ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ 2022 | షెడ్యూల్ & ఎంపిక విధానం
Defence Jobs Latest Jobs

ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ 2022 | షెడ్యూల్ & ఎంపిక విధానం

అగ్నివీర్ వాయు ఇన్‌టేక్ నోటిఫికేషన్ 2022

అగ్నిపథ్ పథకం కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నియామక ప్రకటన జారీ చేసింది. అగ్నివీర్ వాయు ఇన్‌టేక్ పేరుతో విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటర్ ఎంపీసీ యందు ఉత్తీర్ణిత పొందిన అవివాహ యువకులకు నాలుగేళ్ళ స్వల్పకాలిక నిడివితో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యందు ఉద్యోగాలు కల్పించనున్నారు. ఇది అగ్నిపథ్ పథకం పరిధిలో వెలువడిన రెండవ నియామక ప్రకటన. దీనికి సంబంధిచిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 24 నుండి ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు 05 జులై 2022 లోపు దరఖాస్తు చేసుకోండి.

అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభం 24 జూన్ 2022
దరఖాస్తు తుది గడువు 05 జులై 2022
అడ్మిట్ కార్డు  20 జులై 2022
రాతపరీక్ష  24 జులై 2022
ఫలితాలు ఆగష్టు 2022

అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ ఎలిజిబిటీ

  • అభ్యర్థులు భారతీయ లేదా నేపాలీ పౌరులై ఉండాలి.
  • అభ్యర్థులు అవివాహితులై ఉండాలి
  • అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఎంపీసీ లేదా ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
  • అభ్యర్థుల వయసు 17.5 ఏళ్ళ నుండి గరిష్టంగా 23 ఏళ్ళ మధ్య ఉండాలి.
డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ 29/12/1999 - 29/06/2005
ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ ఎంపీసీ
ఇతర ఇంటర్మీడియట్ గ్రూపులు కూడా అర్హులు
3 ఏళ్ళ ఇంజినీరింగ్ డిప్లొమా
రెండేళ్ల నాన్ ఒకేషనల్ కోర్సు (మ్యాథ్స్ & ఫిజిక్స్)
శారీరక దారుఢ్య ప్రమాణాలు (PST) ఎత్తు - కనీసం 152.5 cm
ఛాతీ - కనీస విస్తరణ 5 cm
బరువు - ఎత్తుకు తగ్గ బరువు
మెడికల్ ప్రమాణాలు కార్నియల్ సర్జరీ చేసుకున్న వారు, వినికిడి సమస్యలు ఉన్నవారు, డెంటల్ సమస్యలు ఉన్నవారు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అనర్హులు.

అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ నియామక తీరు

  • అగ్నివీర్రి వాయు క్రూట్మెంట్ కింద శిక్షణతో కలుపుకుని గరిష్టంగా 4 ఏళ్లలో కాలపరిమితితో నియామకాలు చేపట్టనున్నారు.
  • నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సైనికులలో కేవ‌లం 25 శాతం మంది సైనికుల్ని మాత్ర‌మే రెగ్యుల‌ర్ క్యాడ‌ర్‌గా తీసుకుంటారు. వీళ్ళు 15 ఏళ్లపాటు స‌ర్వీస్‌లో ఉంటారు. మిగతా సైనికులు వాలెంటరీ రిటైర్మెంట్ పద్దతితో ఇంటికి పంపబడతారు.
  • నాలుగేళ్ళ తర్వాత విరమించబడ్డ సైనికులకు, విరమణ సమయంలో సేవనిధి పేరిట 12 లక్షల వరకు ఆర్థిక వెసులుబాటు కల్పించనున్నారు.
  • ఈ పథకం పరిధిలో ఎంపికైన వారికీ పెన్షన్ మరియు గ్రాట్యుటీ వంటివి లభించవు.
  • విరమణ పొందిన సైనికులకు అగ్నివీర్ స్కిల్ సర్టిఫికెట్ అందజేస్తారు.
  • అలానే ఉద్యోగంలో ఉన్నంతవరకు 48 లక్షల నాన్‌ కాంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్సూరెన్సు కల్పిస్తారు.
  • రిటైర్‌ అయిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు.
  • అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

అగ్నివీర్ వాయు వేతనాలు

అగ్నిప‌థ్ స్కీమ్‌ ద్వారా ఎంపికైన అగ్నివీరులకు మొదటి ఏడాది నెలకు 30 వేల రూపాయల వేతనం అందజేస్తారు. ఇందులో 9 వేల రూపాయలు కార్పస్ నిధికి జోడిస్తారు. మిగిలిన 21 వేలు అందజేస్తారు. అలానే కేంద్ర ప్రభుత్వం అంతే మొత్తంలో  9 వేలు కార్పస్ నిధికి  జోడిస్తుంది. రెండవ ఏడాది నుండి ఏటా 10 శాతం చెప్పున వేతనాన్ని పెంచి చెల్లిస్తారు. అంటే రెండవ ఏడాది 33 వేలు, మూడవ ఏడాది 36 వేల ఐదువందలు, అలానే చివరి ఏడాది 40 వేలు వేతనాన్ని అందజేస్తారు.

నెలవారీ జీతం చేతికి ఇచ్చే జీతం కార్పస్ ఫండ్ (అభ్యర్థి + ప్రభుత్వం)
మొదటి ఏడాది 30,000/- 21,000/- 18,000 /-
రెండవ ఏడాది 33,000/- 23,100/- 19,800/-
మూడవ ఏడాది 36,500/- 25,580/- 21,900/-
నాలుగో ఏడాది 40,000/- 28,000/- 24,000/-

అగ్నివీర్ వాయు దరఖాస్తు ప్రక్రియ

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో www.agnipathvayu.cdac.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసేందుకు ఇమెయిల్, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు అలానే టెన్త్ మరియు ఇంటర్ సర్టిఫికెట్స్ కలిగివుండాలి. అలానే 10 నుండి 50 కేబీ సైజుతో పాస్‌ఫోటో, డిజిటల్ సిగ్నేచర్ (అభ్యర్థి & పేరెంట్) కలిగివుండాలి.

దరఖాస్తులో అడిగిన వ్యక్తిగత, విద్య మరియు చిరునామా వివరాలు పొందుపర్చక, అందుబాటులో ఉన్న పేమెంట్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. అర్హులైన అభ్యర్థులకు పరీక్షకు 3 రోజుల ముందు అడ్మిట్ కార్డు ఇమెయిల్ ద్వారా పంపిస్తారు. దరఖాస్తు రుసుము 250/- నిర్ణయించారు.

  • వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
  • మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
  • ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి.
  • దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
  • పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
  • నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

అగ్నివీర్ నియామక ప్రక్రియ

ఆర్మీ అగ్నివీర్ నియామక ప్రక్రియ రెండు ఫేజులలో ఉంటుంది. మొదటి పేజ్ యందు అర్హులైన ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. ఫేజ్ 2 యందు ఫీజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.

రాతపరీక్ష : ఆన్‌లైన్ రాతపరీక్ష ఒకే సిట్టింగులో మూడు వేరువేరు పేపర్లుగా నిర్వహిస్తారు. అభ్యర్థులు మూడు పేపర్ల యందు ఉత్తీర్ణత పొందాల్సి వస్తుంది. పేజ్ 1 లో నిర్వహించే ఆన్‌లైన్ రాతపరీక్షలో అర్హుత పొందిన వారిని పేజ్ II కోసం షార్ట్ లిస్ట్ రూపొందిస్తారు.

ఎగ్జామ్ పేపర్ సిలబస్ పరీక్ష సమయం 
సైన్స్ సబ్జెక్టులు 10+2 సెంట్రల్ సిలబస్ (ఎంపీసీ) 60 నిముషాలు
సైన్స్ యితర సబ్జెక్టులు ఇంగ్లీష్, జనరల్ అవెర్నెస్, రీజనింగ్ 45 నిముషాలు
సైన్స్ సబ్జెక్టులు + సైన్స్ యితర సబ్జెక్టులు మాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్, జనరల్ అవెర్నెస్, రీజనింగ్ 85 నిముషాలు

ఫేజ్ II కు అర్హుత పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకొని నిర్ణహించిన గడువులోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ సమయంలో అడ్మిట్ కార్డుతో పాటుగా, పెన్సిల్, 8 పాస్‌ఫోటో సైజు ఫోటులు, ఇతర సర్టిఫికేట్లతో హాజరు కావాల్సి ఉంటుంది. ఫీజికల్ ఫిటినెస్ టెస్టులో భాగంగా అభ్యర్థులు 06 నిమిషాల 30 సెకండ్లలో 1.6 కి.మీ పరుగును పూర్తి చేయాలి. అలానే అభ్యర్థులు 10 పుష్-అప్‌లు, 10 సిట్-అప్‌లు మరియు 20 స్క్వాట్‌లను కూడా పూర్తి చేయాలి.

ఫీజికల్ ఫిటినెస్ టెస్టులో అర్హుత పొందిన వారికీ రెండవ దశలో అడాప్టబిలిటీ I & II నిర్వహిస్తారు. ఈ దశలను పూర్తిచేసుకున్న వారికీ చివరిగా మెడికల్ టెస్ట్ నివహించి తుది నియామక ప్రక్రియ పూర్తిచేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 10 వారాల నుంచి 6 నెలల వరకు శిక్ష‌ణ ఉంటుంది. ఈ శిక్షణ సమయం కూడా నాలుగేళ్ళ కాంట్రాక్టు పీరియడ్ యందు లెక్కించబడుతుంది. అలానే ఏడాది గరిష్టంగా ఏడాదికి 30 రోజుల సాధారణ సెలవలు కల్పిస్తారు. అలానే మెడికల్ సెలవలు కూడా అవసరం మేరకు పొందే అవకాశం ఉంది.

Post Comment