ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్
Universities

ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఆన్‌లైన్ అడ్మిషన్స్ 2020-21

ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఈ ఏడాది తొలిసారిగా ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్ ప్రక్రియకు స్వీకారం చుట్టింది. కోవిడ్ 19 కారణంగా అతలాకుతలమైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు 30 శాతం సిలబస్ కోతతో ఈ ఏడాది ఇంటర్మీడియేట్ విద్యను అందివ్వనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిస్థాయి సిలబస్ కూడా అందుబాటులో ఉంచింది. ఇందులో భాగంగా అక్టోబరు 21 నుండి 29 వరకు ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైటు (www.bie.ap.gov.in/ApplRegPrerequisites.do) ద్వారా ఆన్‌లైన్ అడ్మిషన్ ప్రక్రియ జరిపేందుకు సిద్ధమౌతోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసినట్లు ఏపీ ఇంటర్ బోర్డు సెక్రటరీ వి. రామకృష్ణ మీడియాకు తెలిపారు.

Advertisement

ఆన్‌లైన్ అడ్మిషన్స్ ప్రక్రియ : ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2020-21 విద్య సంవత్సరానికి గాను రెండేళ్ల ఇంటర్మీడియట్ ప్రవేశాలను ఆన్‌లైన్ ద్వారా చేపట్టనుంది. పది ఉత్తీర్ణతయిన విద్యార్థులు ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైటు (www.bie.ap.gov.in/ApplRegPrerequisites.do) ద్వారా అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి జనరల్ కేటగిరి అభ్యర్థులు 200/- మరియు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 100/- దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ సందేహాలు నివృత్తి చేసుకునేందుకు18002749868 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచారు.

కావాల్సిన ధ్రువపత్రాలు : ఆన్‌లైన్ అడ్మిషన్ కు ఈ క్రింది ధ్రువపత్రాలో హాజవ్వాల్సి ఉంటుంది. కోవిడ్ కారణంగా గత ఏడాది 10 వ తరగతి విద్యార్థులు అందరిని ఉత్తీర్ణత చేయడం వలన ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇంతకముందులా కాకుండా ఒక సెక్షనకు గరిష్టంగా 40 మంది విద్యార్థులు ఉండేలా పరిమితి విధించారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అందిస్తున్న ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఆర్ట్స్ గ్రూపుతో కలుపుకుని గరిష్టంగా 9 సెక్షన్లు మాత్రమే నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది.

  • 10 వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్
  • విద్యార్థి ఆధార్ కార్డు
  • పేరెంట్ /గార్డియన్ మొబైల్ నెంబర్ & ఇమెయిల్ ఐడీ
  • దరఖాస్తు రుసుము/డెబిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్
  • ఇతర వ్యక్తిగత, చిరునామా & ఎడ్యుకేషన్ సమాచారం అందుబాటులో ఉంచుకోండి

దరఖాస్తు ప్రక్రియ : ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 21 నుండి 25 సాయంత్రం 5 గంటల వరకు ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైటు (www.bie.ap.gov.in/ApplRegPrerequisites.do) ద్వారా అందుబాటులో ఉంటుంది. అర్హుతున్న విద్యార్థులు ఈ గడువులోపు దగ్గరలో ఉండే ఇంటర్నెట్ లేదా వ్యక్తిగత కంప్యూటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం స్టెప్ బై స్టెప్ తెలుసుకునేందుకు ఈ క్రింది ఇమేజ్ గమనించగలరు.

ap inter online admission Registration

Advertisement