అవార్డులు & గౌరవాలు | జనవరి 2022
Telugu Current Affairs

అవార్డులు & గౌరవాలు | జనవరి 2022

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు 2021

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2021 విజేతలను డిసెంబర్ 30, 2021న ప్రకటించరు. రాజ్యాంగంలో పేర్కొన్న 22 భాషల్లోని రచయితలు మరియు రచయితల సాహిత్య కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు ఇవ్వబడ్డాయి. ఈ అవార్డు విజేతలకు ప్రశంసా పత్రంతో పాటు లక్ష రూపాయలు నగదు అందజేస్తారు.

గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ

తెలుగు భాషకు సంబంధించి వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన వల్లంకితాళం అనే పుస్తకానికి గాను కవితా విభాగంలో ఈ అవార్డు అందుకొన్నారు. ప్రజాకవి, గాయకుడైన గోరటి వెంకన్న  ఇదివరకే 2016లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం గోరటి వెంకన్న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

డిఎస్ నాగభూషణ్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ప్రముఖ సాహిత్య విమర్శకుడు డీఎస్ నాగభూషణ్‌కు మహాత్మా గాంధీ జీవిత చరిత్ర అయిన గాంధీ కథనానికి గాను 2021కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అలానే పిల్లల సాహిత్యానికి సంబంధించి బెంగాలీ రచయత బ్రత్యా బసు బేవినగిడాడ్ రాసిన ఓడి హోడా హుడుగాకు బాల సాహిత్య పురస్కారాం లభించింది, అదే విదంగా హెచ్. లక్ష్మీ నారాయణ స్వామికి తొగల చీలాడ కర్ణ కవిత్వానికి సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. ప్రముఖ ఆంగ్ల రచయత శ్రీమతి నమిత గోఖలే తన "థింగ్స్ టు లీవ్ బిహైండ్" నవలకు సాహిత్య అవార్డు పొందారు.

ప్రముఖ రచయిత్రి అనుకృతి ఉపాధ్యాయ్'కు సుశీలా దేవి అవార్డు

ప్రముఖ రచయిత్రి అనుకృతి ఉపాధ్యాయ్, తాను రచించిన కింట్సుగి అనే నవలకు గాను సుశీలా దేవి అవార్డు అందుకున్నారు. అనుకృతి ఉపాధ్యాయ మేనేజ్‌మెంట్ అండ్ లిటరేచర్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీలతో పాటుగా లా లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆమె ఇంగ్లీషు మరియు హిందీ బాషలలో రచనలు చేస్తున్నారు. ఆమె 2019లో ప్రచురించిన దౌరా మరియు భౌన్రి అనే జంట నవలలు పాఠకులు మరియు విమర్శకుల అభినందలు అందుకున్నాయి. సుశీలా దేవి అవార్డును శ్రీ రతన్'లాల్ ఫౌండేషన్ అందిస్తుంది.

మీడియా ట్రెండ్జ్ వ్యవస్థాపకుడు రోహిత్ కుమారుకు 'బీహార్ విభూతి సమ్మాన్‌'

మీడియా ట్రెండ్జ్ వ్యవస్థాపకుడు రోహిత్ కుమారుకు బీహార్ ప్రభుత్వం 'బీహార్ విభూతి సమ్మాన్‌'తో సత్కరించింది. ఇటీవలే నిర్వహించిన బీహార్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ కాంక్లేవ్ 2021 లో ఈ అవార్డును అందించారు. కోవిడ్ కష్టకాలంలో స్థానిక స్టార్టప్‌లకు తన మార్కెటింగ్ వెంచర్ మీడియా ట్రెండ్జ్ ద్వారా  సహాయం చేసినందుకు ఈ అవార్డును అందించారు.

ఫోటో జర్నలిజంలో జిషాన్ ఎ లతీఫ్'కు రామ్‌నాథ్ గోయెంకా అవార్డు

ఫోటో జర్నలిజం విభాగంలో జిషాన్ ఎ లతీఫ్ రామ్‌నాథ్ గోయెంకా అవార్డును గెలుచుకున్నారు. అక్టోబరు 2019లో ది కారవాన్‌లో ప్రచురించబడిన NRCలో చేర్చడానికి కఠినమైన పోరాటం అనే తన ఫోటో వ్యాసం కోసం అతను ఈ అవార్డును గెలుచుకున్నాడు.

గోల్డెన్ గ్లోబ్ అవార్డులు 2022

79వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రధానోత్సవం 09 జనవరి 2022 న హట్టహాసంగా జరిగింది. హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ అందించే ఈ అవార్డులు ఏడాదిలో ఉత్తమ చలనచిత్రలకు మరియు అమెరికన్ టెలివిజన్‌ షోలకు అందిస్తారు. ఈ ఏడాది 'పవర్ ఆఫ్ ది డాగ్'  చిత్రం బెస్ట్ ఫిలిం అవార్డు అందుకుంది. ఇదే చిత్రానికి జేన్ క్యాంపైన్ ఉత్తమ డైరెక్టర్ అవార్డు దక్కించుకున్నారు. 'కింగ్ రిచర్డ్' చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా విల్ స్మిత్ తన మొదటి గోల్డెన్ గ్లోబ్‌ అవార్డు అందుకున్నాడు.

'బీయింగ్ ది రికార్డాస్' చిత్రానికి గాను ఉత్తమ నటిగా నికోల్ కిడ్‌మాన్ అవార్డు దక్కించుకున్నారు. నికోల్ కిడ్‌మాన్'కి ఇది ఐదవ గోల్డెన్ గ్లోబ్ అవార్డు. జెరెమీ స్ట్రాంగ్, 'సక్సెషన్' అనే టెలివిజన్ సిరీస్‌లో ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్నాడు. అలానే 'సక్సెషన్' ఈ ఏడాది ఉత్తమ టెలివిజన్ సిరీస్‌ అవార్డు దక్కించుకుంది. అలానే దక్షిణ కొరియా నటుడు ఓ యోంగ్-సు, నెట్‌ఫ్లిక్స్ డ్రామా "స్క్విడ్ గేమ్" లో తన పాత్రకు గాను యొక్క గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నాడు. దక్షిణ కొరియా నుండి గోల్డెన్ గ్లొబ్ అవార్డు అందుకున్న మొదటి నటుడుగా చరిత్రకెక్కాడు.

ఫైజర్ చీఫ్ ఆల్బర్ట్ బౌర్లాకు జెనెసిస్ ప్రైజ్

గ్లోబల్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఫైజర్ ఇంక్ యొక్క ఛైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆల్బర్ట్ బౌర్లాకు ప్రతిష్టాత్మకమైన జెనెసిస్‌ జెనెసిస్ ప్రైజ్ లభించింది. ఈ అవార్డు విజేతకు 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ అందిస్తారు. కోవిడ్ 19 వాక్సిన్ రూపొందించడంతో చూపించిన కృషికి గాను ఈ అవార్డు లబించింది.

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ అవార్డు 2022

నేతాజీ రీసెర్చ్ బ్యూరో, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ అవార్డు 2022 ను ప్రదానం చేసింది. నేతాజీ ఎల్గిన్ రోడ్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో అబే తరపున కోల్‌కతాలోని జపాన్ కాన్సుల్ జనరల్ నకమురా యుటాకా గౌరవాన్ని అందుకున్నారు. ఈ అవార్డును ప్రతి సంవత్సరం జనవరి 23న స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రకటిస్తారు. అవార్డు గ్రహీతకు ₹ 51 లక్షల నగదు బహుమతి అందిస్తారు. షింజో అబే 2006 నుండి 20077 వరకు, తిరిగి 2012 నుండి 2020 వరకు అత్యంత ఎక్కవ కాలం అధికారంలో ఉన్న జపాన్ ప్రధానిగా నిలిచారు.

సుస్మితా సేన్'కు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వర్కింగ్‌ ఉమెన్ అవార్డు

ప్రముఖ బాలీవుడ్ నటి సుస్మితా సేన్ వాషింగ్టన్ డీసీ సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (DCSAFF) 2021 లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ అవార్డును అందుకుంది. ఈ మాజీ మిస్ యూనివర్స్ తన వెబ్ సిరీస్ 'ఆర్య 2' లో చూపిన అత్యుత్తమ నటనకు గాను ఈ అవార్డు అందుకుంది.

పద్మ అవార్డులు 2022

ఏటా రిపబ్లిక్‌ డే సందర్భంగా అందించే పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది పద్మవిభూషణ్‌కు మొత్తం నలుగురి పేర్లను ఎంపిక చేశారు. వీరిలో ముగ్గురికి మరణానంతరం ఈ గౌరవం లభించింది. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలలో దివంగత మాజీ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, (మరణానంతరం), దివంగత ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ (మరణానంతరం), రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం) ప్రభా ఆత్రే పేర్లు ఉన్నాయి. అలానే ఈ ఏడాది పద్మభూషణ్ అవార్డు 17 మందికి అందివ్వగా, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు.

పద్మ భూషణ్ అందుకున్న వారి జాబితాలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ, మాజీ హోం సెక్రటరీ రాజీవ్ మెహ్రిషిని, మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌, భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు కృష్ణ ఎల్లా మరియు అతని భార్య సుచిత్రా ఎల్లాలు ఉన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు, సుంకర వెంకట ఆదినారాయణ, షేక్‌హసన్‌ లకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. తెలంగాణ నుంచి పద్మజారెడ్డి, దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్యలకు పద్మశ్రీలు దక్కాయి. అలాగే కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాకు సంయుక్తంగా పద్మభూషణ్ ప్రకటించింది.

తమిళనాడు సత్యమంగళం టైగర్ రిజర్వ్'కు TX2 అవార్డు

తమిళనాడు ఈరోడ్‌లోని సత్యమంగళం టైగర్ రిజర్వ్ (STR) మరియు నేపాల్‌లోని బర్దియా నేషనల్ పార్క్ సంయుక్తంగా TX2 అవార్డు 2022 ని గెలుచుకున్నాయి. పులుల సంఖ్యా పెరుగుదలలో చేసిన కృషికి గాను ఈ అవార్డు అందించారు. ఈ అవార్డును వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF) అందించింది. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ 1961 లో ఏర్పాటు చేయబడింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అంతరించిపోతున్న జంతువులను సంరక్షిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం గ్లాండ్, స్విట్జర్లాండ్ లో ఉంది.

Post Comment