తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 21 ఆగష్టు 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 21 ఆగష్టు 2023

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 21 ఆగష్టు 2023. జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు తాజా సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. ఇవి యూపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.

Advertisement

వెడ్డింగ్ టూరిజం ప్రచార కార్యకమాన్ని ప్రారంభించిన పర్యాటక శాఖ

వివాహాలకు ప్రధాన గమ్యస్థానంగా భారతదేశాన్ని బ్రాండ్ చేయడానికి వెడ్డింగ్ టూరిజం ప్రచారాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. "ఇన్‌క్రెడిబుల్ ఇండియా వెడ్డింగ్స్" పేరుతో ఈ ప్రచారాన్ని ఆగస్ట్ 20, 2023న పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రారంభించారు. భారతదేశంలో పెళ్లి చేసుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి జంటలను ఆకర్షించడం ఈ ప్రచారం లక్ష్యం.

భారతదేశ సంస్కృతి మరియు సంప్రదాయాల వైవిధ్యాన్ని, అలాగే అందుబాటులో ఉన్న వివిధ వివాహ వేదికలను హైలైట్ చేసేందుకు ఈ ప్రచారాన్ని ఉపయోగించుకొనున్నారు. ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మరియు సోషల్ మీడియాతో సహా అనేక రకాల ఛానెల్‌లలో ప్రచారం నిర్వహించబడుతుంది. వీటికి అదనంగా రోడ్‌షోలు మరియు ఈవెంట్‌లు కూడా నిర్వహిస్తున్నారు.

తమ వివాహాలకు ఎక్కువ మంది జంటలను భారతదేశానికి ఆకర్షించడంలో ఈ ప్రచారం విజయవంతమవుతుందని పర్యాటక మంత్రిత్వ శాఖ నమ్మకంగా ఉంది. ప్రత్యేకమైన మరియు చిరస్మరణీయమైన వివాహ అనుభవం కోసం చూస్తున్న జంటలకు పర్యాటక శాఖ ప్రత్యేకత ఆఫర్లు అందిస్తుంది.

ఇండోనేషియాలో భారతదేశ జన్ ఔషధి మాదిరి కేంద్రాలు

ఇండోనేషియా తన ప్రజలకు సరసమైన మరియు నాణ్యమైన ఔషధాలను అందుబాటులో ఉంచడానికి భారతదేశం యొక్క జన్ ఔషధి కేంద్ర నమూనాను అనుకరించాలని కోరుతోంది. ఇండోనేషియా ఆరోగ్య మంత్రి బుడి గునాడి సాదికిన్, ఈ మోడల్ గురించి మరింత తెలుసుకోవడానికి 2023 ఆగస్టు 20న గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని జన్ ఔషధి కేంద్రని సందర్శించారు.

నాణ్యమైన మందులను సరసమైన ధరలకు అందించడంలో జన్ ఔషధి కేంద్రల యొక్క సామర్థ్యంకు ఆయన ఆకర్షితులయ్యారు. ఇండోనేషియా తమ ప్రజలకు సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించడంలో సవాలును ఎదుర్కొంటోంది. ఈ సవాలులో ఔషధాల ధర ప్రధాన అంశం. సగటు ఇండోనేషియన్ వారి ఆదాయంలో దాదాపు 20% ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

జన్ ఔషధి కేంద్రల మోడల్ ఈ సవాలుకు మంచి పరిష్కారంగా ఆయన భావించారు. ఇండోనేషియా 2024 నాటికి దేశవ్యాప్తంగా 1,000 జన్ ఔషధి కేంద్రలను తెరవాలని యోచిస్తోంది. వైద్య పరికరాలు మరియు ఇతర ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను విక్రయించడానికి ఇదే నమూనాను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. జన్ ఔషధి కేంద్రలు బ్రాండెడ్ ఔషధాల ధరలో సగం ధరకు జెనరిక్ ఔషధాలను విక్రయించే ప్రభుత్వ ఫార్మసీలుగా భారత్ యందు సేవలు అందిస్తున్నాయి.

ఆసియా జూనియర్ స్క్వాష్‌లో అనాహత్ సింగ్‌కు స్వర్ణం

ఆసియా జూనియర్ స్క్వాష్ ఇండివిజువల్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-17 విభాగంలో భారతదేశానికి చెందిన అనాహత్ సింగ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్‌లో 15 ఏళ్ల అనాహత్ హాంకాంగ్‌కు చెందిన ఎనా క్వాంగ్‌ను 3-1తో ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్

శ్రీనగర్‌లోని ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్‌గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరింది. ఈ తోటలో రికార్డు స్థాయిలో 68 రకాల 1.5 మిలియన్ తులిప్స్ సాగు చేయబడుతున్నాయి. 30 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ గార్డెన్ 2007లో ప్రారంభించబడింది. ఇది జబర్వాన్ పర్వతాల దిగువ భాగంలో మరియు దాల్ సరస్సుకు సమీపంలో ఉంది.

తులిప్ గార్డెన్ శ్రీనగర్ లో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ప్రతి సంవత్సరం లక్షల మంది దీనిని సందర్శిస్తారు. తులిప్స్ పూర్తిగా వికసించే వసంతకాలంలో ఇది ప్రత్యేక ప్రాచుర్యం పొందింది. ఈ గార్డెన్ జమ్మూ మరియు కాశ్మీర్ ప్రభుత్వం మరియు తులిప్ కార్పొరేషన్ ఆఫ్ కాశ్మీర్ సంయుక్త చొరవ. దీనిని జమ్మూ మరియు కాశ్మీర్ ప్రభుత్వంలోని ఫ్లోరికల్చర్ డిపార్ట్‌మెంట్ నిర్వహిస్తోంది. ఈ ఉద్యానవనానికి భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరు పెట్టారు.

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది ప్రపంచ రికార్డులను జాబితా చేసే పుస్తకాలను ప్రచురించే బ్రిటిష్ సంస్థ. ఇది 1985లో స్థాపించబడింది మరియు ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది.

2023 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ విజేతగా స్పెయిన్

ఫిఫా మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2023 ఫైనల్లో స్పెయిన్ 1-0తో ఇంగ్లాండ్‌ను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ జట్టుకు ఇది మొదటి ప్రపంచ కప్ ట్రోఫీ. 2007 లో జర్మనీ తర్వాత ఫిఫా టైటిల్ పొందిన  యూరోపియన్ దేశంగా స్పెయిన్ అవతరించింది. అలానే విమెన్ & మెన్ ప్రపంచ టైటిల్ పొందిన రెండు దేశాలు కూడా ఇవే.

ఆస్ట్రేలియాలోని సిడ్నీ స్టేట్ థియేటర్‌లో ఈ మ్యాచ్ జరిగింది. 1966 తర్వాత మొదటిసారి ప్రపంచ కప్‌ను ఇంగ్లాండ్‌కు తిరిగి తీసుకురావడానికి వంద శాతం ప్రయత్నించింది అయితే ఆస్ట్రేలియా స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో 75,784 మంది సొంత ప్రేక్షకుల ముందు ఓటమి పాలయ్యింది. సరీనా వీగ్‌మాన్ ఇంగ్లాండ్ జట్టు బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి 39 మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌ కేవలం రెండు మ్యాచులలో మాత్రమే ఓటమి చెందింది. అందులో ఈ ఫైనల్ మ్యాచ్ ఒకటి.

2023 వన్డే ప్రపంచ కప్ కోసం రెండు మస్కట్‌లు ఆవిష్కరణ

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎట్టకేలకు భారత్‌లో అక్టోబర్ 5న ప్రారంభమయ్యే క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం రెండు మస్కట్‌లను ఆవిష్కరించింది. భారతదేశంలోని గురుగ్రామ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అండర్-19 ప్రపంచ కప్-విజేత కెప్టెన్లు, యష్ ధుల్ మరియు షఫాలీ వర్మలు ఈ మస్కట్‌లు విడుదల చేశారు. ఈ మస్కట్‌లు క్రిటోవర్స్ అనే సుదూర క్రికెట్ ఆదర్శధామం నుండి ఉద్భవించాయని వెల్లడించారు. ఈ మస్కట్‌లు లింగ సమానత్వం మరియు వైవిధ్యానికి చిహ్నాలుగా కనిపిస్తున్నాయి. వీటికి పేరు పెట్టె అవకాశాన్ని క్రికెట్ అభిమానులకు అందించారు.

సౌత్ ఇండియా బ్యాంక్ కొత్త ఎండీ, సీఈవోగా పీఆర్ శేషాద్రి

సౌత్ ఇండియన్ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పిఆర్ శేషాద్రి నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. సెప్టెంబరు 2023లో పదవీవిరమణ చేయాలని నిర్ణయించుకున్న మురళీ రామకృష్ణన్ తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

శేషాద్రి బ్యాంకింగ్ పరిశ్రమలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న నిష్ణాతుడైన బ్యాంకర్. అతను ది కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్, సిటీ బ్యాంక్, ఆసియా పసిఫిక్, సింగపూర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు రీజినల్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హెడ్, సిటీ బ్యాంక్, ఆసియా పసిఫిక్, సింగపూర్‌తో సహా వివిధ బ్యాంకులలో సీనియర్ పదవులను నిర్వహించారు.

భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభం

రోడ్డు రవాణా మరియు రహదారుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆగస్టు 22, 2023న భారత్ కొత్త కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (భారత్ NCAP)ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం భారతదేశంలోని ప్రయాణీకుల వాహనాలకు స్వచ్ఛంద భద్రతాకు సంబందించిన రేటింగ్ ప్రోగ్రామ్. భారతదేశంలో 3.5-టన్నుల వాహనాలకు వాహన భద్రతా ప్రమాణాలను పెంచడం ద్వారా రహదారి భద్రతను మెరుగుపరచడం ఈ కార్యక్రమం లక్ష్యం.

ఈ కార్యక్రమం కింద, కార్ల తయారీదారులు ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (AIS) 197 ప్రకారం స్వచ్ఛందంగా పరీక్షించబడిన తమ కార్లను మార్కెట్లోకి విడుదల చేయాల్సి ఉంటుంది. భారత్ ఎన్‌సిఎపి, గ్లోబల్ ఎన్‌సిఎపి (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్)పై ఆధారపడి పని చేస్తుంది. క్రాష్ టెస్ట్‌లలో వాటి పనితీరు ఆధారంగా 1 నుండి 5 నక్షత్రాల స్కేల్‌లో వాహనాలను అంచనా వేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. భారత్ ఎన్‌సిఎపి ప్రారంభించడం భారతదేశంలో వాహనాల భద్రతను మెరుగుపరచడానికి ఒక ముఖ్యమైన అడుగు.

ఇది వినియోగదారులకు వాహనాల భద్రత గురించి అవగాహన కల్పించడానికి సహాయపడుతుంది. తయారీదారులను వారి వాహనాల భద్రతా లక్షణాలను మెరుగుపరచడానికి ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమాన్ని దశలవారీగా ప్రారంభించాలని భావిస్తున్నారు, చిన్న కార్లను ముందుగా ప్రయోగించి, భవిష్యత్తులో అన్ని ప్యాసింజర్ వాహనాలను కవర్ చేసేలా కార్యక్రమం విస్తరించబడుతుంది.

చంద్రుడిపై కూలిన రష్యా లూనా 25 అంతరిక్ష నౌక

రష్యా యొక్క మానవరహిత లూనా - 25 వ్యోమనౌక అదుపు తప్పి చంద్రునిపై కూలిపోయింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత రష్యా చేపట్టిన తొలి చంద్రుని యాత్ర ఇది. ఈ ప్రయోగం విజయంవంతమైతే ఈ క్రాఫ్ట్ చంద్రుని యొక్క దక్షిణ ధృవం మీద ల్యాండ్ అయిన మొట్టమొదటిది అయ్యిండేది, అయితే ల్యాండింగ్ కక్ష్యలోకి వెళ్లడంలో సమస్యలను ఎదుర్కొన్న తర్వాత ఈ ప్రయోగం విఫలమైంది.

గడ్డకట్టిన నీరు మరియు విలువైన మూలకాలను కలిగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్న చంద్రుని యొక్క దక్షిణ ధృవాన్ని అన్వేషించడానికి ఇది సెట్ చేయబడింది. భారత్ ఇప్పటికే దీనికి సంబంధించి చంద్రయాన్ 3 ప్రయోగం నిర్వహిస్తుండగా, భారత్ కంటే ముందు ఆ ఘనతను పొందేందుకు రష్యా దీనిని ప్రయోగించేంది.

800 కేజీల బరువున్న ఈ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై ఢీకొనడంతో ఆగిపోయిందని ప్రాథమిక పరిశోధనల్లో తేలింది. మిషన్ ఎందుకు విఫలమైందో ప్రత్యేక కమిషన్ పరిశీలిస్తుందని పేర్కొంది. లూనా-25 కోల్పోవడం రోస్కోస్మోస్‌కు దెబ్బ. రష్యా యొక్క పౌర అంతరిక్ష కార్యక్రమలు చాలా సంవత్సరాలుగా మూలనపడ్డాయి. రష్యా మెజారిటీ బడ్జెట్ సైన్యం కోసం కేటాయిస్తుంది.

Advertisement

Post Comment