తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 17, 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 17, 2023

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 17, 2023. జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు తాజా సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఇవి రూపొందించబడ్డాయి.

విశ్వకర్మ యోజన కింద 8 శాతం వడ్డీ రాయితీ రుణాలు

విశ్వకర్మ యోజన కింద రుణాలకు 8% సబ్సిడీని అందించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ప్రకటించారు. ఇటీవలే ప్రధాని మంత్రి ప్రారంభించిన విశ్వకర్మ యోజన కింద చేతి వృత్తిదారులు మరియు సాంప్రదాయ కళాకారులకు 5% వడ్డీ రేటుతో పూచీకత్తు రహిత రుణాలను ప్రభుత్వం ఆఫర్ చేస్తుంది. తాజాగా ఈ యోజన కింద రుణాలకు ప్రభుత్వం మరో 8% వరకు వడ్డీ రాయితీని కూడా అనివ్వనున్నట్లు ప్రకటించారు.

ఈ పథకం వడ్రంగి, స్వర్ణకారులు, కమ్మరి, తాపీ మేస్త్రీ, శిల్పులు, బార్బర్ మరియు పడవ తయారీదారులతో సహా 18 రకాల సంప్రాదయ కళాకారులకు అందిస్తున్నారు. ఈ పథకం కింద వీరికి 3 లక్షల వరకు రుణాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. మొదట 18 నెలల నిడివితో లక్ష రూపాయల రుణం ఇవ్వబడుతుంది. దీనిని తిరిగి చెల్లించిన లబ్దిదారులు అదనంగా మరో రెండు లక్షల రూపాయల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది.

సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని యశోభూమిలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్‌లో ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కోసం 2023-24 బడ్జెట్‌లో 13,000 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 10 లక్షల మంది హస్తకళాకారులు మరియు సాంప్రదాయ కళాకారులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా.

రాయ్‌పూర్‌లో జీ20 ఫ్రేమ్‌వర్క్ వర్కింగ్ గ్రూప్ చివరి సమావేశం

భారత G20 ప్రెసిడెన్సీలో G20 ఫ్రేమ్‌వర్క్ వర్కింగ్ గ్రూప్ యొక్క నాల్గవ మరియు చివరి సమావేశం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో సెప్టెంబర్ 18-19, 2023 మధ్య నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రిత్వ శాఖ సలహాదారులు చాందినీ రైనా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జీ20 సభ్యులు మరియు ఆహ్వానిత దేశాలు మరియు వివిధ అంతర్జాతీయ మరియు ప్రాంతీయ సంస్థల నుండి 65 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సమావేశం తాజా ప్రపంచ ఆర్థిక దృక్పథం మరియు కీలక స్థూల ఆర్థిక సమస్యలకు సంబంధించి విధాన మార్గదర్శకాలపై చర్చలను సులభతరం చేస్తుంది. ఈ సమావేశం సందర్భంగా, డిజిటల్ బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌పై ప్యానెల్ చర్చలు జరిగాయి.

10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ఎలవెనిల్ వలరివన్‌కు బంగారు పథకం

బ్రెజిల్‌లోని రియో ​​డి జనీరోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2023లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ఎలవెనిల్ వలరివన్ బంగారు పతకాన్ని సాధించింది. ఫైనల్‌లో తన 24 షాట్ల సిరీస్‌లో 252.2 షాట్ చేసి ఫ్రాన్స్‌కు చెందిన ఓసియన్ ముల్లర్ (251.9)ను తృటిలో ఓడించింది.

మొత్తం ఎనిమిది మంది షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించగా ఎలవెనిల్ వలరివన్  విజేతగా నిలిచింది. ఇది ఎలవెనిల్ వలరివన్‌కి రెండో వ్యక్తిగత ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ పతకం. అంతకుముందు ఎలవెనిల్ వలరివన్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో 630.5తో 9వ స్థానంలో నిలిచింది. బ్రెజిల్ నగరంలో కొనసాగుతున్న ఈవెంట్ తర్వాత దశ నవంబర్ 18 నుండి 27 వరకు ఖతార్‌లోని దోహాలో షెడ్యూల్ చేయబడుతుంది.

ప్రధాని మోదీ 73వ జయంతి సందర్భంగా ‘సేవా పఖ్వాడా’ కార్యక్రమం

ప్రధాని నరేంద్ర మోదీ 73వ జయంతి సందర్భంగా బీజేపీ పార్టీ ‘నమో’ యాప్‌లో ‘సేవా పఖ్వాడా’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో పౌరులు పాల్గొని ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 17న ఆయన పుట్టిన రోజున ప్రారంభమై అక్టోబర్ 2న గాంధీ జయంతితో ముగుస్తుంది.

సేవా పఖ్వాడా సమయంలో, బిజెపి కార్యకర్తలు మరియు వాలంటీర్లు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. వీటిలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం, పేదలకు ఆహారం మరియు దుస్తులు పంపిణీ చేయడం, చెట్లు నాటడం, బహిరంగ ప్రదేశాలను శుభ్రపరచడం, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించడం వంటివి ఉన్నాయి. సేవా పఖ్వాడా కోసం బిజెపి ప్రత్యేక వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించింది.

అరుణాచల్ ప్రదేశ్‌లో శ్రామిక్ కళ్యాణ్ యోజన ప్రారంభం

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఇటానగర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ' ముఖ్యమంత్రి శ్రామిక్ కళ్యాణ్ యోజన' అనే కొత్త పథకాన్ని ప్రకటించారు. జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ ప్రకటన చేశారు. అరుణాచల్ ప్రదేశ్ బిల్డింగ్ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో నమోదైన కార్మికులకు ఈ పథకం అందిస్తారు.

ఈ పథకం కింద, కార్మికుల కుటుంబాలకు ప్రసూతి ప్రయోజన కింద ప్రస్తుతం ఇస్తున్న 1,000 రూపాయల సాయాన్ని 6,000 పెంచారు. అలానే సహజ మరణ పరిహారం 50,000 రూపాయల నుండి 2 లక్షల రూపాయల వరకు మరియు ప్రమాద మరణ పరిహారం 1 లక్ష రూపాయల నుండి 4 లక్షల రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

కార్మికుల పిల్లల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు, ఈ పథకం కింద ఏదైనా రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లేదా పోటీలో బంగారు పతకం సాధించిన వారికీ 15,000 రూపాయలు, వెండికి 10,000 రూపాయలు మరియు కాంస్యానికి 8,000 రూపాయల నగదు ప్రోత్సాహకాలు అందిస్తారు. అలానే జాతీయ స్థాయిలో బంగారు పతాకానికి 30,000 రూపాయలు, వెండి 20,000 రూపాయలు, కాంస్యానికి 15,000 రూపాయలు ఈ పథకం కింద అందజేస్తారు.

పంజాబ్‌లో అవశేషాలు లేని బాస్మతి రైస్ పైలట్ ప్రాజెక్టు

పంజాబ్ ప్రభుత్వం అమృత్‌సర్ జిల్లాలోని చోగావాన్ బ్లాక్‌లో అవశేషాలు లేని బాస్మతి వరి సాగును పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది. రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మరియు వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద, రసాయనాలు ఉపయోగించకుండా బాస్మతి వరిని ఎలా పండించాలో రైతులకు శిక్షణ మరియు సహకారం అందించబడుతుంది. ఆర్గానిక్ ఇన్‌పుట్‌లు మరియు పరికరాలను కొనుగోలు చేయడానికి వారికి ఆర్థిక సహాయం కూడా అందించబడుతుంది.

ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమవుతుందని, భవిష్యత్తులో రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలను కవర్ చేసేలా దీనిని విస్తరించవచ్చని పంజాబ్ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇది పంజాబ్‌లో వ్యవసాయం యొక్క పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి మరియు రాష్ట్రంలో ఉత్పత్తి చేయబడిన బాస్మతి బియ్యం నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

రాష్ట్రంలో సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పంజాబ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ కూడా భాగం. వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది పంజాబ్‌లోని నేల మరియు నీటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.

డేవిస్ కప్‌కి వీడ్కోలు పలికిన రోహన్ బోపన్న

రోహన్ బొప్పన డేవిస్ కప్‌కి వీడ్కోలు పలికాడు. బొప్పన తన చివరి డేవిస్ కప్‌కు విజేత నోట్‌తో వీడ్కోలు చెప్పాడు. ప్టెంబర్ 17, 2023న లక్నోలో జరిగిన వరల్డ్ గ్రూప్ II టైలో భారతదేశం 4-1తో మొరాకోను చిత్తు చేయడంతో విజేతగా నిలిచాడు. తన 18వ మరియు చివరి డేవిస్ కప్ టైలో ఆడుతున్న బోపన్న, యుకీ భాంబ్రీతో జోడీ కట్టి, డబుల్స్ మ్యాచ్‌లో మొరాకో జోడీ ఇలియట్ బెంచెట్రిట్ మరియు యూనెస్ లాలామి లారౌసీని 6-2, 6-1తో ఓడించాడు. దీంతో టైలో భారత్ 3-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.

మ్యాచ్ అనంతరం విజయాంత్ ఖండ్ మినీ స్టేడియంలో బోపన్నకు ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. డేవిస్ కప్ నుండి అతని రిటైర్మెంట్ గుర్తుగా ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (AITA) అతనికి ప్రత్యేక జ్ఞాపికను కూడా అందజేసింది. 43 ఏళ్ల బోపన్న గత రెండు దశాబ్దల కాలంగా భారత డేవిస్ కప్ జట్టుకు ప్రధాన ఆధారం. అతను డేవిస్ కప్‌లో భారతదేశం తరపున రికార్డు స్థాయిలో 29 డబుల్స్ మ్యాచ్‌లు గెలిచాడు. 2017 ప్రపంచ గ్రూప్ ప్లేఆఫ్‌లలో భారతదేశం విజయంలో కీలక పాత్ర పోషించాడు.

పురుషుల టెన్నిస్‌లో డేవిస్ కప్ అనేది ప్రీమియర్ ఇంటర్నేషనల్ టీమ్ ఈవెంట్. ఇది అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్యచే నిర్వహించబడుతుంది. 140 దేశాల జట్ల మధ్య ప్రతి సంవత్సరం ఈ పోటీ నిర్వహించబడుతుంది. దీనిని నిర్వాహకులు "వరల్డ్ కప్ ఆఫ్ టెన్నిస్"గా అభివర్ణిస్తారు. విజేతలను ప్రపంచ ఛాంపియన్లుగా పేర్కొంటారు. ఇది 1990 నుండి ఇప్పటి వరకు 32 సార్లు నిర్వహించబడుతుంది. బోపన్న 21 ఏళ్ళు ఈ ఈవెంట్ యందు ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు.

కుప్వారాలో ఫస్ట్ బ్యాచ్ సీఆర్పిఎఫ్  కోబ్రా కమాండోలు మోహరింపు

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన కోబ్రా కమాండోల మొదటి బ్యాచ్ జమ్మూ కాశ్మీర్ అడవుల్లో శిక్షణ పూర్తి చేసి కుప్వారా జిల్లాలో మోహరింపబడింది. మావోయిస్టు తిరుగుబాటుదారులతో పోరాడేందుకు 2009 లో రూపొందించిన కమాండో బెటాలియన్స్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) ను పర్వత ప్రాంతాలకు తరలించడం ఇదే తొలిసారి.

కోబ్రా కమాండోలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క ప్రత్యేక విభాగం. వీరు జంగిల్ వార్‌ఫేర్ కార్యకలాపాలను నిర్వహించడానికి శిక్షణ పొందుతారు. ఈ కమాండోలు అత్యాధునిక ఆయుధాలు మరియు సామగ్రిని కలిగి ఉంటారు. పోరాట నైపుణ్యాలలో అత్యున్నత శిక్షణ పొందిన సైనికులు వీరు. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు మరియు బందీలను రక్షించడంలో కూడా శిక్షణ పొంది ఉంటారు.

కుప్వారాలో కోబ్రా కమాండోలను మోహరించడం ఒక ముఖ్యమైన పరిణామం, ఇది ఈ ప్రాంతంలో భద్రతను పటిష్టం చేయడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని చూపిస్తుంది. కుప్వారా చాలా ఏళ్లుగా ఉగ్రవాదం బారిన పడిన సరిహద్దు జిల్లా. కోబ్రా కమాండోల మోహరింపు జిల్లాలో తీవ్రవాద హింసను తగ్గించడంలో మరియు స్థానిక జనాభా యొక్క భద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.

ఉక్రెయిన్ యుద్ధం నుండి భారత ఆర్మీకి సైనిక పాఠాలు

భారత సైన్యం ఉక్రెయిన్ యుద్ధం నుండి గుణపాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో యుద్ధాలకు సిద్ధం అవుతోంది. ఉక్రెయిన్ యుద్ధం నుండి భారత సైన్యం నేర్చుకుంటున్న కొన్ని కీలక పాఠాలలో సంయుక్త ఆయుధ కార్యకలాపాల యొక్క ప్రాముఖ్యత, ఆధునిక ఆయుధాలు మరియు పరికరాల అవసరం, సైబర్ మరియు స్పేస్ వార్‌ఫేర్ యొక్క ప్రాముఖ్యత, స్థితిస్థాపకత మరియు అనుకూలత యొక్క ఆవశ్యకత వంటి అంశాలు ఉన్నాయి.

ఉక్రెయిన్ యుద్ధం మిశ్రమ ఆయుధ కార్యకలాపాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేసింది. ఇందులో పదాతిదళం, కవచం, ఫిరంగి మరియు వైమానిక శక్తి వంటి వివిధ రకాల సైనిక దళాల సమన్వయ వినియోగం జరిగింది. భారత సైన్యం ఇప్పటికే తన సంయుక్త ఆయుధ సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది.

ఉక్రెయిన్ యుద్ధం ఆధునిక ఆయుధాలు మరియు పరికరాల ఆవశ్యకతను నొక్కి చెప్పింది. భారత సైన్యం ప్రస్తుతం ఆయుధాలు మరియు పరికరాల జాబితాను ఆధునికీకరిస్తోంది. ఇందులో రాఫెల్ ఫైటర్ జెట్‌లు మరియు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వంటి కొత్త ఆయుధ వ్యవస్థలను చేర్చడం కూడా జరుగుతుంది.

ఉక్రెయిన్ యుద్ధం నుండి నేర్చుకున్న మరో పాఠం డ్రోన్ల ప్రాముఖ్యత. రష్యా మరియు ఉక్రేనియన్ వైపులా యుద్ధంలో డ్రోన్‌లు ప్రధాన పాత్ర పోషించాయి. అందువల్ల భారత సైన్యం డ్రోన్‌లపై భారీగా పెట్టుబడులు పెడుతోంది మరియు వాటి ఉపయోగం కోసం కొత్త సిద్ధాంతాలు మరియు వ్యూహాలను అభివృద్ధి చేస్తోంది.

లాజిస్టిక్స్ ప్రాముఖ్యత గురించి ఉక్రెయిన్ యుద్ధం నుండి భారత సైన్యం కూడా నేర్చుకుంటుంది. రష్యా సైన్యం దాని రవాణా లోపాల కారణంగా ఉక్రెయిన్‌లో భారీ నష్టాలను చవిచూసింది. అందువల్ల భారత సైన్యం తన లాజిస్టిక్స్ సామర్థ్యాలను మెరుగుపరచుకోవడంపై దృష్టి సారిస్తోంది, తద్వారా సుదీర్ఘ యుద్ధాన్ని కొనసాగించే సామర్థ్యంను పెంపొందించుకోనుంది.

ఉక్రెయిన్ యుద్ధంలో సైబర్ మరియు స్పేస్ వార్‌ఫేర్ యొక్క ప్రాముఖ్యత కూడా హైలైట్‌గా నిలిచింది. ఈ డొమైన్‌లలో శత్రువులను అరికట్టడానికి మరియు ఎదుర్కోవడానికి భారతీయ సైన్యం సైబర్ మరియు అంతరిక్ష సామర్థ్యాలలో పెట్టుబడి పెడుతోంది. ఆధునిక యుద్ధంలో విజయం సాధించడానికి సైన్యాలు స్థితిస్థాపకంగా మరియు పరిస్థితులకు అనుకూలతను కలిగి ఉండాలని ఉక్రెయిన్ యుద్ధం చూపించింది. మారుతున్న యుద్దభూమి పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత సైన్యం తమ సైనికులకు మరింత దృఢంగా మరియు అనుకూలత కలిగి ఉండేలా శిక్షణ ఇస్తోంది.

పై పాఠాలతో పాటు, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా మరియు ఉక్రెయిన్ దళాలు ఉపయోగించిన వ్యూహాలు మరియు ఎత్తులను కూడా భారత సైన్యం అధ్యయనం చేస్తోంది. ఇది భారత సైన్యానికి తన స్వంత వ్యూహాలు మరియు భవిష్యత్ సంఘర్షణల కోసం సన్నద్ధత అయ్యేందుకు సహాయపడుతుంది.

Post Comment