Advertisement
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ | కోర్సులు & ప్రవేశాలు
Universities

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ | కోర్సులు & ప్రవేశాలు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 1982 లొ ఏర్పాటు చేశారు. సమాజంలో అందరికి ఉన్నత విద్య లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా మహిళా ఉన్నత విద్యకు తోడ్పాటు అందించటంతో పాటుగా, ఉన్నత విద్యకు నోచుకోని చిరు ఉద్యోగులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో దీన్ని నెలకొల్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రెండు తెలుగు రాష్ట్రాలల్లో 213 స్టడీ సెంటర్లు కలిగిఉంది. అంతేకాకుండా 23 ప్రాంతీయ సమన్వయ సెంటర్లు, మరో 14 మహిళా పీజీ సెంటర్లను నడిపిస్తుంది.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విభిన్న అంశాలలో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు డిప్లొమా & సర్టిఫికేటెడ్ కోర్సులు అందిస్తుంది. అన్ని కోర్సులు కనీస-గరిష్ట కాలవ్యవధిలో పూర్తిచేసే అవకాశం కల్పిస్తుంది. ఓపెన్ యూనివర్సిటీ అందించే అన్ని కోర్సులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డిజిటల్ ట్యుటోరియల్స్ అందిస్తుంది. ఓపెన్ యూనివర్సిటీ అందించే అన్ని కోర్సులకు యూజీసీ గుర్తింపు ఉంది.

వెబ్సైటు : www.braou.ac.in
స్టూడెంట్ సహాయ హెల్ప్ లైన్ : 23680222
ఎగ్జామినేషన్ హెల్ప్ లైన్ : 23680555
జనరల్ హెల్ప్ లైన్ : 23680333
యూజీ కోర్సుల సహాయం : 23680250
పీజీ కోర్సుల సహాయం : 23680251
అకాడమిక్స్ : 23680410
స్టడీ మెటీరియల్ హౌస్ : 23680 376 / 379