ఇండియన్ రైల్వేలో గేట్ మ్యాన్, అసిస్టెంట్ పాయింట్స్‌మన్, పోర్టర్ / హమల్ / స్వీపర్ కమ్ పోర్టర్, ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ IV, హాస్పిటల్ అటెండెంట్ మరియు వివిధ విభాగాలకు చెందే హెల్పర్లను నియమించేందుకు ఆర్‌ఆర్‌బి గ్రూపు D ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. టెన్త్ మరియు ఐటీఐ విద్యా అర్హుతతో భర్తీచేసే ఈ పోస్టులకు నిరుద్యోగ ఆశావాహులు భారీయెత్తున పోటీపడతారు. నియామక ప్రక్రియ రాతపరీక్ష మరియు ఫీజికల్ ఎఫిసెన్సీ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది.
నియామక బోర్డు | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు |
నియామక పరీక్షా | గ్రూపు D ఎగ్జామినేషన్ |
ఎంపిక ప్రక్రియ | రాతపరీక్ష/PET |
ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ | టెన్త్/ఐటీఐ |
వయో పరిమితి | 18 - 31 ఏళ్ళ మధ్య |
ఆర్‌ఆర్‌బి గ్రూపు డీ ఎలిజిబిలిటీ
- జాతీయత : ఇండియా/నేపాల్/భూటాన్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. 1 జనవరి 1962 ముందు భారత్ వచ్చి స్థిరపడిన టిబెటియన్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. భారతీయ మూలాలు కలిగి పాకిస్తాన్, బర్మా, శ్రీలంకా, తూర్పు ఆఫ్రికా దేశాలు కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ టాంజానియా (పూర్వం టాంగన్యికా మరియు జాంజిబార్), జాంబియా, మాలావి, జైర్, ఇథియోపియా మరియు వియత్నాం దేశాల నుండి శాశ్వతంగా భారత్ లో స్థిరపడేందుకు వచ్చే భారతీయ సంతతి కూడా అర్హులు.
- వయోపరిమితి: వివిధ పోస్టులను అనుసరించి 18 నుండి 31 ఏళ్ళ మధ్య వయస్సు ఉండే అభ్యర్థులు దరఖాస్తు చెయ్యొచ్చు. ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా 3 ఏళ్ళ వయోపరిమితి సడలింపు ఉంటుంది. షెడ్యూల్డ్ కులాల వారికీ గరిష్టంగా 5 ఏళ్ళు, వికలాంగులకు 10 ఏళ్ళు సడలింపు కల్పిస్తారు.
- విద్య అర్హుత : టెన్త్ ఐటీఐ, ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ఉత్తీర్ణతయినా అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
- ఫీజికల్ ప్రమాణాలు: ఆర్‌ఆర్‌బి రిక్రూట్మెంట్ బోర్డు నియామక నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాంగా ఉండాలి.
దరఖాస్తు ఫీజు | |
---|---|
జనరల్ కేటగిరి అభ్యర్థులు | 500/- |
మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, వికలాంగులు, ESM అభ్యర్థులు | 250/- |
ఆర్‌ఆర్‌బి గ్రూపు డీ దరఖాస్తు ప్రక్రియ
అర్హుత ఉన్న అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్'లో పొందిపర్చిన విదంగా బోర్డు అడిగిన వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు పారంభించే ముందు అవసరమయ్యే వివరాల్ని అందుబాటులో పెట్టుకోండి. పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి.
పోస్టు ఎంపిక, పరీక్షా కేంద్ర ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి. అప్లోడ్ చేసే ధ్రువపత్రాలు బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేశాక అందుబాటులో ఉండే పేమెంట్ మార్గం ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి. దరఖాస్తు రుసుము చెల్లించని అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోబడవు.
జోన్స్ వారీగా ఆర్‌ఆర్‌బి సమాచారం | |
---|---|
Ahmedabad www.rrbahmedabad.gov.in Phone : 079-22940858 | Jammu Srinagar www.rrbjammu.nic.in Phone : 0191-2476757 |
Ajmer www.rrbajmer.gov.in Phone: 0145 – 2425230 | Kolkata www.rrbkolkata.gov.in Phone: 033 – 25430108 |
Allahabad www.rrbald.nic.in Phone : 0532-2224531 | Malda www.rrbmalda.gov.in Phone : 03512-264567 |
Bangalore www.rrbbnc.gov.in Phone: 080 – 23330378 | Mumbai www.rrbmumbai.gov.in Phone : 022-23090422 |
Bhopal www.rrbbpl.nic.in Phone : 0755-2746660 | Muzaffarpur www.rrbmuzaffarpur.gov.in Phone : 0621-2213405 |
Bhubaneswar www.rrbbbs.gov.in Phone : 0674-2303015 | Patna www.rrbpatna.gov.in Phone: 0612-2677680 |
Bilaspur www.rrbbilaspur.gov.in Phone : 07752-247291 | Ranchi www.rrbranchi.gov.in Phone : 0651-2462429 |
Chandigarh www.rrbcdg.gov.in Phone: 0172 – 2730093 | Secunderabad www.rrbsecunderabad.nic.in Phone : 040-27821663 |
Chennai www.rrbchennai.gov.in Phone : 044-28275323 G | Siliguri www.rrbsiliguri.org Phone : 0353-2663840 |
orakhpur www.rrbgkp.gov.in Phone : 0551-2201209 | Guwahati www.rrbguwahati.gov.in Phone: 0361 – 2540815 |
Thiruvanthapuram www.rrbthiruvananthapuram.gov.in Phone : 0471-2323357 |
ఆర్‌ఆర్‌బి గ్రూపు డీ ఎగ్జామ్ నమూనా
గ్రూపు డి నియామక ప్రక్రియ మూడు దశల్లో పూర్తిచేస్తారు. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఉంటుంది. ఇందులో మెరిట్ సాధించిన అభ్యర్థులకు రెండవ దశలో ఫీజికల్ ఎఫిసెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. పిఈటీ లో అర్హుత పొందిన అభ్యర్థులకు చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిపి విధుల్లోకి తీసుకుంటారు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
పరీక్షా ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ పద్దతిలో జరుగుతుంది. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్, జనరల్ సైన్స్ & ఇంజనీరింగ్ మరియు జనరల్ అవెర్నెస్ & కరెంటు అఫైర్స్ అంశాలకు సంబంధించి 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. సరైన సమాధానము గుర్తించిన ప్రశ్నలకు 1 మార్కు, తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు -0.25 మార్కులు కేటాయిస్తారు. పరీక్షా వ్యవధి 90 నిముషాలు.
ఈ పరీక్షలో కేటగిరి వారీగా అర్హుత మార్కులు కేటాయించారు. జనరల్ కేటగిరి అభ్యర్థులు 40% కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓబీసీ మరియు ఎస్సీ అభ్యర్థులు 30%, ఎస్టీ అభ్యర్థులు 25% అర్హుత మార్కులు పొందడం తప్పనిసరి.
గ్రూపు డి సీబీటీ పరీక్షా విధానం | |||
---|---|---|---|
సిలబస్ | ప్రశ్నలు (100) | మార్కులు (100) | సమయం |
మ్యాథమెటిక్స్ | 25 | 25 | 90 నిముషాలు |
జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్ | 25 | 25 | |
జనరల్ సైన్స్ & ఇంజనీరింగ్ | 40 | 40 | |
జనరల్ అవెర్నెస్ & కరెంటు అఫైర్స్ | 10 | 10 |
ఆర్‌ఆర్‌బి గ్రూపు డీ సిలబస్
Mathematics Number system: BODMAS, Decimals, Fractions, LCM, HCF, Ratio and Proportion, Percentages, Mensuration, Time and Work; Time and Distance, Simple and Compound Interest, Profit and Loss, Algebra, Geometry and Trigonometry, Elementary Statistics, Square root, Age Calculations, Calendar & Clock, Pipes & Cistern etc.
General Intelligence and reasoning Analogies: Alphabetical and Number Series, Coding and Decoding, Mathematical operations, Relationships, Syllogism, Jumbling, Venn Diagram, Data Interpretation and Sufficiency, Conclusions and Decision making, Similarities and Differences, Analytical Reasoning, Classification, Directions, Statement – Arguments and Assumptions etc.
General Science : The syllabus under this shall cover Physics, Chemistry and Life Sciences of 10 standard level.
General Awareness on current affairs : Science & Technology, Sports, Culture, Personalities, Economics, Politics and any other subjects of importance.
ఫీజికల్ ఎఫిసెన్సీ టెస్ట్ (PET )
సీబీటీలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఫీజికల్ ఎఫిసెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఖాళీ ఉన్న పోస్టుల సంఖ్యకు రెండు రేట్లు మంది అభ్యర్థులను PET కు ఎంపికచేస్తారు. ఫీజికల్ ఎఫిసెన్సీ టెస్టులో భాగంగా ఈ క్రింది శారీరక సామర్ధ్య పరీక్షలు నిర్వహిస్తారు.
గ్రూపు డి ఫీజికల్ ఎఫిసెన్సీ టెస్ట్ (PET ) | |
---|---|
పురుష అభ్యర్థులు | మహిళా అభ్యర్థులు |
35 కిలోల బరువును కింద పడేయకుండా 2 నిముషాల వ్యవధిలో 100 మీటర్ల పరుగు పూర్తిచేయాలి. | 20 కిలోల బరువును కింద పడేయకుండా 2 నిముషాల వ్యవధిలో 100 మీటర్ల పరుగు పూర్తిచేయాలి. |
4.15 నిముషాల్లో 1000 మీటర్ల పరుగు | 5.40 నిముషాల్లో 1000 మీటర్ల పరుగు |
డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఎంపిక విధానం
ఫీజికల్ ఎఫిసెన్సీ టెస్టులో అర్హుత సాధించిన అభ్యర్థులకు చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఖాళీ ఉన్న పోస్టుల సంఖ్యకు 50% అదనపు అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అభ్యర్థులు రెండు ఫోటో కాపీలతో పాటుగా అవసరమయ్యే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరవ్వాల్సి ఉంటుంది.
వివిధ దశల్లో సీబీటీకి హాజరైన అభ్యర్థుల మార్కులను నార్మలైజషన్ ప్రక్రియ ద్వారా గణించి కేటగిరి వారి మెరిట్ లిస్టును తయారు చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం చివరి షార్ట్ లిస్ట్ రూపొందించి ఎంపికైన జాబితాను విడుదల చేస్తారు.