Advertisement
మెరుగైన కెరీర్ కోసం 40 విభిన్న రకాల ఇంజనీరింగ్ కోర్సులు
Career Guidance Career Options

మెరుగైన కెరీర్ కోసం 40 విభిన్న రకాల ఇంజనీరింగ్ కోర్సులు

ఇంజనీరింగ్ బ్రాంచ్‌లు & స్పెషలైజేషన్‌ల ఎంపికలో తలమునకలైన ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ ఆర్టికల్ వంద శాతం మార్గనిర్దేశం చేస్తుంది. ఇంజనీరింగ్ విద్యకు ఉన్న క్రేజును బట్టి చూసుకుంటే, ఇంజనీరింగ్ అనేది ఇంటర్ ఎంపీసీ విద్యార్థులకు కాదనలేని కెరీర్ ఎంపిక.

ఇటువంటి సందర్భంలో ఏ ఇంజనీరింగ్ బ్రాంచును ఎంపిక చేసుకోవాలి అనేది సర్వసాధారణమైన ప్రశ్న అవుతుంది, దీనితో పాటుగా కాలేజీ ఎంపిక, ఇంజనీరింగ్ తర్వాత కెరీర్ అవకాశాలు, స్కాలర్షిప్లు, విద్యా రుణాలు వంటి అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోండి.

ఇంజనీరింగ్ కెరీర్ సమాచారం

ఇండియాలో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఫార్మేట్

ఇంజనీరింగ్ విద్యను ఇండియాలో నాలుగు ఏళ్ళ నిడివితో అందిస్తున్నారు. ఈ నాలుగేళ్లలో ఏడాదికి రెండు సెమిస్టర్ల చెప్పున, మొత్తం 8 సెమిస్టర్లకు విద్యార్థి హాజరుకావాల్సి ఉంటుంది. ఒక్కో సెమిస్టరు 15 నుండి 18 వారాల నిడివి ఉంటుంది. ఒక్కో సెమిస్టరులో కనిష్టంగా ఆరు సబ్జెక్టులను బోధిస్తారు. నాలుగేళ్లలో విద్యార్థి కనిష్టంగా 45 పేపర్ల యందు ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది.

ఇంజినీరింగు మొదటి ఏడాదిలో అన్ని బ్రాంచుల విద్యార్థులకు కామన్ సిలబస్ ఉంటుంది. రెండవ ఏడాది నుండి, అభ్యర్థి ఎంపిక చేసుకున్న బ్రాంచుకు సంబంధించిన సబ్జెక్టులను బోధిస్తారు. ఫైనల్ ఏడాదిలో ప్రాజెక్ట్ వర్కు ఉంటుంది. ఒక సెమిస్టరులో, ఒక్కో సబ్జెక్టుకు 100 మార్కులు కేటాయిస్తారు. ఇందులో 30 మార్కులను ఇంటర్నల్ మార్కులుగా అందిస్తారు, మిగతా 70 మార్కుల కోసం థియరీ పరీక్షలు నిర్వహిస్తారు. వీటికి అదనంగా 75 ప్రాక్టికల్ మార్కులు ఉంటాయి.

థియరీ పరీక్షల్లో కనీసం 35 ఉత్తీర్ణత మార్కులు పొందాలది ఉంటుంది. ప్రాక్టీకల్ సబ్జెక్టుల యందు కనీసం 50 శాతం ఉత్తీర్ణత మార్కులు పొందాల్సి ఉంటుంది. ఒక సెమిస్టర్ యందు తప్పిన సబ్జెక్టులను, వచ్చే ఏడాది అదే సెమిస్టరు యందు తిరిగిరాసే అవకాశం కల్పిస్తారు. సాంకేతిక విద్యను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) నిర్వహిస్తుంది.

దేశంలో 5 వేలకు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. ఏటా 25 లక్షలకు పైగా విద్యార్థులు ఇంజినీరింగులో అడ్మిషన్ పొందుతున్నారు. 15 లక్షలకు పైగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు రిలీవ్ అవుతున్నారు.

దేశంలో ఇంజనీరింగ్ విద్య ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీలు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీలు) లతో పాటుగా ప్రైవైట్ ఇనిస్టిట్యూట్లు, డ్రీమ్డ్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీల ద్వారా అందుబాటులో ఉంది. వీటిలో అడ్మిషన్ పొందేందుకు ప్రవేశ పరీక్షల్లో అర్హుత పొందాల్సి ఉంటుంది.

ఇంజనీరింగ్ తర్వాత కెరీర్ అవకాశాలు

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ (బీటెక్ ) పూర్తిచేసిన విద్యార్థులకు కెరీర్ పరంగా ఏవిధమైన డోకా ఉండదు. అబ్బురపరిచే అపరిమితమైన అవకాశాలు వీరి సొంతం. నాణ్యమైన ఇంజినీర్లకు కార్పొరేట్ సంస్థలు కోట్లలో ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. కాసింత కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ భాషా నైపుణ్యం మరికొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ మార్కెట్ యందు మంచి డిమాండ్ ఉంటుంది.

ఇంజనీరింగ్ రిలీవ్ అయిన మెజారిటీ విద్యార్థులు నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు అనేది వాస్తవమే, దీని అర్ధం ఇంజినీర్లకు కెరీర్ అవకాశాలు లేక కాదు..ఉన్న వాటికి సరిపడే సరైన నైపుణ్యాలు లేక మాత్రమే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. కావున ఎబిలిటీ & ఎలిజిబిలిటీ ఉండే గ్రాడ్యుయేట్లు కెరీర్ పరంగా హైరానా పడాల్సిన అవసరం లేదు.

ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీ, ప్రీమియర్ ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లు, డ్రీమ్డ్ యూనివర్సిటీలు వారి విద్యార్థుల కోసం క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. అలానే కొన్ని ఇనిస్టిట్యూట్లు తమ విద్యార్థులను వివిధ రిక్రూట్మెంట్ సంస్థలకు రిఫర్ చేస్తున్నాయి.

క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా ఉద్యోగం పొందని వారు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. కొన్ని నైపుణ్యాలు మెరుగుపర్చుకుని ఉద్యోగవేట మొదలు పెడితే మంచి ప్యాకేజీతో ఉద్యోగం పొందొచ్చు. అలానే ఇంటర్న్‌షిప్‌, ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా మీ కెరీర్ అవకాశాలు మెరుగుపర్చుకోవచ్చు.

వీటితో పాటుగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్/ఇంజనీరింగ్ సర్వీసెస్, ఎస్ఎస్సీ, రైల్వే, డిఫెన్స్, రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ ఉద్యోగాలకు పోటీపడే అవకాశం ఉంటుంది. లేకుంటే ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి ఉన్నత విద్య కోర్సులలో చేరి మిమ్మల్ని మరింత గొప్పగా తీర్చుదిద్దుకునే అవకాశం ఉంటుంది. అలానే సొంత వ్యాపారం మొదలు పెట్టొచ్చు. కొత్త బిజినెస్ ఐడియాతో వ్యవస్థాపకులుగా మారొచ్చు.

ఉత్తమ ఇంజనీరింగ్ కోర్సును ఎంపిక చేసుకోండి

ఇంజనీరింగ్ బ్రాంచ్‌ ఎంపిక అనేది విద్యార్థి ఆసక్తి మరియు పఠన సామర్ధ్యానికి సంబంధించిన అంశం. మెజారిటీ విద్యార్థులు ఈ రెండు అంశాలను పక్కనపెట్టి మార్కెట్ యందు డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్ బ్రాంచును ఎంపిక చేసుకొంటారు.

డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్ బ్రాంచును ఎంపిక చేసుకోవడం తప్పు నిర్ణయం కాదు కాని, యెంత మంది విద్యార్థులు విజయవంతం అవుతున్నారనే ప్రశ్నకు సమాధానం వెతికితే, అందులో మెజారిటీ విద్యార్థులు ఉద్యోగాలు పొందడంలో విఫలం అవుతున్నారు.

కెరీర్ అవకాశాలు ఎక్కువ ఉండే ఇంజనీరింగ్ బ్రాంచులో జాయిన్ అయితే సులువుగా ఉద్యోగం పొందొచ్చు అనే ఆలోచన సరైనది కాదు. విద్యార్థికి ఆసక్తి, అభిరుచి ఉన్న ఇంజనీరింగ్ గ్రూపును ఎంపిక చేసుకోవడం ద్వారా, అవకాశం లేని చోట కూడా అందలం ఎక్కొచ్చు.

ఒక విద్యార్థికి ప్రోగ్రామింగ్ మీద ఆసక్తి ఉన్నప్పుడు, సదురు విద్యార్థి కంప్యూటర్ ఇంజినీరింగ్ ఎంపిక చేసుకోవడం ఉత్తమమైన ఎంపిక అవుతుంది. అంతేకాని డిమాండ్ ఉందికదా అని కెమికల్ ఇంజనీరింగ్ యందు చేరితే ఇంజనీరింగ్ పూర్తిచేయడం కూడా కష్టమవుతుంది.

కావున ఇంజనీరింగ్ బ్రాంచ్‌ ఎంపిక అనేది పెద్ద క్వాంటం మెకానిక్స్ కాదు. విద్యార్థి ఆసక్తి, అభిరుచి మరియు వారి భవిష్యత్తు ఆశయం స్థిరమైనవి అయితే మిగతా అంశాలు పక్కనపెట్టి, వారికీ సాధ్యమయ్యే లేదా ఇష్టపడే ఇంజనీరింగ్ బ్రాంచును ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

అలాకాకుండా కెరీరులో ఏదో విధంగా సెటిల్ అవ్వాలి, అందరూ వెళ్లే దారిలోనే వెళ్ళాలి, డిమాండ్ ఉండే కోర్సునే ఎంపిక చేసుకోవాలి, అలానే భవిష్యత్తు కెరీర్ అవకాశాలే ప్రధానం అనుకుంటే, దానికి అనుగుణంగా మార్కెట్ యందు డిమాండ్ & అవకాశాలు ఉండే బ్రాంచును ఎంపిక చేసుకోండి.

విద్యార్థి నిర్ణయం ఏదైనా, వారు ఎంపిక చేసుకున్న బ్రాంచు ఏదైనా, చివరిగా కదనరంగంలో రాణించాల్సి విద్యార్ధే కాబట్టి దానికి అనుగుణంగా కృషి చేసి, క్రమశిక్షణతో విజేతలగా నిలవండి.

మెరుగైన కెరీర్ కోసం 40 విభిన్న రకాల ఇంజనీరింగ్ కోర్సులు

ఇంజనీరింగ్ బ్రాంచ్‌లు & స్పెషలైజేషన్‌లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఆరు లేదా ఏడు గ్రూపులకు డిమాండ్ ఉన్నా, మొత్తంగా చూసుకుంటే దాదాపు 100 కి పైగా ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌లు దేశంలో అందుబాటులో ఉన్నాయి.

ఇందులో మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రూపులలో అత్యధిక అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ ఐదు ఇంజనీరింగ్ గ్రూపులు దేశంలో ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో అందుబాటులో ఉంటాయి.

వీటి తర్వాత ఈ మధ్య కాలంలో డిమాండ్ పెరిగిన ఇంజనీరింగ్ బ్రాంచుల జాబితాలో రోబోటిక్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, టెక్సటైల్ ఇంజినీరింగ్ వంటి కోర్సులు ఉన్నాయి.

జాతీయస్థాయిలో నిర్వహించే వివిధ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల ద్వారా మరియు ఏపీ మరియు టీఎస్ ఎంసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేసే 40 విభిన్న రకాల ఇంజనీరింగ్ కోర్సుల జాబితాను మీకు అందిస్తున్నాం.

భారతదేశంలో ఉత్తమ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు

దేశ వ్యాప్తంగా ఉన్న టెక్నికల్ యూనివర్సిటీలు మరియు టెక్నికల్ ఇనిస్టిట్యూట్లలో ఇంజనీరింగ్ యూజీ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల పూర్తి జాబితా పొందండి.

జాతీయ స్థాయిలో ప్రభుత్వం నిర్వహించే జేఈఈ పరీక్షతో పాటుగా వివిధ ప్రైవేట్ మరియు డ్రీమ్డ్ యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షలు, అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఎంసెట్ తో పాటుగా ఇతర ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షల వివరాలు తెలుసుకోండి.

ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కాలర్షిప్లు

ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం, యూజీసీ మరియు ఏఐసీటీఈ వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు మెరిట్ స్కాలర్షిప్, స్టైపెండ్ వంటి వివిధ రూపాల్లో ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు పొందండి.

Post Comment