చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల (MSME) ఆర్థిక మరియు అభివృద్ధి అవసరాలను పరివేక్షించేందుకు ఒక నిర్మాణాత్మక సంస్థ ఉండాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం 1990 లో స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( సిడ్బిఐ ) ని స్థాపించింది.
లక్నో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సిడ్బిఐ కి దేశంలో 80 రీజినల్ కార్యాలయాలు ఉన్నాయి. వీటితో పాటుగా బ్యాంకులు, ఇతర సంస్థలలో ఉండే బ్రాంచ్ శాఖలతో కలుపుకుని దేశవ్యాప్తంగా 1.25 లక్షల సిడ్బిఐ శాఖలను కలిగిఉంది.
నియామక బోర్డు | SIDBI |
నియామక పరీక్షా | SIDBI JOBS |
ఎంపిక ప్రక్రియ | రాతపరీక్ష/ఇంటర్వ్యూ |
ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ | గ్రాడ్యుయేషన్ |
వయో పరిమితి | 21 - 30 ఏళ్ళ మధ్య |
తాజా ఉద్యోగాలు | క్లిక్ చేయండి |
పేదరిక నిర్మూలన, ఉపాధికల్పన, నూతన పారిశ్రామిక వ్యవస్థాపకత పెంపొందించడం మరియు ఎంఎస్ఎంఇ రంగంలో పోటీతత్వం పెంచడమే లక్ష్యంగా సిడ్బిఐ పనిచేస్తుంది. వీటితో పాటు పరిశ్రమలకు రీఫైనాన్సు సదుపాయలు కల్పించడం, నేరుగా స్వల్పకాలిక రుణాలు అందించడం, దీర్ఘకాలిక ఫైనాన్స్ అవసరాలు తీర్చడం వంటి కార్యక్రమాలతో కస్టమర్ స్నేహపూర్వక సంస్థగా సిడ్బిఐ పేరుగాంచింది.
సిడ్బిఐ యొక్క పారదర్శక సంస్థాగత శిక్షణ మరియు అభివృద్ధి ఫ్రేమ్‌వర్క్ ద్వారా సమర్ధవంతమైన మానవ వనురుల నియమించేందుకు,వారి సామర్థ్యాలను పెంపొందించి సమర్ధవంతమైన సిబ్బందిగా మార్చేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది.