ఏపీ లిమిటెడ్ డీఎస్సీ 2022 నోటిఫికేషన్‌ | మొత్తం ఖాళీలు 502
APPSC Latest Jobs

ఏపీ లిమిటెడ్ డీఎస్సీ 2022 నోటిఫికేషన్‌ | మొత్తం ఖాళీలు 502

ఏపీ ప్రభుత్వం వివిధ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి లిమిటెడ్ డీఎస్సీ 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నియామక ప్రకటన ద్వారా వివిధ టీచింగ్ విభాగాల్లో 502 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ జాబితాలో జెడ్పీ, ఎంపీపీ స్కూల్స్‌లో 199 పోస్టులు, మోడల్ స్కూల్స్‌లో 207 పోస్టులు ,మున్సిపల్ స్కూల్స్‌లలో 15 పోస్టులు మరియు స్పెషల్ ఎడ్యూకేషన్ సంబంధింది 81 పోస్టులు ఉన్నాయి.

Advertisement

ఖాళీ ఉన్న పోస్టుల జాబితాలో స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, మ్యూజిక్‌ ఉపాధ్యాయులు, ఆర్ట్‌ ఉపాధ్యాయులు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (స్కూల్‌ అసిస్టెంట్స్‌), ఏపీ మోడల్‌ స్కూల్స్‌, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీల పోస్టులు ఉన్నాయి.

లిమిటెడ్ డీఎస్సీ సంబంధించి ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న పరీక్ష నిర్వహించనున్నారు. నవంబర్ 4న ఫలితాలు విడుదల చేయనున్నారు. నియామక ప్రక్రియలో టెట్ మార్కెలకు 20 శాతం వెయిటేజ్ కేటయించనున్నారు.

జిల్లాలు & పాఠశాలల వారీగా డీఎస్సీ ఖాళీలు

జిల్లా జెడ్పీ /ఏంపీపీ మున్సిపల్ స్పెషల్ టీచర్లు
శ్రీకాకుళం 61 02 04
విజయనగరం 06 0 07
విశాఖపట్నం 13 0 06
తూర్పు గోదావరి 08 0 06
పశ్చిమ గోదావరి 16 02 06
కృష్ణా 02 02 07
గుంటూరు 03 01 06
ప్రకాశం 04 0 06
నెల్లూరు 0 0 09
చిత్తూరు 27 0 05
వైఎస్ఆర్ 11 04 07
అనంతపురం 13 03 10
కర్నూలు 35 01 02

మోడల్ స్కూళ్ల యందు ఖాళీలు

జోన్ పీజీటీ టీజీటీ మొత్తం
జోన్  I 55 07 62
జోన్  II 04 0 04
జోన్  III 41 07 48
జోన్  IV 76 17 93

ఏపీ లిమిటెడ్ డీఎస్సీ షెడ్యూల్ 2022

దరఖాస్తు ప్రారంభం 25 ఆగష్టు 2022
దరఖాస్తు తుది గడువు 18 సెప్టెంబర్ 2022
మాక్ టెస్టులు 17 అక్టోబర్ 2022
హాల్ టికెట్ 06 అక్టోబర్  2022
పరీక్ష తేదీలు 23 అక్టోబర్ 2022 (O/W)
తుది ఫలితాలు 04 నవంబర్ 2022

టెట్ మార్కెలకు 20 శాతం వెయిటేజీ

టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు 20 టెట్ మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నారు. నియామక ప్రక్రియ వివిధ రిజర్వేషన్ల కోటా, మరియు అందుబాటులో ఉన్న పోస్టుల ఖాళీలు ఆధారంగా నిర్వహిస్తారు.

డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ప్రక్రియలో www.apdsc.apcfss.in లేదా www.cse.ap.gov.in వెబ్సైట్లు ద్వారా 25 ఆగష్టు 2022 నుండి దరఖాస్తు చేసుకోవాలి.  అభ్యర్థుల వయస్సు 18 నుండి 44 ఏళ్ళ మధ్య ఉండాలి. నియామక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా నిర్వహిస్తారు.

Advertisement

Post Comment