తెలంగాణ ఇంటర్మీడియట్ అకాడమిక్ క్యాలండర్ 2021-22
Telangana

తెలంగాణ ఇంటర్మీడియట్ అకాడమిక్ క్యాలండర్ 2021-22

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2021-22 ఏడాదికి సంబంధించిన అకాడమిక్ క్యాలండర్ విడుదల చేసింది. కోవిడ్ నేపథ్యంలో అస్తవ్యస్తమైన విద్యావ్యవస్థ క్యాలెండరును చక్కదిద్దే ప్రయత్నం చేసింది. ఈ ఏడాది అకాడమిక్ ఇయర్ 01 జులై 2021 నుండి ప్రారంభం కానుంది. 01 జులై 2022 నుండి సెప్టెంబరు 01 వ తేదీ వరకు ఆన్‌లైన్ తరగతలు మాత్రమే నిర్వహించనున్నారు. 01 సెప్టెంబర్ 2021 నుండి ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ విద్య ఏడాదిలో మొత్తం 220 పని దినాలకు షెడ్యూల్ చేసింది. ఫైనల్ పరీక్షలు ఏప్రిల్ లేదా మే నెలలలో నిర్వహించనున్నారు.

Advertisement

టీఎస్ ఇంటర్ అకాడమిక్ కేలండర్ - 2021-22

మొత్తం పని దినాలు (Working Days) 220 రోజులు
అకాడమిక్ ఇయర్ ప్రారంభ తేదీ (ఆన్‌లైన్) 1 జులై 2021 (47 రోజులు)
అకాడమిక్ ఇయర్ ప్రారంభ తేదీ (ఆఫ్‌లైన్) 1 సెప్టెంబర్ 2021 (173 రోజులు)
అకాడమిక్ ఇయర్ చివరి తేదీ 13 ఏప్రిల్ 2022
దసరా సెలవులు 13 - 16 అక్టోబర్ 2021
సంక్రాంతి సెలవులు 13 & 15 జనవరి 2022
ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ 10 - 18 ఫిబ్రవరి 2022
ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ 2022 23 మార్చి - 08 ఏప్రిల్ 2022
ఇంటర్ మెయిన్ ఎగ్జామ్స్ 2022 22  ఏప్రిల్- 12 మే 2022
వేసవి సెలవులు 12 మే - 31 మే 2022
అడ్వాన్స్ సప్లమెంటరీ ఎగ్జామ్స్ 2022 మే 2022 చివరి వారంలో
2022 - 23 విద్యా సంవత్సరం ప్రారంభం 1 జూన్ 2022

Advertisement

Post Comment