ఏయూఈఈటీ 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షను ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ క్యాంపసులో మరియు అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆరేళ్ళ ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీ కోర్సులల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈ కోర్సులో మొదటి నాలుగేళ్లు బీటెక్, చివరి రెండేళ్లు ఎంటెక్ డిగ్రీ అందిస్తారు.
నాలుగేళ్ళ ఇంజీనిరింగ్ కోర్సు పూర్తిచేసి బయటకు పోయే విద్యార్థులకు బీటెక్ పట్టా మాత్రమే అందిస్తారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ యందు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుందుకు అర్హులు. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఏయూఈఈటీ 2023
Exam Name | AUEET 2023 |
Exam Type | Entrance Test |
Admission For | Engineering Courses |
Exam Date | 03/05/2023 |
Exam Duration | 90 Minutes |
Exam Level | State Level |
ఏయూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు
ఏయూలో ఇంజనీరింగ్ కోర్సులు & ఫీజు వివరాలు
ఏయూ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షా ద్వారా ఆరేళ్ళ ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీ యందు ప్రవేశాలు కల్పిస్తుంది. ఈ డ్యూయల్ డిగ్రీలో భాగంగా మొదటి నాలుగేళ్లు బీటెక్, చివరి రెండేళ్లు ఎంటెక్ డిగ్రీ అందిస్తారు. నాలుగేళ్ళ ఇంజీనిరింగ్ కోర్సు పూర్తిచేసి బయటకు పోయే వారికీ బీటెక్ పట్టా మాత్రమే అందిస్తారు.
ఇంజనీరింగ్ కోర్సు | ఎలిజిబిలిటీ | సీట్లు | ట్యూషన్ ఫీజు |
---|---|---|---|
B.Tech CSE + M.Tech. | ఇంటర్ ఎంపీసీ (50%) | 360 | Rs 2,00,000/- |
B.Tech+M.Tech. (Electrical & Electronics) | ఇంటర్ ఎంపీసీ (50%) | 30 | Rs 100,000/- |
B.Tech+M.Tech. (Civil) | ఇంటర్ ఎంపీసీ (50%) | 30 | Rs 100,000/- |
B.Tech+M.Tech.(Mechanical) | ఇంటర్ ఎంపీసీ (50%) | 30 | Rs 150,000/- |
B.Tech+M.Tech. (Electronics & Communications) | ఇంటర్ ఎంపీసీ (50%) | 60 | Rs 150,000/- |
ఏయూఈఈటీ 2023 ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ | 27 మార్చి 2023 |
దరఖాస్తు చివరి తేదీ | 25 ఏప్రిల్ 2023 |
హాల్ టికెట్ డౌన్‌లోడ్ | 01 మే 2023 |
పరీక్ష తేదీ | 03 మే 2023 |
ఫలితాలు | 05 మే 2023 |
కౌన్సిలింగ్ | జూన్ 2023 |
ఏయూఈఈటీ దరఖాస్తు ఫీజు & ఎగ్జామ్ సెంటర్లు
- జనరల్ కేటగిరి అభ్యర్థులు 1200/- దరఖాస్తు రుసుము చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ మరియు అంగవైకుల్యం ఉన్న అభ్యర్థులు 1000/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
విశాఖపట్నం రాజమండ్రి |
విజయవాడ గుంటూరు |
తిరుపతి కడప |
రెండు వందలకు మించి దరఖాస్తు చేయని కోర్సులకు సంబంధించిన రాతపరీక్ష విశాఖపట్నంలో నిర్వహించబడుతుంది.
ఏయూఈఈటీ దరఖాస్తు ప్రక్రియ
ఏయూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఏయూ అధికారిక వెబ్సైటు (www.audoa.in) ద్వారా గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో కోరిన వ్యక్తిగత, విద్య వివరాలు తప్పులు దొర్లకుండా నింపాలి. ఉత్తీర్ణత సాధించిన ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, టెన్త్ హాల్ టికెట్ నెంబర్, ఇతర ధ్రువపత్రాలు దరఖాస్తు చేసే సమయంలో అందుబాటులో ఉంచుకోండి.
దరఖాస్తు యందు సమర్పించే వ్యక్తిగత చిరునామా, ఫోన్ నెంబర్ మరియు మెయిల్ అడ్రస్ వివరాలు సక్రమంగా పొందుపర్చండి. దరఖాస్తు తుది సమర్పణ ముందు పొందుపర్చిన వివరాలు మరోమారు సరిచూసుకోండి. చివరిగా అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించి. దరఖాస్తు ప్రింట్ తీసి భద్రపర్చుకోండి.
ఏయూఈఈటీ ఎగ్జామ్ నమూనా
ఏయూ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష పెన్ మరియు పేపర్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ పద్దతిలో ఉంటుంది. క్వశ్చన్ పేపర్లో మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు ఇవ్వబడతాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షనల్ సమాధానాలు ఇవ్వబడతయి. వాటి నుండి ఒక సరైన సమాధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. పరీక్షా 90 నిముషాల వ్యవధితో 100 మార్కులకు జరుగుతుంది.
పార్ట్ | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
---|---|---|---|
మ్యాథమెటిక్స్ | 40 | 40 | 90 నిముషాలు |
ఫిజిక్స్ | 30 | 30 | |
కెమిస్ట్రీ | 30 | 30 | |
మొత్తం | 100 | 100 |
ఏయూఈఈటీ అడ్మిషన్ ప్రక్రియ
ఏయూఈఈటీ రాతపరీక్షలో సాధించిన వివిధ కేటగిర్ల వారీ మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అందుబాటులో ఉన్న సీట్లలో 85% శాతం సీట్లు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉన్న శ్రీకాకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలకు చెందిన అభ్యర్థులకు కేటాయిస్తారు.
రేజర్వేషన్ల పరంగా ఎస్సీ అభ్యర్థులకు 15%, ఎస్టీ అభ్యర్థులకు 6%, బీసీ అభ్యర్థులకు 29%, NCC అభ్యర్థులకు 1%, క్రీడాకులకు 0.5% మరియు మహిళకు 33% సీట్లు కేటాయిస్తారు.
రిజర్వేషన్ కేటగిరి | రిజర్వేషన్ కోటా |
---|---|
ఎస్సీ అభ్యర్థులు | 15% శాతం |
ఎస్టీ అభ్యర్థులు | 8 శాతం |
బీసీ కులాలు | 29 శాతం |
మహిళలు | 33% శాతం |
NCC, Sports | 1 శాతం, 0.5 శాతం |
ఏయూ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి కొన్ని నియమాలు
- అడ్మిషన్ పొందిన అభ్యర్థులు యూజీసీ నియమానుసారం ఏడాదిలో 75% హాజరు తప్పనిసరి.
- అడ్మిషన్ పొందిన మొదటి పది రోజుల్లో అభ్యర్థి సదురు కాలేజీలో హాజరు కాకుంటే ఆ సీటును తప్పించే అధికారం వారికీ ఉంటుంది.
- రెగ్యులర్ కోర్సులలో అడ్మిషన్ పొందిన అభ్యర్థులు ఇతర కోర్సులలో జాయిన్ అవ్వెందుకు, ఉద్యోగాలు చేసేందుకు అనుమతి ఉండదు.
- ప్రతి సెమిస్టర్ చివరిలో పరీక్షలు నిర్వహించబడతాయి. సప్లిమెంటరీ పరీక్షలు ఉండవు.
- ర్యాగింగ్ కార్యకలాపాల్లో పాల్గునే అభ్యర్థులు శిక్షార్హులు.
- వరుస పది రోజులు క్లాసులకు హాజరుకాని విద్యార్థులు. దానికి సంబంధించి పర్మిషన్ కల్గిఉండాలి.