థితిజశక్తి  పెరుగును గతిజశక్తి తగ్గును  

16. పరమాణువు నుండి ఎలక్ట్రాన్ ను ఉద్గారము చెందడానికి కావలిసిన కనీస శక్తిని ఏమని అందురు ?

  1. గతిశక్తి
  2. విద్యుత్ శక్తి
  3. రసాయన శక్తి
  4. పని ప్రమేయము
సమాధానం
4. పని ప్రమేయము 

17. కేంద్రకము నుంచి ఎలక్ట్రాన్ దూరముగా వెళ్ళేకొలది , దీని గతిశక్తి మరియు స్థితిజ శక్తులు వరుసగా  ?

  1. తగ్గును , తగ్గును
  2.  పెరుగును , పెరుగును
  3. పెరుగును ,  తగ్గును
  4. తగ్గును , పెరుగును
సమాధానం
4. తగ్గును , పెరుగును  

18. ఆర్బిటాల్ సంఖ్య (n) పెరిగే కొలది సమీపశక్తి స్థాయి యొక్క శక్తి ఏమగును  ?

  1. పెరుగును
  2.  తగ్గును
  3. స్థిరంగా ఉండును
  4. సగమగును
సమాధానం
2 .  తగ్గును   

19. పరమాణువులో ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యవేగము విలువ దేనిపై ఆధారపడి ఉంటుంది   ?

  1. m
  2.  l
  3. n
  4. పైవన్నియూ
సమాధానం
2. l   

20. కేంద్రకము చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ యొక్క మొత్తము శక్తి  ?

  1. సున్నా
  2. సున్నాకన్నా తక్కువ
  3. సున్నాకన్నా ఎక్కువ
  4. కొన్ని పరమాణువులలో సున్నాకన్నా తక్కువ మరియు కొన్ని పరమాణువుల కన్నా ఎక్కువ
సమాధానం
2. సున్నాకన్నా తక్కువ 

21. బోర్ పరమాణువు నిర్మాణాలను క్వంటీకరణము గావించే ఎలక్ట్రాన్ల ధర్మాలు  ?

  1. ద్రవ్యరాశి మరియు కోణీయ ద్రవ్య వేగము
  2.  శక్తి మరియు కోణీయ ద్రవ్య వేగము
  3. కోణీయ ద్రవ్యవేగము మరియు ద్రవ్యరాశి
  4. ద్రవ్యరాశి మరియు గుర్తులు
సమాధానం
2. శక్తి మరియు కోణీయ ద్రవ్య వేగము 

22. కేంద్రకము నుంచి పరమాణు ఎలక్ట్రాన్ అనంత దూరము ప్రయాణించగా దీని శక్తి ఏమగును ?

  1. అంతము
  2. శున్యము
  3. ఋణావేశము
  4. ధనావేశాము
సమాధానం
2. శున్యము   

23. ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగము క్వంటీకరణము చెంది వుందని ప్రతిపాదించినది ఎవరు ?

  1. ప్లాంక్
  2.  రూథర్ ఫర్డ్
  3. బోర్
  4. థామ్సన్
సమాధానం
3. బోర్   

24. పరమాణువుల  యొక్క బోర్ నమూనాను వివరించినది ?

  1. జీమన్ ప్రభావము
  2.  ఎలక్ట్రాన్ల ప్రభావము
  3. స్టార్క్ ప్రభావము
  4. ఏదికాదు
సమాధానం
4. ఏదికాదు 

25. ఒక పరమాణువు యొక్క బోర్ నమూనాను ఏది తెలియజేస్తుంది ?

  1. పౌలీవర్జన సూత్రము
  2. ప్లాంక్ క్వాట0మ్ నియమం
  3. హైజన్ బర్గ్ అణిచితత్వ సూత్రము
  4. పైవన్నియు
సమాధానం
3. హైజన్ బర్గ్ అణిచితత్వ సూత్రము  

26. బోర్ సిద్ధాంతము ప్రకారము ఎలక్ట్రాన్ తక్కువ శక్తి గల ఆర్బిటల్ నుండి ఎక్కువ శక్తి గల ఆర్బిటల్ లోనికి ప్రయాణించినపుడు , శక్తి ......?

  1. గ్రహించబడును
  2. ఉద్గారించబడును
  3. మారదు
  4. పైవన్నియు
సమాధానం
1. గ్రహించబడును 

27. ఆఫ్ బౌ నియమము ప్రకారము ఎలక్ట్రానులు ......శక్తి గల ఆర్బిటాల్  లోనికి ప్రవేశించును ?

  1. తక్కువ
  2. ఎక్కువ
  3. శక్తితో సంబంధం లేదు
  4. పైవన్నియు
సమాధానం
3. శక్తితో సంబంధము లేదు 

28. కనిష్ట m  విలువ కలిగిన ఆర్బిటాల్  ?

  1. గోళాకృతిలో ఉండును
  2. ముద్గుర ఆకృతిలో ఉండును
  3. ద్విముద్గుర ఆకృతిలో ఉండును
  4. పైవన్నియు
సమాధానం
3. ద్విముద్గుర ఆకృతిలో ఉండును  

29. ప్రధాన శక్తి స్థాయిలో ఆర్బిటాల్ నోడల్ తలాల సంఖ్య పెరిగిన కొలది ?

  1. శక్తి పెరుగుతూ ఉంటుంది
  2. శక్తి తగ్గుతుంది
  3. 1 లేదా 2
  4. రెండుకాదు
సమాధానం
1. శక్తి పెరుగుతూ ఉంటుంది  

30 . 5p ఆర్బిటాల్ లోని నోడల్ సంఖ్య ?

  1. 2
  2. 3
  3. 4
  4. 5
సమాధానం
2. 3 

Advertisement

Post Comment