టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ 2022
Latest Jobs TSPSC

టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ 2022

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ద్వారా 16 సబ్జెక్టులకు సంబంధించి 1392 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. వీటిలో అత్యధికంగా గణితంకు సంబంధించి 154 పోస్టులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 153 పోస్టులు ఉన్నాయి.

జూనియర్ లెక్చరర్ల నియామకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియను 16 డిసెంబర్ నుండి జనవరి 06వ తేదీల మధ్య చేపట్టనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆయా తేదీల్లో టీఎస్పీఎస్సీ అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ల ఖాళీలు

ఖాళీ పోస్టులను కమ్యూనిటీ వారీగా, వివిధ కోటాల వారీగా మరియు మల్టీ జోనల్ వారీగా భర్తీ చేస్తారు.

అరబిక్ - 2 పోస్టులు హిందీ - 117 పోస్టులు
బోటనీ - 113 పోస్టులు హిస్టరీ - 77 పోస్టులు
బోటనీ (ఉర్దూ) - 15 పోస్టులు హిస్టరీ (ఉర్దూ) - 17 పోస్టులు
కెమిస్ట్రీ - 113 పోస్టులు హిస్టరీ (మరాఠీ) - 1 పోస్టు
కెమిస్ట్రీ (ఉర్దూ) - 19 పోస్టులు గణితం - 154 పోస్టులు
సివిక్స్ - 56 పోస్టులు గణితం (ఉర్దూ) - 9 పోస్టులు
సివిక్స్ (ఉర్దూ) - 16 పోస్టులు ఫిజిక్స్ - 112 పోస్టులు
సివిక్స్ (మరాఠీ) - 1 పోస్టు ఫిజిక్స్ (ఉర్దూ) - 18 పోస్టులు
కామర్స్ - 50 పోస్టులు సంస్కృతం - 10 పోస్టులు
కామర్స్ (ఉర్దూ) - 7 పోస్టులు తెలుగు - 60 పోస్టులు
ఎకనామిక్స్ - 81 పోస్టులు ఉర్దూ - 28 పోస్టులు
ఎకనామిక్స్ (ఉర్దూ) - 15 పోస్టులు జువాలజీ - 128 పోస్టులు
ఇంగ్లీష్ - 153 పోస్టులు జువాలజీ (ఉర్దూ) - 18 పోస్టులు
ఫ్రెంచ్ - 2 పోస్టులు మొత్తం - 1392 ఖాళీలు

టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
  • డిస్టెన్స్ మరియు ఓపెన్ డిగ్రీ ద్వారా పీజీ పూర్తిచేసిన వారు యూజీసీ గుర్తింపు పొందిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
  • ఉర్దూ మీడియం పోస్టులకు దరఖాస్తు చేసేవారు 1 నుండి 10 వరకు సంబంధిత మీడియంలో ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి.
  • అభ్యర్థుల వయస్సు 18 నుండి 44ఏళ్ళ మధ్య ఉండాలి. కమ్యూనిటీ కోటా పరిధిలో వయోపరిమితి సడలింపు ఉంటుంది.

టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ 2022 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభం 16 డిసెంబర్ 2022
దరఖాస్తు తుది గడువు 06 జనవరి 2023
హాల్ టికెట్ జూన్/జులై 2023
ఎగ్జామ్ తేదీ జూన్/జులై 2023
ఫలితాలు సెప్టెంబర్ 2023

టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ దరఖాస్తు ఫీజు

దరఖాస్తు రుసుము డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ విధానంలో అందుబాటులో ఉంటుంది. పరీక్ష రుసుము చెల్లించిన దరఖాస్తులు మాత్రమే పరిగణంలోకి తీసుకోబడతాయి.

ఫీజు జనరల్ అభ్యర్థులు నిరుద్యోగులు
అప్లికేషన్ ఫీజు 200/- 200/-
ఎగ్జామ్ ఫీజు 120/- మినహాయింపు

టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ దరఖాస్తు విధానం

జూనియర్ లెక్చరర్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ఓటీపీఆర్ ఐడీ ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐడీ లేని వారు కొత్తగా ఓటిపీఆర్ ఐడీ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ మరియు ఇతర సంబంధిత సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలి.

టీఎస్పీఎస్సీ పోర్టల్ యందు ఉన్న జూనియర్ లెక్చరర్ లింక్ ఉపయోగించించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. మొదటిగా ఓటిపిఆర్ మరియు పుట్టిన తేదీ వివరాలు పొందుపర్చగానే అభ్యర్థుల డేటా లోడ్ అవుతుంది.

అందులో ఇదివరకే మీరు పొందుపర్చిన వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు మరోమారు సరిచూసుకుని, అవసరమయ్యే ఇతర అవసరాలను అందించాల్సి ఉంటుంది. అదే సమయంలో  దరఖాస్తు చేస్తున్న పోస్టు మరియు ఎగ్జామ్ సెంటర్ వివరాలు అందించాల్సి ఉంటుంది. చివరిగా దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా ఈ ప్రక్రియ పూర్తివుతుంది.

టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్ సెంటర్లు

  • హైదరాబాద్
  • కరీంనగర్
  • ఖమ్మం
  • హనుమకొండ
  • నిజామాబాద్

టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్ నమూనా

టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్ పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్దతిలో నిర్వహించనున్నారు. రాతపరీక్ష రెండు అంచెలలో పేపర్ I, పేపర్ II లుగా జరుపుతారు. పేపర్ I యందు జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీ సంబంధించి 150 ప్రశ్నలు ఇవ్వబడతయి. సరైన జవాబు చేసిన ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు.

పేపర్ II అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు సంబంధించి ఉంటుంది. ఇందులో మొత్తం 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వబడతయి. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 2 మార్కులు కేటాయిస్తారు. పేపర్ I ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో నిర్వహిస్తారు. పేపర్ II లో లాంగ్వేజ్ సబ్జెక్టులు మినహాహించి, మిగతా అన్ని పేపర్లు ఇంగ్లీష్ భాషలో నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు 2.30 గంటల సమయం కేటాయిస్తారు.

పేపర్ పేరు సబ్జెక్టు / సిలబస్ ప్రశ్నలు & మార్కులు సమయం
పేపర్ I జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు (150 మార్కులు) 2.30 గంటలు
పేపర్ II స్పెషలైజెడ్ సబ్జెక్టు 150 ప్రశ్నలు (300 మార్కులు) 2.30 గంటలు

టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ ఎంపిక ప్రక్రియ

టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ల నియామక ప్రక్రియ రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారితంగా ఉంటుంది. రాతపరీక్షలో అర్హుత పొందిన అభ్యర్థులను పోస్టుల ఖాళీల వారీగా, జోన్ల వారీగా, కమ్యూనిటీ వారీగా, ఇతర రిజర్వేషన్ కోటాల వారీగా షార్ట్ లిస్టు రూపొందిస్తారు. షార్ట్ లిస్ట్ చేయబడ్డ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపి తుది ఎంపిక చేపడతారు.

టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ పేపర్ I సిలబస్

1. Current affairs – Regional, National and International.
2. International Relations and Events.
3. General Science; India’s Achievements in Science and Technology.
4. Environmental issues; Disaster Management- Prevention and Mitigation
Strategies.
5. Economic and Social Development of India and Telangana.
6. Physical, Social and Economic Geography of India.
7. Physical, Social and Economic Geography and Demography of Telangana.
8. Socio-economic, Political and Cultural History of Modern India with special
emphasis on Indian National Movement.
9. Socio-economic, Political and Cultural History of Telangana with special
emphasis on Telangana Statehood Movement and formation of Telangana
state.
10.Indian Constitution; Indian Political System; Governance and Public Policy.
11.Social Exclusion; Rights issues such as Gender, Caste, Tribe, Disability etc. and
inclusive policies.
12.Society, Culture, Heritage, Arts and Literature of Telangana.
13.Policies of Telangana State.
14.Logical Reasoning; Analytical Ability and Data Interpretation.
15.Basic English (10th class Standard).

Post Comment