Advertisement
ఆర్మీ పాఠశాలల్లో  ఉపాధ్యాయ నియామకాలు – 2022 | మొత్తం ఖాళీలు 8700
Defence Jobs Latest Jobs

ఆర్మీ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు – 2022 | మొత్తం ఖాళీలు 8700

ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) ఆధ్వర్యంలో నడుస్తున్న సైనిక పాఠశాలల్లో పీఆర్'టీ, టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 136 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో 8700 పీఆర్'టీ, టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నియామక ప్రక్రియ రాతపరీక్ష, ఇంటర్వ్యూ మరియు టీచింగ్ ప్రొఫెసీఎన్సీ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు 28 జనవరి 2022 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

నియామక షెడ్యూల్

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 07 జనవరి 2022
దరఖాస్తు చివరి గడువు 28 జనవరి 2022
అడ్మిట్ కార్డులు 10 ఫిబ్రవరి 2022
పరీక్షా తేదీ 19 & 20 ఫిబ్రవరి 2020
ఫలితాలు 28 ఫిబ్రవరి 2022

ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు భారతీయ పౌరులయి ఉండాలి.
  • పీఆర్'టీ, టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసేవారు నియామక సమయానికి సీటెట్ లేదా టెట్ పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
  • అభ్యర్థులు సంబంధిత అర్హుత డిగ్రీలలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

వయోపరిమితి

5 ఏళ్లలోపు టీచింగ్ అనుభవం కలిగిన వారికి గరిష్ట వయోపరిమితి 40 ఏళ్ళు 5 నుండి 10 ఏళ్ళ టీచింగ్ అనుభవం కలిగిన వారికి గరిష్ట వయోపరిమితి 57 ఏళ్ళు

ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ

ఉపాధ్యాయ పోస్టు జనరల్ డిగ్రీ ప్రొఫిషినల్ డిగ్రీ
ప్రైమరీ టీచర్ (PRT) బ్యాచిలర్ డిగ్రీ డీఎడ్ లేదా బీఈడీ
ట్రైనెడ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) బ్యాచిలర్ డిగ్రీ బీఈడీ
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) బీఈడీ

దరఖాస్తు ఫీజు & పరీక్షా కేంద్రాలు

  • దరఖాస్తు ఫీజు : 385 /- (నాన్ రిఫండబుల్)
  • పరీక్షా కేంద్రాలు : హైదరాబాద్ & సికింద్రాబాద్

దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు , జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.

దరఖాస్తు విధానం

అర్హుత కలిగిన అభ్యర్థులు AWES అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఓటీపీ వెరిఫికేషన్'కు అందుబాటులో ఉండే మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ ఉండాలి. అలానే దరఖాస్తు చేసేందుకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, అర్హుత పొందిన అకాడమిక్ సర్టిఫికెట్లు కలిగివుండాలి. దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అందించే సమాచారంకు పూర్తి జవాబుదారీ మీరే కాబట్టి ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి.

  • వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
  • మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
  • ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో  మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా  చూసుకోండి.
  • దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో  ఇవ్వాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
  • పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
  • నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

పీజీటీ & టీజీటీ నియామక సబ్జెక్టులు

పీజీటీ ఇంగ్లీష్ , హిందీ, సంస్కృతం, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, గణితం, భౌతికశాస్త్రం, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ, సైకాలజీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేటిక్స్, హోమ్ సైన్స్, ఫీజికల్ ఎడ్యుకేషన్
టీజీటీ ఇంగ్లీష్ , హిందీ, సంస్కృతం, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, గణితం, భౌతికశాస్త్రం, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేటిక్స్, ఫీజికల్ ఎడ్యుకేషన్

నియామక ప్రక్రియ

నియామక ప్రక్రియ మూడు దశలలో జరుగుతుంది. మొదటి దశలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ యందు అర్హుత పొందిన వారికీ AWES స్కోరు కార్డు అందిస్తారు. AWES స్కోరు కార్డు గరిష్టంగా మూడేళ్లు చెల్లుబాటు అవుతుంది. ఈ కార్డు సహాయంతో ఈ మూడేళ్ళ వ్యవధిలో వెలువడే ఆర్మీ స్కూల్స్ ఉపాధ్యాయ నియామకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే AWES స్కోరు కార్డుతో ఇతర సీబీఎస్ఈ స్కూళ్లలో పని చేసేందుకు అవకాశం ఉంటుంది.

స్క్రీనింగ్ టెస్ట్ యందు అర్హుత పొందిన వారికీ రెండువ దశలో వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇదే దశలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇందులో అర్హుత పొందిన వారికీ చివరిగా టీచర్ స్కిల్ టెస్ట్ మరియు కంప్యూటర్ ప్రొఫీసియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హుత పొందిన వారికీ ఖాళీల ఆధారంగా భర్తీ ప్రక్రియ చేపడతారు.

రెండవ మరియు మూడవ నియామక దశలు స్థానిక స్కూళ్ల పరిధిలో నిర్వహిస్తారు. ఆయా స్కూళ్ల పరిధిలో ఖాళీలు ప్రకారం స్థానిక న్యూస్ పేపర్లలో ఏటా సందర్భానుసారం నియామక ప్రకటన జారీచేస్తారు. AWES స్కోరు కార్డు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్థానిక ఆర్మీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్లు వ్యక్తిగత ఇంటర్వ్యూ మరియు టీచర్ స్కిల్ టెస్ట్ & కంప్యూటర్ ప్రొఫీసియన్సీ టెస్ట్ నిర్వహించి తుది నియామకం చేపడతారు.

పరీక్షా విధానం

మొదటి దశలో నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ఇందులో 90 నిముషాల నిడివితో 80 మార్కులకు నిర్వహించే పార్ట్ A పరీక్షను పీఆర్'టీ, టీజీటీ, పీజీటీ అభ్యర్థులు అందరు కామన్'గా రాయాల్సి ఉంటుంది. 2 గంటల నిడివితో 120 మార్కులకు జరిగే పార్ట్ B పరీక్షను టీజీటీ, పీజీటీ అభ్యర్థులు మాత్రమే రాయాల్సి ఉంటుంది.

పార్ట్ A పరీక్షా విధానం

పార్ట్ A పరీక్ష 90 నిముషాల నిడివితో 80 మార్కులకు జరుగుతుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ పద్దతిలో ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారంగా నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో మూడు సెక్షన్లు ఉంటాయి.  సెక్షన్ A లో జనరల్ నాలెడ్జ్ సంబంధించి 1 - 28 ప్రశ్నలు ఇవ్వబడతయి. సెక్షన్ B లో  తాజా కరెంటు అఫైర్స్ అంశాలను ప్రశ్న సంఖ్యా 29 నుండి 56 వరకు ఇవ్వబడతాయి. సెక్షన్ C లో బీఈడీ & టీచింగ్ ప్రాక్టీస్ సంబంధించి 57వ ప్రశ్న నుండి 80 వరకు ఇవ్వబడతయి.

సెక్షన్ సబ్ సెక్షన్ & వెయిటేజీ మార్కులు & ప్రశ్నలు
సెక్షన్ A - బేసిక్ జనరల్ నాలెడ్జ్ (1 నుండి 28 ప్రశ్నలు) జనరల్ అవేర్నెస్ (VI నుండి X వరకు NCRT  సిలబస్)
మెంటల్ ఎబిలిటీ
కంఫ్రహెన్షన్
1 నుండి 16 ప్రశ్నలు (16 మార్కులు)
17 నుండి 24 ప్రశ్నలు (8 మార్కులు)
25 నుండి 28 ప్రశ్నలు (4 మార్కులు)
సెక్షన్ B - కరెంటు అఫైర్స్ (29 నుండి 56 ప్రశ్నలు) జాతీయ అంశాలు
అంతర్జాతీయ అంశాలు
ఇండియా సంబంధిత అంతర్జాతీయ ఈవెంట్స్
29 నుండి 44 ప్రశ్నలు (16 మార్కులు)
45 నుండి 52 ప్రశ్నలు (8 మార్కులు)
53 నుండి 56 ప్రశ్నలు (4 మార్కులు)
సెక్షన్ C - బీఈడీ / టీచింగ్ ప్రాక్టీస్ (57 నుండి 80 ప్రశ్నలు) బీఈడీ / టీచింగ్ ప్రాక్టీస్
సీబీఎస్ఈ రూల్స్ & రెగ్యులేషన్స్
ఎడ్యుకేషన్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
57 నుండి 72 ప్రశ్నలు (16 మార్కులు)
73 నుండి 76 ప్రశ్నలు (4 మార్కులు)
77 నుండి 80 ప్రశ్నలు (4 మార్కులు)

పార్ట్ B పరీక్షా విధానం (టీజీటీ అభ్యర్థులకు)

పార్ట్ B పరీక్ష 120 నిముషాల నిడివితో 120 మార్కులకు జరుగుతుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ పద్దతిలో ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారంగా నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో నాలుగు సెక్షన్లు ఉంటాయి.  సెక్షన్ A లో జనరల్ నాలెడ్జ్ సంబంధించి 1 - 42 ప్రశ్నలు ఇవ్వబడతయి. ప్రశ్నలు 6 నుండి పదివ తరగతి స్థాయి NCRT సిలబస్ ఆధారంగా ఉంటాయి.  సెక్షన్ B లో అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టులో 6 నుండి పదివ తరగతి స్థాయి అంశాలను ప్రశ్న సంఖ్యా 43 నుండి 84 వరకు ఇవ్వబడతాయి. సెక్షన్ C లో అదే సబ్జెక్టు చెందిన ప్రశ్నలను క్లాస్ X నుండి XII స్థాయిలో, సెక్షన్ D లో అదే సబ్జెక్టు చెందిన ప్రశ్నలను గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇవ్వబడతయి.

సెక్షన్ సబ్ సెక్షన్ & వెయిటేజీ మార్కులు & ప్రశ్నలు
సెక్షన్ A - బేసిక్ జనరల్ నాలెడ్జ్ (1 నుండి 42 ప్రశ్నలు) నాలెడ్జ్ ఆధారిత ప్రశ్నలు
అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలు
1 నుండి 24ప్రశ్నలు (24 మార్కులు)
25 నుండి 42 ప్రశ్నలు (18 మార్కులు)
సెక్షన్ B - సెలెక్టెడ్ సబ్జెక్టు (43 నుండి 84 ప్రశ్నలు) నాలెడ్జ్ ఆధారిత ప్రశ్నలు
అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలు
43 నుండి 66 ప్రశ్నలు (24 మార్కులు)
67 నుండి 84 ప్రశ్నలు (18 మార్కులు)
సెక్షన్ C - సెలెక్టెడ్ సబ్జెక్టు (85 నుండి 96 ప్రశ్నలు) నాలెడ్జ్ ఆధారిత ప్రశ్నలు
అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలు
85 నుండి 90 ప్రశ్నలు (6 మార్కులు)
91 నుండి 96 ప్రశ్నలు (6 మార్కులు)
సెక్షన్ D -  సెలెక్టెడ్ సబ్జెక్టు (97 నుండి 120 ప్రశ్నలు) నాలెడ్జ్ ఆధారిత ప్రశ్నలు
అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలు
97 నుండి 108 ప్రశ్నలు (12 మార్కులు)
109 నుండి 76 ప్రశ్నలు (12 మార్కులు)

పార్ట్ B పరీక్షా విధానం (పీజీటీ అభ్యర్థులకు)

పార్ట్ B పరీక్ష 120 నిముషాల నిడివితో 120 మార్కులకు జరుగుతుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ పద్దతిలో ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారంగా నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో మూడు సెక్షన్లు ఉంటాయి.  సెక్షన్ A లో అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టులో క్లాస్ XI నుండి క్లాస్ XII  స్థాయి ప్రాథమిక అంశాలను.  సెక్షన్ B లో అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టులో క్లాస్ XI నుండి క్లాస్ XII  స్థాయి మోడరేట్ అంశాలను. సెక్షన్ C లో అదే సబ్జెక్టు చెందిన ప్రశ్నలను పోస్టుగ్రాడ్యుయేట్ స్థాయిలో ఇవ్వబడతయి.

సెక్షన్ సబ్ సెక్షన్ & వెయిటేజీ మార్కులు & ప్రశ్నలు
సెక్షన్ A - సెలెక్టెడ్ సబ్జెక్టు (1 నుండి 42 ప్రశ్నలు) నాలెడ్జ్ ఆధారిత ప్రశ్నలు
అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలు
1 నుండి 24ప్రశ్నలు (24 మార్కులు)
25 నుండి 42 ప్రశ్నలు (18 మార్కులు)
సెక్షన్ B - సెలెక్టెడ్ సబ్జెక్టు (43 నుండి 84 ప్రశ్నలు) నాలెడ్జ్ ఆధారిత ప్రశ్నలు
అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలు
43 నుండి 66 ప్రశ్నలు (24 మార్కులు)
67 నుండి 84 ప్రశ్నలు (18 మార్కులు)
సెక్షన్ C - సెలెక్టెడ్ సబ్జెక్టు (85 నుండి 120 ప్రశ్నలు) నాలెడ్జ్ ఆధారిత ప్రశ్నలు
అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలు
85 నుండి 102 ప్రశ్నలు (18 మార్కులు)
103 నుండి 120 ప్రశ్నలు (18 మార్కులు)

Post Comment